OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. వీటిని ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంలో దర్శకులు ఒక అడుగు ముందు ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటిలో అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో హోమ్ మినిస్టర్ కూతురి పై అఘాయిత్యం జరుగుతుంది. ఈ కేసు చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xtreme) లో
ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘యతభావ’ (Yathabhava). ఈ మూవీకి గౌతమ్ బసవరాజు దర్శకత్వం వహించాడు. ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి కుమార్తె పై అత్యాచారం చేశాడని ఆరోపించినప్పుడు, ఒక కళాశాల విద్యార్థి జీవితం తారు మారు అవుతుంది. ఆ తరువాత హంతకులను పట్టుకునే క్రమంలో స్టోరీ తిరుగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ట్విస్ట్ లు చాలానే ఉంటాయి. చివరివరకు ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సస్పెన్స్ గా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xtreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సుమతి అనే అమ్మాయి దారుణంగా అఘాయిత్యానికి గురి అవుతుంది. ఆ అమ్మాయి కోమాలోకికి వెళ్ళిపోతుంది. ఈ న్యూస్ కూడా వైరల్ గా మారుతుంది. మీరా అనే రిపోర్టర్ ఇందులోని విషయాలు వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా ఆ అమ్మాయి హోమ్ మినిస్టర్ కూతురని తెలుసుకొని మీడియాలో టెలికాస్ట్ చేస్తుంది. హోమ్ మినిస్టర్ కూతురికే రక్షణ లేకపోతే ఎలా అంటూ మీడియా అంతటా దద్దరిల్లిపోతుంది. ఈ కేసును పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతారు. ఇందులో శివ అనే వ్యక్తిని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతడు మంచి వాడిగా పేరు తెచ్చుకొని ఉంటాడు. ఇందులో అతనికి సంబంధం లేక పోయినా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఆధారాలు సంపాదిస్తారు పోలీసులు. నిజానికి శివ ఆసమయంలో ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. బట్టలు లేకుండా పడి ఉన్న ఆ అమ్మాయికి తన షర్ట్ తీసి కప్పుతాడు. అప్పుడే అది చూసిన పోలీసులు అతడే ఇదంతా చేశాడని అనుకుంటారు.
ఇదంతా ఆమె తండ్రి వళ్ళే జరుగుతుంది. ఒకప్పుడు హోమ్ మినిస్టర్ అత్యాచారాలను చేసేవారిని వెనకేసుకొచ్చి, అమాయకులపై ఈ కేసులను పెట్టిస్తుంటాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించిన కొంతమంది ఈ పని చేస్తారు. ఈ క్రమంలోనే శివ నేరస్తులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి శివ ఈ కేసు నుంచి బయటపడతాడా? అసలు నేరస్తులు దొరుకుతారా ? కోర్టులో ఈ కేసు వాదనలు ఎలా జరుగుతాయి? సుమతి ప్రాణాలతో బయటపడుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xtreme) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘యతభావ’ (Yathabhava) అనే ఈ మూవీని చూడండి.