Jabardast Fima: బుల్లి తెర పై ఎన్నో ఏళ్లుగా సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్లు గా సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్స్ అయ్యారు. ఒకవైపు బుల్లి తెర పై రానిస్తూనే మరోవైపు బుల్లితెర పై రానిస్తూనే మరోవైపు సినిమాలను డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్లారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ గా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. మెల్స్ మాత్రమే కాదు ఫిమేల్స్ కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో ఫైమా కూడా ఒకటి. తన పంచులతో కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య ఫైమా ఏదొక విషయం పై రియాక్ట్ అవుతూ వార్తల్లో హైలెట్ అవుతుంది. తాజాగా లైవ్ లో బూతులు మాట్లాడుతూ షాకిచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియలో వైరల్ గా మారింది..
ఎప్పటిలాగే ప్రతి వారం లాగే ఈ వారం ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. కామెడీ షోకు జడ్జిలుగా ఖుష్బూ, శివాజీలు వ్యవహరిస్తున్నారు. తమ పంచ్‌లు, టైమింగ్‌తో వీరు కూడా జబర్దస్త్ షోను బాగానే నడిపిస్తున్నారు. ముఖ్యంగా శివాజీ తన మార్క్ సెటైర్లతో బాగా అలరిస్తున్నారు. మొత్తానికి ఈ షో మాత్రం టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ వారం ప్రోమో విషయానికొస్తే.. ఇమ్మాన్యుయేల్ , వర్ష , పండు స్కిట్ చెయ్యడానికి వస్తారు. తండేల్ స్పూఫ్ చేసినట్లుగా వారి గెటప్ చూస్తే అర్ధమవుతుంది. నేను సాయిపల్లవిని అని ఓ అమ్మాయి చెప్పగా.. నువ్వు సాయిపల్లవి కాదు పంది పిల్లవి అంటాడు.. నువ్వు బర్రె పిల్లవి అని దారుణంగా అవమానిస్తాడు. ఇమ్మాన్యుయేల్ పడవ నడుపుతుండగా వర్ష- పండులు వచ్చి లిఫ్ట్ అడుగుతారు. ఇదేమైనా లారీ అనుకున్నావా? ఏం చేశారొచ్చారు అని ప్రశ్నిస్తాడు ఇమ్మాన్యుయేల్.. ఇది ప్రోమోకు హైలెట్ అవుతుంది..
Also Read : ఆ హీరో అంటే పిచ్చి.. ఆయనతో ఒక్కసారి అలా చెయ్యాలి.. కుర్ర బ్యూటీ కామెంట్స్..
ఇది షోకు హైలెట్ అవ్వగా ఇప్పుడు ఫైమా, పొట్టి నరేష్ లు కూడా ఒక స్కిట్ చేశారు. మామూలుగానే కొంచెం ఛాన్స్ దొరికితేనే ఫైమా రెచ్చిపోతుంది. అలాంటిది సరైన స్కిట్ పడితే ఆమెను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నది ఎన్నోసార్లు రుజువైంది. జబర్దస్త్‌లో మేల్ కమెడియన్స్‌కు ధీటుగా నవ్విస్తూ అందరి చూపును తన కామెడితో నవ్విస్తూ ఉంటుంది. అందుకే ఫైమా కు వరుస అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.. పొట్టి నరేష్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఏవండి మిమ్మల్ని చూస్తుంటే పీలింగ్స్ వస్తున్నాయని చెబుతుంది.. అయితే నరేష్ దానికి వద్దు నా షర్ట్ నలిగిపోతుంది అని అంటాడు. మీరొస్తే పక్కనే నలగదు, చొక్కా ఎలా నలుగుతుందని పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు. నువ్వు పక్కలోకే వస్తే పక్కే నలగదు కానీ ఇక అది ఏమి నలుగుతుంది అంటూ ఫైమా పంచులు వేస్తుంది. అది కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇక ఆ షో ఎపిసోడ్ లో ఎలాంటి సెన్సార్ లు ఉంటాయో తెలియాలంటే ఆ ఎపిసోడ్ ను చూడాల్సిందే..