Bigg Boss 10 Tamil: బుల్లితెర పై ప్రసారం అవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ప్రస్తుతం ఈ కార్యక్రమం సీజన్ 10 ప్రసారం అవుతుంది. ఇక తమిళంలో కూడా ఈ కార్యక్రమం సీజన్ 10 ప్రసారం అవుతుంది. ఇక తమిళ బిగ్ బాస్ సీజన్10(Bigg Boss 10 Tamil) కార్యక్రమానికి ప్రస్తుతం నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తమిళంలో ఈ కార్యక్రమం ప్రసారమైన సమయంలో ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Hassan) ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. అయితే కమల్ హాసన్ ఈ బిగ్ బాస్ కార్యక్రమం నుంచి హోస్ట్ గా తప్పుకోవడంతో ఈయన స్థానంలో నటుడు విజయ్ సేతుపతి హోస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. ఈయన స్థానంలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం.
రమ్యకృష్ణ ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో హోస్ట్ గా బాధ్యతలు తీసుకోలేదని, కేవలం ఒక వీకెండ్ మాత్రమే హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి గత రెండు వారాలుగా తీవ్రమైన గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన కొంత విశ్రాంతి తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ వీకెండ్ బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచనల ప్రకారం విజయ్ సేతుపతి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని తిరిగి ఆయన ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత యధావిధిగా బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి రాబోతున్నట్టు తెలుస్తుంది.
రమ్య కృష్ణ బిగ్ బాస్ తమిళ్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో, బిగ్ బాస్ సీజన్ 5 సమయంలో, అప్పటి హోస్ట్ అయిన కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో, రమ్య కృష్ణ కేవలం ఒక వారం పాటు కమల్ స్థానంలో బిగ్ బాస్ హోస్ట్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈమె తెలుగు సీజన్ 3 కార్యక్రమంలో ఒక వారం రోజులు నాగార్జున అందుబాటులో లేకపోవడంతో తెలుగు బిగ్ బాస్ 3 షో కోసం వ్యాఖ్యాతగా కొనసాగారు. ఇలా బిగ్ బాస్ హోస్ట్ గా రావడం రమ్యకృష్ణకు ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు రెండోసారి ఈమె తమిళ బిగ్ బాస్ వేదికపై హోస్ట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
Also Read: ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!