E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిపై పార్వతి ప్రశంసలు.. పల్లవి మాస్టర్ ప్లాన్.. 50 లక్షలు కొట్టేసిన దొంగ..

Intinti Ramayanam Today Episode: అవనిపై పార్వతి ప్రశంసలు.. పల్లవి మాస్టర్ ప్లాన్.. 50 లక్షలు కొట్టేసిన దొంగ..
Advertisement

Intinti Ramayanam Today Episode May 16th : అవని ఆ డబ్బులు తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి అక్షయ్ ని పిలుస్తుంది. ఇదిగోండి 50 లక్షలు అని ఆ బ్యాగ్ ని అక్షయ్కిస్తుంది. ఈ డబ్బులను తీసుకొని వెళ్లి ఆ ఫైనాన్సియర్ కు కట్టండి.. మనం ఈ సమస్య నుంచి బయటపడినట్లే అని అవని అనగానే ఆ బ్యాగ్ లో ఏముంది అని చెక్ చేసిన అక్షయ్ డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంత డబ్బులు ఎలా వచ్చాయని పల్లవి కూడా షాక్ అవుతుంది. అయితే ఈ డబ్బులు ఎలా వచ్చాయని అడుగుతాడు అక్షయ్. నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానండి మీరు ఏమి ఆలోచించకుండా వెళ్లి ఆ డబ్బులని కట్టండి అని అవని చెబుతుంది.. ఆ డబ్బులను చూడగానే పల్లవి షాక్ అవుతుంది.

అవని పై పార్వతి ప్రశంసలు..

అవని ఇంట్లోని సమస్యని తీర్చింది అని అక్షయ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇంత డబ్బులు నీకు ఎక్కడివి అవని అని అక్షయ్ అనుకుంటాడు. ఈ డబ్బులు ఎక్కడివి కాదండి నా ఫ్రెండ్ ని సహాయం అడిగాను తాను మాత్రం సాయం చేసింది. 50 లక్షలు ముందు ఆ ఫైనాన్స్ ఇయర్ కి కట్టేసి మన సమస్యని తీర్చేసుకుందాము అని అవని అంటుంది. అయితే ఇన్ని రోజులు ఆ 50 లక్షలు కట్టడానికి ఎంతో బాధపడ్డాను.. ఇప్పటివరకు ఈ గుండె నీ చేతిలో పెట్టుకొని చాలా బాధపడ్డాను ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాను అని పార్వతి అంటుంది. పార్వతి అవని పై ప్రశంసలు కురిపిస్తుంది. కమల్ కూడా నువ్వు ఇంట్లో ఏ సమస్య వచ్చినా తీర్చేస్తున్నావు వదినా అని కూడా పొగడ్తల వర్షం కురిపిస్తాడు.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

పల్లవి 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు. డబ్బులు ని వీల్లు కట్టలేరు కచ్చితంగా పరువు పోతుంది అని నేను అనుకున్నాను. కానీ అవని మాత్రం సాధించింది అని పల్లవి అనుకుంటుంది.. ఎలాగైనా సరే అవనిని మళ్లీ దెబ్బకొట్టేలా ప్లాన్ చేయాలి అని పల్లవి అనుకుంటుంది.. కమల్ ఏంటి బెల్లం కొట్టిన రాయి లాగా అలా ఉండి పోయావు వదిన ఇంత మంచి పని చేసింది కదా కనీసం పొగడాలని కూడా లేదా నీకు అని అంటాడు. అక్క చేసింది మంచి పనే కదా అవును అని పల్లవి ఏదో మొహమాటంగా అంటుంది..

అక్షయ్ ను చూసి అంతా షాక్..

రాత్రి భోజనం చేయడానికి అని అందరూ కూర్చుంటారు.. అందరూ కలిసి చాలా సంతోషంగా భోజనానికి కూర్చుంటారు.. పార్వతి మీ అమ్మని కూడా కూర్చోమని చెప్పు అని అంటే లేదు అమ్మ కిందకి తినిపించాను అని అవని అంటుంది.. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వదినా వడ్డించు ఆకలి దంచేస్తుంది అని కమల్ అంటాడు. అక్షయ్ మాత్రం వడ్డించగానే గ్యాప్ లేకుండా తినడంతో.. అతని తిండిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా కక్కుర్తి లా తింటున్నావు అని పార్వతి అంటుంది.. ఫైనాన్షియర్ వచ్చి డబ్బులు గురించి చెప్పిన తర్వాత అన్నయ్య రెండు రోజుల నుంచి సరిగ్గా తినలేదు. ఇవాళ డబ్బులు రావడంతో ఆకలి గుర్తుకు వచ్చినట్లుంది నువ్వు తిను అన్నయ్య అని కమలంటాడు.. అక్షయ్ ను చూసి అందరూ బాధపడతారు..

ప్రణతికి భరోసా ఇచ్చిన అవని..

Advertisement

భరత్ ఎంత చెప్పినా సరే తన మాట వినడం లేదని బాధ పడిపోతూ ఉంటుంది ప్రణతి. అంతేకాదు భరత్ ని ఎలాగైనా సరే మార్చి తనతో పాటు బయటికి తీసుకెళ్లాలి ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక అవనికి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్తుంది. ప్రణతి నువ్వేం బాధపడకు నేను ఇప్పుడు ఒక చిన్న పనిలో ఉన్నాను. ఆ సమస్య తీరగానే భరత్ ని మనసు మార్చి మన ఇంటికి వెళ్లేలా చేస్తాను అని అవని అంటుంది.. నా సమస్యను నీకు చెప్పి బాధ పెట్టాలని కాదు వదినా నీకు తప్ప నేను ఈ సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేను అని ప్రణతి బాధపడిపోతుంది. నువ్వేం బాధపడకు ప్రణతి నీ సమస్యను తీర్చే బాధ్యత నాది భరత్ నేను మళ్ళీ మార్చి నువ్వు కోరుకున్నట్లే చేస్తాను అని అవని ప్రణతికి మాట ఇస్తుంది. ఆ మాట వినగానే ప్రణతి చాలా సంతోషంగా ఉంటుంది.

డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ..

డబ్బులు అందయని ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా భోజనం చేసి గుర్రు పెట్టి నిద్రపోతారు.. అదే సమయంలో ఒక దొంగోడు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.. అతను మొత్తం డెటికి నేరుగా అవని వాళ్ళ రూంలోకి వెళ్లి అవని తెచ్చిన 50 లక్షలు ఉన్న బ్యాగు ని తీసుకొని అక్కడి నుంచి ఊడ ఇస్తాడు అతను వెళ్లే క్రమంలో బయట ఒక బొమ్మ కింద పడిపోవడంతో అందరూ ఎవరో వచ్చి వెళ్లారని అతని కోసం వెతుకుతారు కానీ ఆ దొంగ డబ్బులు తీసుకుని పారిపోతాడు. ఆ దొంగ కోసం అందరూ కూడా తలా ఒక దిక్కు వెళ్లి వెతుకుతారు కానీ ఎక్కడ కనిపించకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వస్తారు అయితే అవనికి అనుమానం రావడంతో వెళ్లి తన గదిలో 50 లక్షల బ్యాగు ఉందో లేదో అని చెక్ చేస్తుంది అక్కడ బ్యాగు లేకపోవడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ పై ప్రేమ సీరియస్.. నర్మద కౌంటర్.. ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×