Ismart Bathukamma:బతుకమ్మ పండగ మొదలవడంతో తెలంగాణ గ్రామ గ్రామానా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి .ఇక ఇదే సంబరాలని టీవీలలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.ఈ క్రమంలోనే ఆడియన్స్ ని అలరించేందుకు ‘ఇస్మార్ట్ బతుకమ్మ’ అనే ప్రోగ్రాం కి తెర తీసింది ఈటీవీ.
ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన పాటలు, డ్యాన్స్‌లతో షో మొత్తం ఒక నవ్వ్యుల పండగలా మారిపోయింది. ముఖ్యంగా సుధీర్ తన కామెడీ టైమింగ్‌తో సందడి చేయగా, ఆశు రెడ్డి, శ్రావంతి, సుజాత, పవిత్ర, సుష్మ, సునంద, రూప తదితరులు తమ ఆటపాటలతో కార్యక్రమానికి మెయిన్ ఎసెట్ గా నిలిచారు.మరోవైపు వాగ్దేవి, వైష్ణవి సిస్టర్స్ పాటలు, చిన్నారి ఆరాధ్య ప్రదర్శన, సుజాత తను తల్లి అయిననాటి అనుభవాలని పంచుకుంటూ ఎమోషనల్ అయిన తీరు ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచాయి.
బతుకమ్మ పూల దగ్గర మొదలైన గొడవ.
ఇక షో మొదట్లోనే బతుకమ్మ పూల విషయంలో స్రవంతి చొక్కారపు, అషురెడ్డి ల మధ్య సరదా గొడవ మొదలవుతుంది. బంతిపూలు, తంగేడు పూలు తీసుకురావడం దగ్గర నుంచి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది.ఇక బతుకమ్మను ఎవరు బాగా అలంకరిస్తారు? ఎవరి వెంట సుధీర్ బావ వస్తాడు? అంటూ రెండు టీమ్స్ సరదాగా గొడవపడటం ఫన్నీగా సాగుతుంది.ఇక వీరి మధ్య ఆపడానికి వచ్చిన సుధీర్ తనదైన స్టైల్లో పంచులు వేస్తూ మరింత కామెడీని పండించాడు.పండుగ అంటే అందరూ కలిసి చేసుకోవాలని చెప్పినా, రెండు టీమ్స్ అలాగే గొడవ పడుతుండటంతో బతుకమ్మను ఎవరు బాగా జరుపుకుంటారో, ఎవరి టీమ్ బాగా ఆడుతుందో వారివైపు వస్తానంటూ సుధీర్ సరదాగా చెప్పుకొస్తాడు.
ఇక స్టేజ్‌పై సుధీర్ చేసే సరదా ఫ్లర్టింగ్ కూడా నవ్వులు పూయిస్తుందనే చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక్కో పువ్వుతో పోలికలు చెబుతూ ఆటపట్టిస్తాడు సుధీర్. అయితే ఎదుటివారి భర్త గురించి తెలిసిన వెంటనే సారీ చెప్పడం, తన మాటలతో తానే ఇరుక్కోవడం ఇక్కడ హైలెట్. ఇక సుధీర్‌తో పాటు మిగతా సభ్యులు వేసిన కౌంటర్లు కార్యక్రమానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు.
మొదటి రౌండ్లో పాటలతో ప్రశ్నలు..
మొదటి గేమ్‌లో రెండు టీమ్స్ కి చెందిన అందరూ పాల్గొనగా ఇందులో పాటలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ వినిపించి, వాటి ఆధారంగా ప్రశ్నలు అడిగారు. సమాధానం తెలిసినవారు ఎదురి టీమ్ బెలూన్ను ముందుగా పగలగొట్టి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.మొదట వినిపించిన ‘పొట్టి పిల్లా పొట్టి పిల్లా’ పాట ఏ సినిమాలోనిదని అడగ్గా, అది ‘బలగం’ సినిమాలోనిదని సమాధానం వచ్చింది. ఆ తర్వాత వేరే పాటల ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగారు.
మధ్యలో సుధీర్‌తో డ్యాన్స్ చేయాలంటూ రెండు టీమ్స్ కూడా పట్టుబట్టడంతో ఆట మరింత ఫన్నీ గా సాగిపోయింది.ఇక పాటల పోటీతో పాటు ఫన్నీ సౌండ్స్‌ను ఇమిటేట్ చేసే గేమ్ కూడా నిర్వహించారు. అందరూ తమదైన స్టైల్ లో ఆడగా చివరగా ఆశు రెడ్డి టీమ్ విన్నర్ అని సుదీర్ తేల్చడంలో ఒక్కసారిగా ఫుల్ జోష్ తో డాన్స్ చేస్తూ సందడి చేసింది ఆశు రెడ్డి టీమ్.
ALSO READ :జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?