E-Paper
Advertisement

Jabardasth Apparao: జబర్దస్త్ అప్పారావు ఫేస్ నల్లగా మారడానికి ఆ సినిమానే కారణమా.. ఏమైందంటే?

Jabardasth Apparao: జబర్దస్త్ అప్పారావు ఫేస్ నల్లగా మారడానికి ఆ సినిమానే కారణమా.. ఏమైందంటే?
Advertisement

Jabardasth Apparao: జబర్దస్త్ అప్పారావు పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అప్పారావు (Apparao)ఇటీవల జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా జబర్దస్త్(Jabardasth) కార్యక్రమానికి దూరమైన ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. అలాగే పలు సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అప్పారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

జబర్దస్త్ కమెడియన్ అప్పారావు…

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇక జబర్దస్త్ అప్పారావు కలర్ పై కూడా ఎన్నో కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఈయన కలర్ గురించి ప్రత్యేకంగా స్కిట్లు కూడా ఉండేవి. అయితే తను పుట్టుకతోనే అలాంటి కలర్ లేడని ఒక సినిమా సమయంలో తన జుట్టుకు వాడిన రంగు కారణంగా తన మొహం మొత్తం ఇలా నల్లగా మారిపోయిందనే విషయాన్ని బయటపెట్టారు. అసలు ఈయన ఫేస్ నల్లగా మారడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

హెయిర్ కలర్ లో ఉండే అమ్మోనియా..

Advertisement

సాధారణంగా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు సినిమాలో తమ పాత్రలకు అనుగుణంగా జుట్టుకు రంగులు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు గిత్త సినిమా సమయంలో తన జుట్టుకు ఉపయోగించిన కలర్ కారణంగా తన ఫేస్ మొత్తం ఇలా మారిపోయిందని తెలిపారు. ఇలా హెయిర్ కలర్ కారణంగా ఫేస్ నల్లగా మారుతుందనే విషయం నాకు తెలియదు అయితే వైజాగ్ లో ఒక షూటింగ్ కోసం అక్కడికి వెళ్తే మేకప్ మెన్ నాతో మాట్లాడుతూ బాబాయ్ మీ మొహానికి అమ్మోనియా పట్టేసిందని తెలిపారు. మనం ఉపయోగించే హెయిర్ కలర్ లో కొన్ని అమ్మోనియాతో తయారు చేసి ఉంటాయి. అయితే నేను జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు నా మొహంపై ఆ అమ్మోని ఎక్కడ పడిందో తెలియదు కానీ ఫేస్ మొత్తం నల్లగా మారిపోయిందని చెప్పారు.

హెయిర్ కలర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ..

Advertisement

సాధారణంగానే నేను కాస్త నలుపు రంగు ఉంటాను అలాంటిది నా మొహానికి అమ్మోనియా పట్టేయడంతో మరొక రకమైన నలుపు రంగులోకి వచ్చేసానని తన ఫేస్ మాత్రమే అలా మారిపోయింది అంటూ జబర్దస్త్ అప్పారావు తన నలుపు రంగు మొహం వెనుక ఉన్న గల కారణాన్ని బయటపెట్టారు. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా హెయిర్ డై వాడుతున్న విషయం తెలిసిందే అయితే ఇందులో రసాయనాలు కలిపి ఉండటం వల్ల ఈ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. జబర్దస్త్ అప్పారావు విషయంలో కూడా ఇలాంటివే జరిగింది. అప్పారావు ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: Tollywood Actress: పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశా.. వైవాహిక జీవితం పై నటి సంచలన వ్యాఖ్యలు!

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×