OTT Movie : ఎన్నో రకాల సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా స్టోరీ నచ్చితే వదిలిపెట్టకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ స్టోరీ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో మనిషి మాంసం తినడానికి అలవాటు పడ్డ ఒక జంట చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సోనీ లీవ్ (Sony LIV) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ఆమీస్’ (Aamis). 2019 లో వచ్చిన ఈ అస్సామీ రొమాంటిక్ హారర్ మూవీకి భాస్కర్ హజారికా దర్శకత్వం వహించారు. ఇందులో మనిషి మాంసం రుచి మరిగిన ఒకజంట, హత్యలు చేయడానికి కూడా సిద్ధపడతారు. ఈ మూవీకి శ్యామ్ బోరా నిర్మాతగా వ్యవహరించారు. అస్సాం లొకేషన్‌లో ఈ మూవీ చిత్రీకరించబడింది. ఇందులో లీమా దాస్, అర్ఘదీప్ బారుహ్ ప్రధాన పాత్రలలో నటించారు. జానపద కథలు, వాస్తవికత, మానసిక భయాందోళనలను మిళితం చేసిన కథ ఈ అమీస్. అమీస్ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను అందుకుంది. ఇక్కడ ఫెస్టివల్ “ఇంటర్నేషనల్ నెరేటివ్” విభాగంలో ఐదు విభాగాలలో నామినేట్ చేయబడింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సుమన్ తన ఫ్రెండ్ కి బాగోలేకపోవడంతో పక్కనే ఉండే నిర్మల అనే డాక్టర్ని సంప్రదిస్తాడు. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం బాగా పెరుగుతుంది. సుమన్ కి మీట్ గురించి బాగా అవగాహన ఉంటుంది. వీటి మీద రీసెర్చ్ కూడా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే అతడు జంతువుల మాంసాలతో రకరకాలుగా వంటలు చేసి నిర్మలకు పంపిస్తుంటాడు. నిర్మల ఈ మాంసానికి బాగా అలవాటు పడిపోతుంది. తన భర్తని కూడా పక్కనపెట్టి అతనితో ఎక్కువగా మాట్లాడుతుంటుంది. ఒకరోజు సుమన్ తన తొడ నుంచి మాంసాన్ని తీసి వండి ఆమెకు పెడతాడు. ఆమె అది తిని మైకంలోకి వెళుతుంది. అంతలా రుచిగా ఉంటుంది ఆ మాంసం. ఆ తర్వాత ఈ మాంసం నాది అని కూడా చెప్తాడు. మొదట బాధపడ్డా దానిని తిని ఆనందపడుతూ ఉంటుంది నిర్మల.
అలా కొద్ది రోజులు మనిషి మాంసాన్ని అలవాటు చేస్తాడు సుమన్. నిర్మల కూడా తనలాగే చేస్తుంది. తన తొడల నుంచి కాస్త తీసి సుమన్ కి వండి పెడుతుంది. అయితే ఒక రోజు ఇలా చేస్తున్నందుకు బాధపడుతుంది. ఎందుకంటే ఆమె పూర్తిగా మనిషి మాంసానికి అలవాటు పడుతుంది. అది లేకపోతే పిచ్చెక్కిపోయే లాగా ఉంటుంది. తనకు ఎక్కువగా మనిషి మాంసం కావాలని అంటుంది. సుమన్ అందుకు ఎవరినైనా చంపి వాండాలని అనుకుంటాడు. ఆ తరువాత వీళ్ళకు అనుకోని సమస్య వస్తుంది. చివరికి ఈ సమస్య నుంచి వీళ్ళిద్దరూ బయటపడతారా? మనుషులను చంపడానికి అలవాటు పడతారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘ఆమీస్’ (Aamis) అనే ఈ రొమాంటిక్ హారర్ మూవీని చూడండి.