Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్నను పట్టుకుని సుమిత్ర ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు.. ఏమైపోయావు.. అసలు నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామనుకున్నావు.. ఈ మూడు రోజులు నేను ఎంత కంగారు పడతానోనన్న ఆలోచన నీకు రాలేదా జ్యో్త్స్న.. ఫోన్ చేసైనా నువ్వు ఎక్కడున్నది చెప్పొచ్చు కదా అంటుంది. నీకు ఏమైనా అయితే మేము బతికేవాళ్లమా..? అంటూ సుమిత్ర ఏడుస్తుంటే.. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ.. నేను తిరిగి వచ్చాను కదా ఇంకా ఎందుకు బాధ.. నేను కనిపించలేదని మీరు ఎవరెవరినో తిట్టి ఉంటారు కానీ దీప, బావను మాత్రం ఏమీ అనోద్దమ్మ అంటూ చెప్తుంది జ్యోత్స్న. అందుకు శివనారాయణ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ నిలదీస్తాం కదమ్మా అంటాడు. కానీ దీప, బావను అనుమానించొద్దు తాత అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. ఆ పీఏ జాబ్ మానేయమని దశరథ మెల్లగా శివనారాయణకు చెబితే.. శివనారాయణ అడుగబోతుంటే.. తనకు తలనొప్పిగా ఉందని జ్యోత్స్న రూంలోకి వెళ్లిపోతుంది.
మరోవైపు మాలిని దగ్గరకు వెళ్లిన మేనేజర్ ఏంటి మేడం జ్యోత్స్నను ఎందుకు వదిలేశారు.. అసలు ఎప్పటికీ జ్యోత్స్న కనిపించడకుండా చేయాలి అన్నారు కదా అని అడిగితే.. జ్యోత్స్న కనిపించకపోతే నా కొడుకు సూరజ్ మర్చిపోతాడు అనుకున్నాను కానీ వాడు మనిషే కాకుండా పోయే పరిస్తితికి వెళ్లిపోయాడు. మొదటి సారి నా కొడుకు నన్ను జ్యోత్స్న విషయంలో నిలదీశాడు. అందుకే జ్యోత్స్నను విడచిపెట్టాను.. ఇలా డైరెక్టుగా కాకుండా మెల్లగా నా కొడుకులో జ్యోత్స్న మీద అసహ్యం పెరిగేలా చేయాలి. సూరజే, జ్యోత్స్నను ఆఫీసును నుంచి వెళ్లగొట్టేలా చేయాలి అప్పుడే నేను సక్సెస్ అవుతానని అర్థం అయింది. అందుకే తాత్కాలికంగా జ్యోత్స్నను వదిలేశాను అని చెప్తుంది మాలిని.
నిన్ను కిడ్నాప్ చేయించింది మాలిని పిన్నే కదా అని కార్తీక్ అడిగితే అదంతా డైరెక్టుగా చెబితే సూరజ్ నమ్మడు కదా బావ అంటుంది జ్యోత్స్న. ముగ్గురు జాబ్ గురించి మాట్లాడుకుంటారు. నేను పీఏగా చేస్తున్న విషయం మీకై మీరు చెప్పలేదు.. మాలిని అత్త మీరు చెప్పేలా చేసింది. అయినా మాలిని అత్తను మనం ఎలా చూస్తున్నామో సూరజ్ కూడా అలాగే చూసేలా చేయాలి అంటుంది జ్యోత్స్న. అవును సూరజ్ తల్లి ప్రేమ అనే మయలో ఉన్నాడు. సూరజ్ ఆ మాయ నుంచి బయటపడితేనే నీ మనిషిగా మారతాడు. కానీ ఇదంతా ఎవరు చేస్తారు అంటూ కార్తీక్ చెబితే.. అదంతా నేనే చేస్తాను బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
సూరజ్, మాలిని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్తాడు. జ్యోత్స్న విషయంలో నిన్ను అనుమానించాను కానీ నిజం తెలిశాక బాదేస్తుంది అంటాడు. మాలిని మాత్రం సూరజ్‌ను ప్రేమగా నువ్వు నా కొడుకువిరా నీ మాటలు నేను ఎప్పుడూ తప్పుగా తీసుకోను.. కానీ బిడ్డ నుంచి తల్లి కోరుకునేది నమ్మకం ఆ తల్లి ఏం చేసినా కొడుకు మంచి కోరే చేస్తుంది.. నేను చేసేది కూడా నీ మంచి కోసమే నాన్నా అంటూ చెప్తుండగానే.. అక్కడకు జ్యోత్స్న వస్తుంది. సూరజ్ కోపంగా జ్యోత్స్ను చూసి తను ఎందుకు వచ్చిందో అడుగు మమ్మీ అంటాడు. మాలిని ఎందుకు వచ్చావని జ్యోత్స్నను అడిగితే నిజం చెప్పడానికి వచ్చానని జ్యోత్స్న చెప్తుంది. ఆ మాటలకు మాలిని షాక్ అవుతుంది. జ్యోత్స్న ఏం అత్త నిజం చెప్పమంటావా..? అని అడిగితే.. నువ్వు చెప్పే నిజ మా అమ్మకు తెలుసా..? అని సూరజ్ అడుగుతాడు. అత్తకు అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉంటుంది. నేను అన్ని తెలుసుకుంటాను కానీ అత్తలా ఉండలేను అంటుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.