E-Paper
Advertisement

Tollywood Actress: పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశా.. వైవాహిక జీవితం పై నటి సంచలన వ్యాఖ్యలు!

Tollywood Actress: పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశా.. వైవాహిక జీవితం పై నటి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Tollywood Actress: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటి జయప్రద (Jayaprada) ఒకరు. ఈమె హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా కొనసాగిన ఎన్టీఆర్ ఏఎన్ ఆర్ నుంచి మొదలుకొని చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోలతో కూడా ఈమె సినిమాలు చేసి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న జయప్రద ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు ప్రస్తుతం ఈమె రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

రాజకీయాలలో కొనసాగుతున్న జయప్రద..

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జయప్రదతో పాటు ఇండస్ట్రీలో కొనసాగిన వారిలో రాధ, రాధిక, జయసుధ, వంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరందరూ కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ జయప్రద మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు.

పెళ్లి చేసుకుని తప్పు చేశాను..

Advertisement

ఇలా సినిమా అవకాశాలు తగ్గిపోవడం గురించి ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా కొనసాగిన తాను 25 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అయితే తన జీవితంలో పెళ్లి అనేది తన వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 25 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అని తెలియజేశారు. పెళ్లి విషయంలో తొందర పాటు నిర్ణయం కారణంగా నాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయని, తన జీవితంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి అంటూ జయప్రద ఎమోషనల్ అయ్యారు.

ముగ్గురు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకున్న జయప్రద..

Advertisement

పెళ్లి కారణంగానే తనకు హీరోయిన్ గా అవకాశాలు కోల్పోయాయని పెళ్లి విషయంలో తాను తప్పు చేశాను అంటూ జయప్రద చెప్పడంతో ఈ కామెంట్లపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 25 ఏళ్లలో పెళ్లి చేసుకుని ఆరుపదుల వయసులో పశ్చాత్తాప పడటం అవసరమా అంటూ కొంతమంది ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక జయప్రద 1986 లో నిర్మాత శ్రీకాంత్ నహతా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అయితే అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదతో పెళ్లి పీటలేక్కారు. అప్పట్లో ఈమె పెళ్లి సంచలనంగా మారింది. ఇక జయప్రద శ్రీకాంత్ దంపతులకు ఎలాంటి సంతానం లేరు దీంతో ఈమె తన మేనల్లుడు సామ్రాట్ అనే వ్యక్తిని దత్తత తీసుకున్నారు.

Also Read: Bigg Boss syed Sohel: అమ్మను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ సోహెల్…భరోసా ఇచ్చిన అలీ..

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×