Illegal Mining: స్వేచ్ఛ బ్యూరో: అక్రమ వ్యాపారానికి ఆనాటి నుంచి నేటి వరకు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నట్లు బహిరంగంగనే మాట్లాడుకుంటారు. ఏ పార్టీ అధికారంలోనున్న ఆ నాయకుల అనుచరులు అక్రమ వ్యాపారం చేసుకోవడం ఆలవాటుగా మారిపోయింది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్, ఇసుక, కలప రవాణా సాగాయి. కానీ పోలీసు, రెవెన్యూ, టాస్క్ పోర్స్ బలంగా పనిచేయలేకపోయిందనే విషయాన్ని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లల్లో కూడా చూసిచూడనట్లుగానే అధికారులు వ్యవహారించినట్లు సమాచారం.నూతనంగా జిల్లా ఎస్సీగా వచ్చిన స్నేహ మెహ్రా అక్రమవ్యాపారంపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అనుమతులు లేకుండా రవాణా చేసే మైనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫీయా భారీగా సాగుతుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ స్ధానిక పోలీసులను అప్రమత్తం చేసింది. అయితే స్ధానిక బషీరాబాద్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో పర్యటిస్తున్న క్రమంలో అక్రమ ఇసుక తరలింపు చేస్తున్నట్రాక్టర్లను నిలిపేందుకు వెళ్లారు. ఆ విషయాన్ని గమనించిన అక్రమార్కులు పెట్రోలింగ్ వాహనంను ట్రాక్టర్‌తో డీకోట్టారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేసే పోలీసులను అక్రమార్కులు అంతం చేయాడానికి వెనుకడుగు వేయాలేదని తెలుస్తుంది. ఇతంటి దారుణానికి తెగబడుతున్న ఇసుకాసురులను వదిలిపెట్టేది లేదని పోలీసులు అంటున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ నిఘా పెట్టడంతో 13 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.. ఈ అక్రమ రవాణ చేసే వారిపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతోనే దాడులకు శ్రీకారం చూట్టినట్లు తెలుస్తోంది. నమోదు చేసిన కేసులన్ని తాండూర్ నియోజకవర్గం పరిధిలోనే కావడం విశేషం. యాలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 08 ట్రాక్టర్లను , కరణ్‌కోట్ ప్రాంతంలో అక్రమంగా కలప రవాణా చేస్తున్న ఒక లారీని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రమట్టి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 3 లారీలు సీజ్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలలో కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ అధికారులు జనవరి నెలలో 22 అక్రమ రవాణా కేసులు, ఫిబ్రవరి నెలలో 9 అక్రమ రవాణా కేసులు, మార్చి నెలలో 20 మొత్తం ఈ సంవత్సరం 51 అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Also read: LPG Shortage: మంట పుట్టిస్తున్న గ్యాస్ కష్టాలు.. కేద్రం కొత్త నిబంధనల వెనుక అసలు మర్మమేంటి?