E-Paper
Advertisement

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!
Advertisement

Delhi Protest: దేశ రాజధాని దిల్లీ మరోసారి రణరంగంగా మారింది. ఒకవైపు తమ భవిష్యత్తు కోసం గళమెత్తిన విద్యార్థులు, మరోవైపు తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులు ఒకేసారి రోడ్డెక్కడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికారుల హెచ్చరికలను పక్కనపెట్టి వేలాది మంది యువత సోమవారం పార్లమెంటు దిశగా దూసుకెళ్లడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి పెద్ద ఎత్తున వీడియోలు మంగళవారం వైరల్ గా మారాయి.

కాక్రోజ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఛలో పార్లమెంటు మార్చ్ కు వేలాదిగా యువకులు తరలిరావడంతో దిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో యువత, పోలీసుల మధ్య ఘర్షణలో చోటుచేసుకున్నాయి. ఓ యువకడు పోలీసులపైకి పెప్పర్ స్ప్రే కొట్టి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు కేంద్రానికి అనుకూలమైన మీడియా అని ఆరోపిస్తూ ఓ రిపోర్టర్ పట్ల నిరసనకారులు అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

Advertisement

మరోవైపు నిరసనకారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను ఓ యువతి కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మేము మీ పిల్లలాంటి వాళ్లమే కదా. మేమేం టెర్రరిస్టులం కాదు కదా’ అంటూ చేతులు జోడించి ఓ మహిళా పోలీసు అధికారిణిని యువతి ప్రశ్నించింది. అటు ఇంకో యువతి పోలీసులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. ‘మీరు ఖాకీలు కాదు.. బీజేపీ గుండాలు’ అంటూ ఓ పోలీసు అధికారి కాలర్ పట్టుకొని నిలదీసే ప్రయత్నం చేసింది.

Advertisement

మరోవైపు విపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష కాంగ్రెస్ సైతం మంగళవారం దిల్లీలో రోడ్డెక్కింది. నిరసనకారులపై జరిగిన లాఠీఛార్జ్ ను ఖండిస్తూ ప్రధాని మోదీ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. రాహుల్ గాంధీ తో పాటు ప్రియాంకా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ అగ్రనేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

సీజేపీ, కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్న క్రమంలోనే అటు రైతులు సైతం దిల్లీలోకి నిరసనలకు పిలుపునిచ్చారు. ఇవాళ మహాపంచాయత్ లో పాల్గొనేందుకు దిల్లీకి వస్తున్న పంజాబ్, హర్యానా రైతులను శంభు బార్డర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఈ నిరసనకు దిగారు. ప్రస్తుతం దిల్లీ బోర్డర్ లోనే వారు ఉన్నారు. దీంతో పరిస్థితులు ఏ విధంగా మారతాయన్న ఆందోళనలు మెుదలయ్యాయి.

Also Read: భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×