E-Paper
Advertisement

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!
Advertisement

Military Plane Crash: ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ బేస్‌లో సాధారణ శిక్షణలో ఉన్న రెండు సైనిక విమానాలు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. ఈ దుర్ఘటనలో నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఫిలిప్పీన్ వైమానిక దళం (PAF) శనివారం అధికారికంగా వెల్లడించింది.

రాజధాని మనీలాకు దక్షిణంగా ఉన్న ఫెర్నాండో ఎయిర్ బేస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. రెండు ఎస్ఎఫ్-260 (SF-260) విమానాలు శిక్షణ నిమిత్తం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ అనూహ్య ఘటన జరిగింది. ‘ఈ రెండు విమానాలు ఎయిర్ బేస్ ప్రాంగణంలోనే కూలిపోయాయి. అదృష్టవశాత్తూ బేస్ లోపల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు’ అని ఫిలిప్పీన్ వైమానిక దళ ప్రతినిధి కల్నల్ అల్విన్ కపింగుయిన్ స్పష్టం చేశారు.

Advertisement

మరోవైపు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైమానిక దళం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న మొత్తం ఎస్ఎఫ్-260 విమానాలను శిక్షణకు దూరంగా ఉంచినట్లు కల్నల్ కపింగుయిన్ తెలిపారు.

Advertisement

Also Read: రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు

అయితే ఫిలిప్పీన్ సైనిక విమానం ప్రమాదానికి గురి కావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో బెంగుయత్ ప్రావిన్స్‌లో మరో ఎస్ఎఫ్-260 విమానం శిక్షణ విమానయానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృత్యువాత పడ్డారు. నెలల వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ వరుస ప్రమాదాలు.. ఫిలిప్పీన్స్‌ వైమానిక దళంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read: రాజకీయంగా చర్చకు వస్తున్న తెలుగు రాష్ట్రాలు! కరువు భయభ్రాంతులకు గురవుతున్న తెలంగాణ..! హింసాత్మక ఘటనలతో పరువు రచ్చకెక్కిన ఏపీ!

Tags

Related News

కెన్యాలో కుప్పకూలిన 12 అంతస్తుల భారీ భవనం.. శిథిలాల కింద కూలీలు?

మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!

ఐరాసలో పాకిస్థాన్‌కు గట్టి షాక్.. కార్గిల్ వార్ నిజాలు బయటపెట్టి తోలుతీసిన భారత్!

ట్రంప్ అల్లుడిపై సంచలన ఆరోపణలు.. యావత్ ప్రపంచమే షాక్.. ఈయన మామూలోడు కాదు!

టిబెట్‌లో భారీ భూకంపం.. వందలాది ఇళ్లు నేలమట్టం.. 18 మంది మృత్యువాత!

ఓరి నీ ప్రేమ మండిపోను.. ఎంత పని చేశావు, కౌగిలింతలో భార్య ఎముకలు విరిగాయి

Big Stories

Advertisement
×