E-Paper
Advertisement

YouTuber Vaishnavi: వైష్ణవి హత్యవెనుక ఇంత కుట్ర ఉందా.. అంతా ఆమె హస్తమేనా?

YouTuber Vaishnavi: వైష్ణవి హత్యవెనుక ఇంత కుట్ర ఉందా.. అంతా ఆమె హస్తమేనా?
Advertisement

YouTuber Vaishnavi:జగిత్యాల జిల్లా.. కోరుట్ల మండలంలోని.. మాదాపూర్ గ్రామంలో హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి (YouTuber Vaishnavi) హత్య కేసులో రోజుకొక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కట్నం కోసమే ఆమె భర్త హరిబాబు గర్భవతి అని కూడా చూడకుండా.. పెళ్లయిన పది నెలలకే నాలుగు నెలల గర్భవతి అయిన వైష్ణవినీ పొట్టన పెట్టుకున్నాడు. కట్నం విషయంలో మనస్పర్ధలు రావడంతోనే గొంతు నులిమి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోజుకో వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది..

వైష్ణవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్..

గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివిన వైష్ణవి. ఆ తర్వాత MLT కోర్సులో చేరింది. కాగా, ల్యాబ్ పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేది వైష్ణవి. అదే ప్రభుత్వ హాస్పిటల్ లో పేషంట్ అటెండర్ గా పనిచేసేవాడు హరిబాబు. అక్కడే వైష్ణవిని చూసిన హరిబాబు ప్రేమలో పడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. మొదట్లో హరిబాబు ప్రేమకు నో చెప్పిన వైష్ణవి.. ఆ తర్వాత అంగీకరించింది. వైష్ణవి లేకుంటే బ్రతకలేను అంటూ ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధం అవ్వడంతోనే వైష్ణవి అతనితో ప్రేమకు అంగీకరించింది. జీవితాంతం ఆమెతోనే ఉంటానని వైష్ణవిని ఒప్పించాడు. ముందుగా హరిబాబుతో పెళ్లికి వైష్ణవి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అటు హరిబాబు ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు. అలా ప్రేమకు , పెళ్లికి మధ్య దాదాపు రెండు సంవత్సరాల సమయం గడిచిపోయింది . ప్రేమిస్తున్నానని హరిబాబు వెంట పడడంతోనే వైష్ణవి ఫ్యామిలీ సహకారంతో 10 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ALSO READ:Rashmika Mandanna: ఆయనతో కలిసి రష్మిక చూసి, మెచ్చిన తెలుగు సినిమా.. విజయ్ తో మాత్రం కాదండోయ్!

సూత్రధారి ఆమె..

వైష్ణవి యూట్యూబ్లో రీల్స్, వీడియోలు చేస్తూ సంపాదిస్తుండడంతో వైష్ణవి ఫ్యామిలీ సూచన మేరకు హరిబాబు కూడా ఉద్యోగం వదిలేసి వైష్ణవితో పాటే వీడియోలు, రీల్స్ చేస్తూ వచ్చారు. అయితే వైష్ణవితో పెళ్లి ఇష్టం లేని హరిబాబు కుటుంబం హరిబాబును చేరదీయకపోవడంతో అత్తగారింట్లోని అల్లుడిగా సెటిలైపోయాడు ఇక వైష్ణవి గ్రామంలోనే హరిబాబుకి రెండు గుంటల స్థలంతో పాటు ఒక ఇల్లును కూడా కట్టించేందుకు వైష్ణవి ఫ్యామిలీ సిద్ధమైంది. కానీ వైష్ణవిని వదిలేయాలంటూ3 హరిబాబు పై ఆయన కుటుంబం ఒత్తిడి తీసుకొచ్చింది. పైగా వైష్ణవిని వదిలేసి మరో పెళ్లి చేసుకుంటే 4 ఎకరాల పొలం, 20 లక్షల కట్నం వస్తుందని హరిబాబు తల్లి ఆశ చూపడంతో వైష్ణవిని వదిలించుకునేందుకు హరిబాబు కూడా ప్లాన్ చేశాడు. అలా ఈనెల 16వ తేదీన రాత్రి వైష్ణవి ప్రాణాలు తీశాడు. దిండుతో మొహంపై మొత్తి , వైష్ణవి గొంతు పై బలంగా నొక్కి ఆమెను హత్య చేశాడు. అనంతరం విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాలుగు నెలల గర్భవతి అని వేడుకొన్నా హరిబాబు కనికరం చూపించలేదట. శబ్దం రావడంతో వైష్ణవి తల్లిదండ్రులు అటుగా రావడంతో గమనించిన హరిబాబు ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్టు నటించాడు. ఇక దాంతో వాళ్ళు పట్టించుకోలేదు. ఉదయం లేచి బ్రష్ చేసుకుని అత్తింటి వారు కొనిచ్చిన బండి తీసుకొని ఇక అటు నుంచి పారిపోయాడు హరిబాబు. ఇక వైష్ణవి తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికైతే హరిబాబు తల్లి ఈ కుట్రలో ప్రధాన నిందితురాలిగా నిలుస్తోందని చెప్పవచ్చు.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×