E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో చిచ్చు పెట్టిన శ్రీవల్లి.. రామరాజు ఎమోషనల్.. గిల్ట్ నగల మ్యాటర్ బయటపడుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో చిచ్చు పెట్టిన శ్రీవల్లి.. రామరాజు ఎమోషనల్.. గిల్ట్ నగల మ్యాటర్ బయటపడుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి మాత్రం నర్మద, సాగర్ ను బుక్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది..అందరి కోసం పాయసం చేసి తీసుకొని వస్తుంది శ్రీవల్లి. శత్రువు ఈరోజు అడ్డంగా దొరికిపోతుంది దాన్ని నేను సెలెబ్రేట్ చేసుకోవాలి.. ఈ పాయసం అందుకే అని మనసులో అనుకుంటుంది. అందరిని సంతోషంగా పిలుస్తుంది వేదవతి ఏంటే నీకు ఆనందం వచ్చిన తట్టుకోలేము ఆవేశం వచ్చినా తట్టుకోలేము ఏం జరిగింది అని అడుగుతుంది. మీ అందరి కోసం పాయసం చేసే తీసుకొచ్చాను.. తీసుకోండి అని అంటుంది.. ఏంటమ్మా ఇవాళ స్పెషల్ ఎవరిదైనా పుట్టినరోజు గాని పెళ్లిరోజు గాని ఉందా అని రామరాజు అడుగుతాడు..

అలాంటిదేమీ లేదు మావయ్య మరి కాసేపట్లో మీకు అన్ని నిజాలు తెలుస్తాయని శ్రీవల్లి అంటుంది..ఏంటో అసలు విషయం చెప్పమ్మా అని రామరాజు అడుగుతాడు.. శ్రీవల్లి నర్మదా సాగర్ మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని అంటుంది. ఏంటి ఏం చెప్పాలి అని నర్మదా అంటుంది. సాగర్ ఎగ్జామ్ రాసారండి సెలెక్ట్ అయ్యాడు మరికొద్ది రోజుల్లో గవర్నమెంట్ ఆఫీసర్ గా చేయబోతున్నాడని బాంబ్ పేలుస్తుంది. ఆ తర్వాత పెద్ద రచ్చకు ఆజ్యం పోస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. వేదవతి అక్కడికి వచ్చి రండి భోజనం చేద్దురు అని అంటుంది. నాకు ఆకలిగా లేదు బుజ్జమ్మ అని అంటాడు.. అంటే అన్నానంటారు కానీ మీరు నిన్నటి నుంచి ఏమీ తినలేదు రండి భోజనం చేద్దురు అని అడుగుతుంది.. మాటకి ఎక్కడ విలువ ఉంది నా ఇంట్లో సంతోషం ఎక్కడుంది నేను భోజనం ఎలా చేస్తానని అనుకుంటున్నావు అని రామరాజు అంటాడు. వాళ్లకి మీరంటే ఎంతో అభిమానం గౌరవం ఉందండి మీరు అలా బాధపడకండి అని వేదవతి అంటుంది.. మాట్లాడుతున్నావ్ తండ్రి అంటే ఆ మాత్రం భయము అభిమానము ఉంటే ఇలా చేయరు అని రామరాజు అంటాడు.

ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. తండ్రి మాట లెక్క చేయలేదు కొడుకులు. ఇక నాకు నా మాటకు ఎక్కడ విలువ ఉంది… నేను ఎంత చేసినా సరే వీళ్ళు నన్ను ఒక విలన్ లాగా చూస్తున్నారు తప్ప కన్న తండ్రి మనసుని అర్థం చేసుకోవట్లేదు అని రామరాజు బాధపడతాడు.. శ్రీవల్లి ఇది మనకు ఉపయోగపడేలాగా చేసుకోవాలని అనుకుంటుంది. మావయ్య గారు అండి మీరు అలా బాధపడకండి మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని అంటుంది..

Advertisement

ప్రేమ నర్మదలు మిమ్మల్ని ఎదిరించి చేసింది తప్పే.. భార్యలొచ్చిన తర్వాత మగాళ్లు పూర్తిగా మారిపోతారని వీళ్ళు నిరూపించారు అందరూ మా బావ లాగా ఉండరు కదా.. ఆయన గారు మాత్రమే తండ్రి మాటని జవదాటకుండా ఉన్నారు అని శ్రీవల్లి కావాలని అందరిని ఇరికించేలా మాట్లాడుతుంది. మీరు ఇలా బాధగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది.. గుండె తరుక్కుపోతుంది. కన్నీళ్లు వస్తున్నాయి మావయ్య గారు అని కాళ్ళ మీద పడుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతగా అవమానించారో తెలిసి కూడా ప్రేమ ఉద్యోగం చేయాలి అనుకోవడం తప్పే.

ఇకమీదట అలాంటివి చేయరు నర్మదాప్రేమ మీరు వచ్చి మావయ్య గారికి క్షమాపణలు చెప్పండి అని శ్రీవల్లి అంటుంది. సారీ మావయ్య గారు మేము ఎప్పుడు ఇంకేది చేయము అని నర్మదా, ప్రేమ అంటారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అంటే కార్తీక పౌర్ణమి కదా నోములు నోచుకుంటాం మావయ్య గారు అని అడుగుతుంది. అందరి సంతోషం కోసం అన్నావు కదా అమ్మ మీ ఇష్టం వచ్చింది కానీవు అనేసి రామరాజు పర్మిషన్ ఇస్తాడు. శ్రీవల్లి మొత్తానికి సాధించేసింది అని అందరూ సంతోషంగా ఉంటారు.

సాగర్ తన తండ్రి అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు. నర్మదా నువ్వు అన్న మాటలకి నాకు చలి జ్వరం రావాలి కానీ నేనే బాగున్నాను రండి నోములకి రెడీ అవ్వండి అని సాగర్ ని అడుగుతుంది. తిరుపతి రేవతి దగ్గరికి వెళ్లి నేను లేనని మీరు బాధపడుతున్నట్టున్నారు వదిన అన్నయ్య వదినకు నేనంటే ఎంత ప్రేమ అని మాట్లాడుతాడు. అని రేవతి మాత్రం అలాంటిదేమీ లేదయ్యా నువ్వు వెళ్లినందుకు ఇంకా సంతోషంగా ఉన్నట్లున్నారు అని పరువు తీసేస్తుంది. రామరాజు నువ్వు అంతగా మీ వాళ్ళని మిస్ అవుతూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళు అని అంటాడు. తిరుపతి నా శబదం గురించి మీకు తెలియదు బావ.. ఈ రెండు కుటుంబాలు కలిసినప్పుడే నా పెళ్లి ఆ ఇంట్లోకి వెళ్లడం జరుగుతుంది అని అంటాడు.. అది జన్మలో జరగదు లేని రామరాజు వెళ్లిపోతాడు.

Also Read :సంజయ్ ను కొట్టిన బాలు.. మీనాకు టెన్షన్.. మౌనికకు షాకిచ్చిన సంజయ్..

శ్రీవల్లి ఒంటినిండా బంగారు నగలు వేసుకొని బంగారానికే బంగారంలా ఉన్నావు అని తెగ మురిసిపోతుంది.. అంతలోకే లోపలికి తిరుపతి వచ్చి నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటాడు. ప్రేమ నగలు మార్చిన విషయాన్ని కనిపెట్టాడు ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీవల్లి.. అనవసరంగా నేనే నోరు జారీ ఇరుక్కున్నట్లు ఉన్నాయని శ్రీవల్లి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×