E-Paper
Advertisement

IRAN War: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్

IRAN War: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్
Advertisement

IRAN War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం అనేక రంగాలకు కుదిపేస్తోంది. కేవలం ఎల్‌పీజీ గ్యాస్, ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం సెగలు వేసవి కాలం ప్రారంభం కావడానికి ముందే ప్యాక్ చేసిన నీటి బాటిళ్ల మార్కెట్‌ను కుదిపేస్తోంది. యుద్ధానికి నీటికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ

Advertisement

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వాటర్ బాటిల్ పరిశ్రమ ఒకటి. దేశంలో ప్యాకేజ్డ్‌ వాటర్‌ మార్కెట్‌ దాదాపు 5 బిలియన్‌ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.46,000 కోట్లు అన్నమాట. తాజాగా యుద్ధం ప్రభావం తాగునీటి సీసాలు, మూతలపై పడింది. అసలే వేసవి కాలం తీవ్రమవుతున్న తరుణంలో నీటి సీసాల ధరలు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో కొంతమంది తయారీ, పంపిణీదారుల వాటర్ బాటిళ్ల ధరలను పెంచేందుకు రెడీ అయ్యారు.

ప్లాస్టిక్‌ బాటిళ్ల తయారీలో పాలిమర్‌ కీలక ముడి వస్తువు. ఇది కేవలం ముడి చమురు నుంచి వస్తుంది. మార్కెట్లో చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో పాలిమర్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. సీసాల తయారీలో ఉపయోగించే ముడిపదార్థం ధర 50 శాతం పెరిగింది. అంటే కిలోకు రూ.170కు చేరింది. బాటిల్ మూతల ధర రెట్టింపు కంటే ఎక్కువ. ఒక్కొక్కటి బాటిల్‌పై దాదాపు అర్ధరూపాయి చేరినట్లు సమాచారం.

Advertisement

మంచినీటి బాటిళ్ల ధరలు పెరిగే అవకాశం

ఇక ప్యాకింగ్‌ బాక్సులు, లేబుల్స్, టేపుల ధరలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. దీని విషయంలో పెద్ద కంపెనీలు పెరిగిన ముడి వస్తువుల ధరల భారాన్ని భరిస్తున్నాయి. సీసాలు తయారీ దాదాపు 2000 సంస్థలు తమ రీసెల్లర్ల కోసం ధరలను బాటిల్‌కు రూపాయి చొప్పున పెంచారట.

వచ్చేది వేసవికాలం కావడంతో రాబోయే రోజుల్లో ఇది మరో 10 శాతం పెరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. నార్మల్ గా వినియోగదారులు ఒక లీటర్‌ నీటి సీసాకు 15 నుంచి 20 రూపాయాలు చెల్లిస్తున్నారు. రాబోయే 4 లేదా 5 రోజుల్లో వినియోగదారులపై ధరలపై ప్రభావం చూపుతుందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి అపూర్వ దోషి అన్నారు.

ALSO READ: ఈ టిప్స్ పాటిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు సేఫ్!

1.4 బిలియన్ల జనాభా కలిగిన భారత్‌లో పరిశుభ్రమైన నీరు విలాసంగా మారింది. దేశంలో 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు బాటిల్ వాటర్‌పై ఆధారపడతారు. అందులో బిస్లరీ, కోకా-కోలా, కిన్లీ, పెప్సీస్, అక్వాఫినా, రిలయన్స్, టాటా సంస్థలు దాదాపు 5 బిలియన్ల మార్కెట్‌లో వాటా కోసం పోటీ పడుతున్నాయి. మొత్తానికి యుద్ధం ప్రభావం మంచినీటి బాటిళ్లపై పడనుంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×