E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన చక్రధర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రాజేశ్వరి కోసం అవని నిర్ణయం..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన చక్రధర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రాజేశ్వరి కోసం అవని నిర్ణయం..
Advertisement

Intinti Ramayanam Today Episode November 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ పల్లవి తన తండ్రికి సపోర్ట్ చేసిందని తెలుసుకుని ఇవాళ దాని సంగతి చెప్తాను అని ఆవేశంగా ఇంటికి బయలుదేరుతాడు. కమల్ ఆవేశంగా వెళుతున్నాడు పల్లవిని ఏదో ఒకటి చేస్తాడు మనం వెళ్దాం పదండి అనేసి అవని అంటుంది. అయితే మధ్యలో అవనివల్ల స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో కాసేపు ఆగుతారు. అప్పుడే కమల్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.  పల్లవి అని కేకలు పెట్టి అరుస్తాడు. ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావ్ పిచ్చి పట్టిందా ఏంటి అని అక్కడున్న అందరూ అడుగుతారు.

కమల్ పల్లవి చేసిన దారుణాన్ని అందరికీ చూపిస్తాడు.. మొదట నమ్మక పోయినా కూడా పల్లవి ఇలా చేసిందని ఆ వీడియోని చూసి అందరూ నమ్మి తనని అందరూ అంటారు. బయటికి వచ్చిన తర్వాత పల్లవి నేను ఒక వీడియో చూపిస్తాను అది నేను కాదు మీరు చూడండి అని అంటుంది.. అది చూసి పల్లవి తప్పు చేయలేదని అనుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి చక్రధర్ ఇంటికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..అక్షయ్ కి అభి ఫోన్ చేసి అన్ని చేసింది చక్రధరని రుజువైంది మేము అతని అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్తున్నాము అని అంటాడు. అక్షయ్ ఇంట్లోని వాళ్ళందరిని తీసుకొని అక్కడికి బయలుదేరుతారు.. చక్రధర్ ని అరెస్ట్ చేసేందుకు అభి అన్ని సిద్ధం చేస్తాడు.. నువ్వు ఇంకా తప్పించుకోవడం కుదరదు అని చక్రధర్ ని అరెస్ట్ చేస్తారు.. నువ్వు ఎన్ని మోసాలు చేసావో ఇప్పుడే తెలుస్తుంది ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయో వెతకండి అని అవి కానిస్టేబుల్ తో చెప్తారు. అంత వెతికి అవని ఇంటి డాక్యుమెంట్స్ ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వస్తారు.. ఇవన్నీ చేసింది నువ్వా ఇవి ఇన్ని రోజులు నువ్వు మంచి వాడివి అని అనుకున్నామని ముగ్గురు చక్రధర్ ని కొట్టాలని అనుకుంటారు..

కానీ అభి మీ ముగ్గురు కవి కొడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అక్షయ్ వెనక్కి వెళ్ళు అనేసి అంటాడు.. మా ఆస్తులన్నీ పోవడానికి కారణం బయట వాళ్ళని ఇన్ని రోజులు అనుకున్నాను.. ఇప్పుడు తెలుస్తుంది మా ఆస్తులు పోవడానికి కారణం నువ్వు అని.. మా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నాకు తెలుసు నువ్వు ఎంత ఎదవ అని.. కానీ ఇంత ఎదవని నేను అసలు ఊహించలేదని రాజేంద్ర ప్రసాద్ అంటాడు.. పార్వతి సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా మిమ్మల్ని అభిమానించాను రాఖీ కట్టి మిమ్మల్ని అన్నయ్య అని ప్రేమగా పిలిచాను.

Advertisement

నీ కూతురిని నా ఇంటి కోడల్ని చేసుకున్నాను అలాంటిది నా ఇంటిని ముక్కలు చేశారు మీకు ఎలా మనసొచ్చింది అని అడుగుతుంది.. ఇన్ని రోజులు నా అల్లుడు మంచివాడే అని అనుకుంటున్నాను కానీ ఇలాంటి దుర్మార్గుడు అని నాకు తెలియలేదు అని భానుమతి కూడా అంటుంది.. ఇక శ్రీయ కూడా పల్లవి వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుతుంది. పాపం పండింది అన్ని నిజాలు బయటకు వచ్చాయి అని అవని కూడా అంటుంది.. ఇక వెధవను ఇక్కడ ఉంచకండి అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అని అక్షయ్ అంటాడు.. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మూడు పూటలా అన్నం పెట్టడం కాదు కీళ్లు ఇరిగేలా కొట్టండి అని కమల్ అంటాడు..

ఇక అందరూ ఇంటికి వచ్చేసి నా అల్లుడే ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడతాడని నేను అస్సలు ఊహించలేదని భానుమతి అంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా రాజేశ్వరి ఒంటరిగా ఉండి బాధ పడుతూ ఉంటుంది అని ఆలోచిస్తారు.. రాజేశ్వరిని ఎలాగైనా సరే ఈ ఇంటికి తీసుకురావాలి అని అవని అనుకుంటుంది.. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఆ దుర్మార్గున్ని పెళ్లి చేసుకున్న తర్వాత తాను అనుభవించాలి అని అంటాడు. ఇక పల్లవి రాత్రి తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మా నాన్న జైల్లో ఉన్నాడు అరెస్ట్ చేశారు విడుదల చేయించాలి అని అడుగుతుంది..

మీ నాన్న ఏ తప్పు చేశారో ఏంటో తెలియకుండా ఎలా బెయిల్ ఇప్పిస్తారు అని పల్లవికి షాక్ ఇస్తారు.. ఇక ఆరాధ్య వచ్చి పిన్ని నా డ్రాయింగ్ బుక్ మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. ఈ డ్రాయింగ్ బుక్ ఏమైనా ఇది అనుకున్నావా నా దగ్గర ఉండడానికి వెళ్ళు బయటకు వెళ్లి తోసేస్తుంది.. అవని వచ్చి చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు అని గట్టిగానే బుద్ధి చెబుతుంది. మా నాన్న అరెస్టు చేసి ఉంచారు మీ నాన్న గురించి తెలిసి ఉంటే అప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలిసేదని అంటుంది పల్లవి.

Also Read: ఇంట్లో చిచ్చు పెట్టిన శ్రీవల్లి.. రామరాజు ఎమోషనల్.. గిల్ట్ నగల మ్యాటర్ బయటపడుతుందా..?

అవని మాత్రం మీ నాన్న ఏమైనా మంచివాడు అనుకున్నావా మంచి వాడిని అరెస్ట్ చేశారు కదా అని బాధపడ్డానికి.. ఒక దుర్మార్గుడు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేశాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేయడం కాదు.. చంపేసిన తప్పులేదు అని అంటుంది.. ఇకమీదటైనా నువ్వు బుద్ధిగా ఉండు లేదంటే మీ నాన్న దగ్గరికి నువ్వు కూడా వెళ్తావని వార్నింగ్ ఇస్తుంది.. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతావా మీ నాన్న ఎవరో తెలుసుకొని అతని అరెస్ట్ చేసేలా చేస్తాను అని పల్లవి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×