BigTV English

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అవని.. కమల్ పంచ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అవని.. కమల్ పంచ్..

Intinti Ramayanam Today Episode May 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య స్కూల్ ఈవెంట్ కోసం అందరు స్కూల్ కు వెళ్తారు. ముందుగా అవని రాజేంద్రప్రసాద్ ఆరాధ్య అక్కడికి వస్తారు. అయితే అక్షయ్ వాళ్ళు ఇంకా రాకపోవడంతో ఆరాధ్య నాన్న రాడా అమ్మ అంటూ టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడికి పార్వతీ పల్లవి, శ్రీయా, కమల్ వస్తారు. అందరూ ఆరాధ్యను చూసి సంతోష పడతారు. చూడగానే ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వు రావని అనుకున్న నాన్న కానీ అమ్మ చెప్పినట్లే నువ్వు వస్తావని వచ్చేసావు అని ఆరాధ్య అంటుంది. నీకోసం రాకుండా ఎలా ఉంటాను నాన్న అని అక్షయ్ ఆరాధ్యం ఎత్తుకొని ముద్దాడతాడు. ఆరాధ్యని ఎత్తుకొని ముద్దులు వర్షం కురిపిస్తాడు కమల్.. ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ నువ్వు ఎలా ఉన్నారని అడుగుతుంది. మంచి మనసులు మధ్య ఉన్నాను కదా మనశ్శాంతి గానే ఉన్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కమల్ గూడా బాగున్నారు నాన్న అంటే మంచి మనుషులే కదరా బాగానే ఉన్నాను అని సమాధానం చెప్తాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. కమల్ ఆరాధ్య చేసిన ప్లాన్ గురించి పల్లవి తెలుసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే…అక్షయ్ దగ్గరకు వెళ్లిన అవని మీరు రారేమో అనుకున్నానండీ.. మీరు రాకపోతే ఆరాధ్య చాలా ఫీల్ అయ్యేది. వచ్చినందుకు చాలా థాంక్స్ అండీ’అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. నేను వచ్చింది నీ కోసం కాదు.. నా కూతురి కోసం అని అంటాడు. నాకోసం వచ్చారని చెప్పడం లేదు.. నా కోసం రాలేదని అంటున్నారంటే.. నా గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట అని అంటుంది అవని.. అదంతా నీ భ్రమ మాత్రమే నేను వచ్చింది నా కూతురు కోసమే అని అక్షయ్ తేల్చి చెప్పేస్తాడు. నాది భ్రమకావచ్చు. రేపు అనేది మాత్రం నిజం. మీరు నాకోసం వచ్చేరోజు దగ్గరలోనే ఉంది అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. జరగని వాటి కోసం ఎక్కువ ఆలోచించుకోకు. ఆశలు పెట్టుకోకు అని అంటాడు. మనిషిని బతికించేదే ఆశ. అందర్నీ ఫంక్షన్ లో హాల్లో కూర్చొని టీచర్లు చెప్తారు.. ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ వచ్చారని చెప్పారు. అందరూ స్కూల్ గురించి స్కూల్ గొప్పతనం గురించి అలాగే పిల్లల తీరు గురించి గొప్పగా చెప్తారు. అందులో ఆరాధ్యను ఎక్కువగా మెన్షన్ చేస్తూ చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సంతోష పడతారు.

కమల్ రాజేంద్రప్రసాద్ ని పార్వతిని ఒకచోట కూర్చో పెడతాడు.. అలాగే అక్షయ్ పక్కన అవని నీ కూర్చోమని చెప్తాడు. కానీ అక్షయ మాత్రం అవని పక్కన కూర్చోడానికి ఇష్టపడడు. అమ్మానాన్నలు కూర్చున్నారు అన్నయ్య.. అందరు చూస్తే బాగోదు ఆరాధ్యకు అవార్డులు ఇచ్చేటప్పుడు మీరిద్దరు పక్కపక్కనే ఉంటే చూడ్డానికి బాగుంటుంది. కూర్చుని కమల్ ఒప్పించి పక్కపక్కన కూర్చో పెడతాడు. కేవలం నేను ఆరాధ్య కోసం మాత్రమే నీ పక్కన కూర్చున్నాను అది గుర్తుపెట్టుకో సంతోష పడకు అని అవనికి అక్షయ్ అంటాడు. దానికి బాగానే చేశారు కానీ మీరు నా చీర కొంగు మీద కూర్చున్నారు అది గమనించండి అని అనగానే అక్షయ్ కాలు లేపుతాడు.


అవని అక్షయ్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసి అటు పార్వతి షాక్ అవుతుంది.. అలాగే శ్రియ, పల్లవి ఇద్దరు కూడా కుళ్లుకుంటారు. వాళ్ళిద్దర్నీ నేను విడగొడతానని ఇక్కడ తీసుకొచ్చావు నువ్వే వాళ్ళిద్దర్నీ కలిపే లా ఉన్నావ్ వీళ్ళిద్దరిని చూడలేక చచ్చిపోతున్నాను అని శ్రియ అంటుంది.. అవార్డులను తీసుకోవడానికి ఆరాధ్యను తిను స్టేజ్ మీదకి రమ్మని టీచర్ పిలుస్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళిన ఆరాధ్య. నేను ఈ అవార్డులను మా అమ్మ నాన్న చేత తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆరాధ్యకు వాళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషంగా చూసుకుంటున్నారో అందుకే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చేతుల మీదుగాని అవార్డులు తీసుకోవాలని కోరుకుంటుందని కలెక్టర్ అంటాడు. అవార్డులను తీసుకున్న తర్వాత ఒక ఆవిడొచ్చి నేను మాట్లాడాలని స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న కలిసేం లేరు విడివిడిగా ఉన్నారు అని పరువు పోయేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత అవని మైకు తీసుకొని మాట్లాడుతుంది.

ఈవిడ ఎవరో కానీ బాగానే చెప్పింది.. ఆయనకు నాకు మాటలు లేవన్న సంగతి తెలుసుకొని మరి బాగా చెప్పింది. భార్యాభర్తల అన్నాక గొడవలు సరసాలు, సరదాలు కామన్.. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారు. మీరెప్పుడూ మీ భర్తలతో లేదా మీ భార్యలతో గొడవ పడుకున్న ఉన్నారా అని దిమ్మతిరిగి పోయాలా అవని సమాధానం చెప్తుంది. ఆ మాట విన్న కమల్అవని పై ప్రశంసలు కురిపిస్తాడు.. ఇలాంటి వాళ్లకి దిమ్మతిరిగిపోయిన సమాధానం చెప్పిన వదిన అనేసి పొగుడుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×