Tanveer Ahmed On Vaibhav Sooryavanshi: టీమిండియా యంగ్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీపై (Vaibhav Sooryavanshi) మరోసారి తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియాలో స్థానం కోసం ఆరాటపడుతున్న వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొట్టడంపైన ఫోకస్ చేయాలని సూచనలు చేశారు. తమ పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం (babar azam ) దగ్గర సిక్స్ లు ఎలా కొట్టాలనే దానిపైన ట్రైనింగ్ తీసుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. బాబర్ ఆజం కొట్టే సిక్సర్లు చాలా అందంగా, అద్భుతంగా ఉంటాయని ప్రశంసించారు. అలాంటి సిక్సర్లే వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి వస్తే చూడాలని తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వెంటనే బాబర్ ఆజంను వైభవ్ సూర్యవంశీ కలిసి ట్రైనింగ్ తీసుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వైభవ్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
15 ఏళ్ల కుర్రాడు వైభవ్ తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో స్థానం కోసం వైభవ్ సూర్య వంశీ చాలా ఎదురు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడినప్పటికీ అతడికి టీమిండియా తుది జట్టులో అవకాశాలు రావడం లేదని మండిపడ్డారు. న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఎక్కువగా ఇస్తే మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయన్నారు. మొదట్లో వైభవ్ సూర్యవంశీని అందరూ తక్కువగా అంచనా వేశారని తెలిపారు. కానీ విదేశీ గడ్డలపై ఎక్కువ మ్యాచులు ఆడితే వైభవ్ అనుభవం పెరుగుతుందని సూచనలు చేశారు. ఆ దిశగా గౌతమ్ గంభీర్ ఆలోచన చేయాలని కోరారు.
ఇండియాలో ఉన్న ఫ్లాట్ మైదానాలపై బుడ్డోడిని ఆడిపిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. అలాంటి వాళ్లకు విదేశీ గడ్డలపై ఎక్కువ ఛాన్సులు ఇస్తే భయంకరంగా మారుతారని తెలిపారు. అయితే సిక్సర్లు కొట్టడంలో వైభవ్ సూర్యవంశీ తన రూటు మార్చుకొని బాబర్ ఆజంను ఫాలో కావాలన్నారు. పెద్ద సిక్సర్ల కోసం ప్రయత్నిస్తే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని… సింపుల్ సిక్సర్ల కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఆ విధంగానే బాబర్ ఆజం సక్సెస్ అయ్యాడని… అతనిలాగా సిక్సర్లు కొట్టడం నేర్చుకోవాలని కోరారు. పవర్ హిట్టింగ్ కూడా అతని లాగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచనలు చేశారు. దీంతో వైభవ్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ లాంటి వాళ్ళ దగ్గర వైభవ్ ట్రైన్ అవుతాడని… తమకు బాబర్ ఆజం లాంటి చెత్త వెధవలు ఏ మాత్రం వద్దంటూ ఇండియన్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.