Tollywood Heroine: టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు స్టార్ హీరోలు అంటే క్రష్ ఉంటుంది. వాళ్ళతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశ పడతారు. మరో కొందరు హీరోయిన్లు మాత్రం రొమాన్స్ చేస్తే బాగుండునని అనుకుంటారు. హీరోల పై మోజు కావొచ్చు లేదా అతనంటే పిచ్చి కూడా ఉండొచ్చు. ఇటీవల కొందరు హీరోయిన్లు హీరోలతో పిచ్చితో ఇండస్ట్రీలు కూడా మారుతున్నారు. తాజాగా తెలుగు హీరోయిన్ ఒకరు తనకు బాలీవుడ్ హీరో అంటే పిచ్చి అని బయటపెట్టింది. ఆయనతో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది.. ఆ హీరోయిన్ ఎవరు? ఆమె క్రష్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్‌లో సెటిలైన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. నేటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ల కొరతను తీరుస్తున్నారు ముంబై భామలు. అయితే ఇక్కడ సక్సెస్ కొట్టినవారు తక్కువ మందే. అయినప్పటికీ ముంబై హీరోయిన్లు హైదరాబాద్‌కు దిగుమతి అవుతూనే ఉన్నారు. ఇలా వచ్చిన హీరోయినే కావ్య థాపర్. ఈమె అందం కు కుర్ర కారు ఫిదా అవుతున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలమే అయ్యింది. కానీ ఈమెకు సరైన హిట్ మూవీ పలకరించలేదు..
Also Read: ప్రియుడితో సీక్రెట్ పెళ్లి.. మరొకరితో యవ్వారం.. బయటపడ్డ నటి బాగోతం..!
గతంలో డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు ఆవిరి అయ్యాయి. 2013 లో హిందీలో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అటు మోడల్‌గానూ పతంజలి, మేక్ మై ట్రిప్ సహా దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించింది. తెలుగుతో పాటుగా తమిళ మూవీలు కూడా ఆమెకు కలిసి రాలేదు. దాంతో కావ్యకు నిరాశ మిగిలింది. తెలుగులో వచ్చిన ఏక్ మినీ కథతో కావ్య థాపర్ బ్రేక్ అందుకున్నారు. యువ హీరో సంతోష్ శోభన్‌తో బెడ్‌రూం సీన్స్‌లోనూ రెచ్చిపోయింది. ఆ తర్వాత పలు తమిళ్ మూవీలలో నటించి మెప్పించింది.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కావ్య థాపర్.. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల గురించి, హాట్ ఫొటోలతో రెచ్చగొడుతుంది. అయితే తాజాగా ఓ హీరో అంటే క్రష్ అని తన మనసులో మాటను బయట పెట్టేసింది. ఆ హీరో ఎవరో కాదు షాహిద్ కపూర్.. ఆయనతో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. వీరిద్దరూ కలిసి ఫర్జీ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు.. అతనితో థ్రిల్ గా ఫీల్ అయ్యాను అంటూ బయటపెట్టింది. మరోసారి ఆమె అతనితో రొమాన్స్ చెయ్యాలని ఆశ పడుతుంది. ఆమె కోరిక తీరుతుందో లేదో చూడాలి. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక తెలుగు లో ఓ సినిమా చేస్తుంది.