RCB Sold: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ వచ్చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం రూ. 16,700 కోట్లు పోసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చైర్మన్ గా ఆర్యమన్ బిర్లా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అదే సమయంలో రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు చైర్మన్ ఆర్యమన్ బిర్లా ( Aryaman Birla) సోదరి అనన్య బిర్లా పేరు మారుమోగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కావ్య పాప ( kavya maran srh) ముందు ఉండి నడిపించారు. ఇక ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అనన్య బిర్లా యాక్టివ్ గా మారి ముందుకు నడిపించే ఛాన్సులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ జట్టుకు కావ్య పాప ఉంటే, బెంగళూరు జట్టుకు అనన్య పాప ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు అనన్య బిర్లా ( ananya birla) ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ధర వచ్చింది. ముందుగా చెప్పినట్లుగానే కోట్ల వర్షం కురిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును రూ.16,700 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్ తోపాటు మరో మూడు కంపెనీలు కొనుగోలు చేశాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ మెజారిటీ షేర్లు కొనుగోలు చేసింది. దీంతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, డేవిడ్ బ్లిట్జర్ కంపెనీలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన వాటిలో ఉన్నాయి. అయితే మెజారిటీ షేర్లు కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ ఆర్యమన్ బిర్లా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చైర్మన్ కాబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. డియాజియో గ్రూప్, RCB మధ్య బంధం తెగిపోయింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చైర్మన్గా ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ ఆర్యమన్ బిర్లా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ఆయన సైలెంట్ గా ఉండి, జట్టుకు సంబంధించిన కీలక బాధ్యతలను తన సోదరి అనన్య బిర్లాలకు అప్పగించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న అనన్య బిర్లా, గతంలో గుజరాత్ జట్టుకు సపోర్ట్ చేశారు. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన నేపథ్యంలో.. కావ్య పాప తరహాలోనే RCB జట్టును ప్రమోట్ చేయనున్నారు అనన్య బిర్లా. RCB ఆడే ప్రతి మ్యాచ్ కు కావ్య తరహాలోనే హాజరై, అనన్య సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బెంగళూరు అభిమానులు ఫుల్ ఖుషిగా కనిపిస్తున్నారు.
పంజాబ్ జట్టుకు ప్రీతి జింటా, సన్ రైజర్స్ జట్టుకు కావ్య పాప ఉంటే తమకు అనన్య బిర్లా రాబోతోందని సంబరపడిపోతున్నారు బెంగళూరు అభిమానులు. ఇక అన్ని స్టేడియాలు అనన్య రాకతో కలర్ ఫుల్ గా మారబోతున్నాయని కామెంట్ చేస్తున్నారు. కాగా ఆదిత్య గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమార్తనే ఈ అనన్య బిర్లా. ఈమె వ్యాపారంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా దూసుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్ గా కూడా ఈమెకు గుర్తింపు దక్కింది. 17 సంవత్సరాల వయసులోనే మైక్రో ఫైనాన్స్ సంస్థను ప్రారంభించి గ్రామీణ మహిళలకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు. అంతేకాదు ఆదిత్య గ్రూప్ కు సంబంధించిన చాలా కంపెనీలకు ఆమె బాధ్యతలు వహిస్తున్నారు.
🚨 RCB OWNERSHIP UPDATE 🚨
Royal Challengers Bangalore could see a change in ownership soon. The franchise is reportedly attracting interest from a powerful group of investors.
📌 Potential Investor Group Includes:
1️⃣ Aditya Birla Group
2️⃣ Satyan Gajwani from the Times of India… pic.twitter.com/kuBefexXpw— muffatball vikrant (@Vikrant_1589) March 24, 2026
🚨 Ananya Birla Set to Become the New Owner of RCB 🚨
Aditya Birla Group to take control of RCB. Reportedly, RCB has been sold to the Aditya Birla Group for around $1.8 billion, making it the most expensive and most valuable IPL team in history.
The deal is already done, and… pic.twitter.com/TKGPWolfzu
— Sonu (@Cricket_live247) March 24, 2026
Pritizinta > Kavya Maran >Ananya Birla
PBKS > SRH > RCB pic.twitter.com/okBD34CTFK
— Aditya Saundarya 🏹 (@Kuch_lafz_) March 24, 2026