E-Paper
Advertisement

Kavitha Target: కవిత టార్గెట్ ఏంటి! జాగృతిలోకి రమ్మని బెదిరిస్తుందా?

Kavitha Target: కవిత టార్గెట్ ఏంటి! జాగృతిలోకి రమ్మని బెదిరిస్తుందా?

Kavitha Target: బీఆర్ఎస్ నుంచి వేరుపడ్డ తర్వాత కల్వకుంట్ల కవిత సొంతంగా తనకంటూ ఒక మార్క్ ఉందని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇందుకోసం ఇప్పటికే జాగృతి సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.. అలాగే జాగృతి జనం బాట పేరుతో యాత్ర మొదలుపెట్టి తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు.. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కవిత ఆయా జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అసలు ఇంతకీ కవిత చేసిన వ్యాఖ్యలేంటి? ఆమె అజెండా ఏంటి?

బీఆర్ఎస్ నేతలపై జాగ‌ృతి అధ్యక్షురాలి విమర్శలు
బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ అయి ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ జాగ‌ృతి అధ్యక్షురాలు కల్వంకుంట్ల కవిత విమర్శలు చేస్తూనే వస్తున్నారు. జాగృతి జనం బాట యాత్రలో భాగంగా ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రత్యక్షంగానే కామెంట్స్ చేస్తున్నారు.. వరంగల్ యాత్రలో హరీష్‌రావుపై, నిజామాబాద్ పర్యటనలో జీవన్ రెడ్డి, షకీల్‌పై, నల్గొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఆమె పలుమార్లు విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా వనపర్తిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు జాగృతి అధ్యక్షురాలు

కృష్ణా నది కబ్జా చేసి ఫాంహౌజ్ కట్టున్నారని మండిపాటు
వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఘోరాతి ఘోరంగా అరాచకాలకు పాల్పడుతున్నాడని, ఒక్క ఎకరానికి కూడా నీరు తీసుకురాని ఆయన నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు ఎందుకు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు కవిత.. నిరంజన్ రెడ్డి కృష్ణా నది కబ్జా చేసి ఫాంహౌజ్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఇక నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ కవిత హెచ్చరించారు..

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేచిపోతుంది.. కవిత సీరియస్‌గా వార్నింగ్
నిరంజన్ రెడ్డి అరాచకాలను చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడని, తన తండ్రి వయసు ఉన్నవాడని ఇప్పటి వరకు గౌరవిస్తూ వచ్చానని.. మితిమీరి ప్రవర్తించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేచిపోతుందని అంటూ కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు కవిత.. ఇలాగే ఉంటే మహబూబ్ నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకట్టలేదని, మునుపు ఓడినదానికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రజలే బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు కవిత..

మాజీ మంత్రుల అరాచకాలు కేసీఆర్‌కి తెలియవంటున్న కవిత
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హరీష్ రావ్ మనిషి కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవట్లేదని, ఇలా అవినీతిని ఎంకరేజ్ చేస్తే తెలంగాణా బాగుపడుతుందా అంటూ ప్రశ్నించారు.. తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ తెగేసి చెప్పారు కవిత. అయితే నిరంజన్ రెడ్డితో పాటు ఇతర మాజీ మంత్రులు చేసిన అవినీతి బాగోతాలు కేసీఆర్ కి తెలియవని ఆయనకు తెలియజేసేందుకే తాను ఈ సమావేశం ఏర్పాటుచేశానంటూ చెప్పుకొచ్చారు కవిత..

కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిరంజన్‌రెడ్డి
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కవిత ఎవరిని సంతోషపెట్టాలని చూస్తోందో తెలియదన్నారు. తాను కక్ష పూరితంగా ఎవరి మీద కేసులు పెట్టించలేదన్నారు. ఒక వేళ అలా ఏమైనా ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేయవద్దని కవితకు సూచించారు. తండ్రి వయస్సు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నావంటూ నిప్పులు చెరిగారు. నీళ్ల నిరంజన్ రెడ్డి అని తాను కావాలని పిలిపించుకోలేదని.. నీవే లిక్కర్ రాణి అని పిలిపించుకోవాలంటూ కల్వకుంట్ల కవితకు చురకలంటించారు. నీకు హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్లు, గండిపేటలో విలాసవంతమైన ఫౌం హౌస్‌లు.. ఎక్కడి నుంచి వచ్చాయని కవితను ప్రశ్నించారు. తనకు ఎక్కడా ఫాం హౌస్‌లు లేవని క్లారిటీ ఇచ్చారు.

Also Read: దూసుకొస్తున్న తుఫాన్.. ఒకేసారి 2 వాయుగుండాలు.. ఇక వర్షాలే వర్షాలు..

ఈ వివాదం నేపధ్యంలో కవిత ఎక్కడికి వెళ్లినా అక్కడి బీఆర్ఎస్ ముఖ్యనేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది .. ఓ పక్క జాగృతిని బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ మరోపక్క బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు పార్టీపై, పార్టీ సీనియర్ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కవిత.. దీనివల్ల బీఆర్ఎస్ కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దఎత్తున్నే డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటూ ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.. నిజంగానే కవిత వల్ల మున్ముందు రోజుల్లో బీఆర్ఎస్ కు తిప్పలు తప్పేలా లేవంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

Story By Apparao, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×