E-Paper
Advertisement

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!
Advertisement

KCR Padayatra:రేపే అసెంబ్లీయే సమావేశాలు మొదలవుతాయన్న తరుణంలో కేసీఆర్ తన పార్టీ mla లతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయిన సంగతి తెల్సిందే.ఇక ఈ సందర్బంగా మళ్ళీ కేసీఆర్ మళ్ళీ పాదయాత్ర పేరు తీయడంతో బీఆర్ఎస్ లో జోష్ కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న గులాబీ పార్టీ.. ఇకపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రధాన అస్త్రాలుగా చేసుకుంటోంది.

Advertisement

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత

ఇప్పటికే విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు శాసనసభను సైతం ఆగిపోయేలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ఇదే పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది .

కేసీఆర్ స్వయంగా నాయకత్వం

ఇక ఈ పోరాటానికి కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహించాలని డిసైడ్ అయ్యారట కూడా .దీంతో . కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారా? అన్న చర్చ ఇపుడు సోషల్ మీడియా లో జోరుగా నడుస్తుంది..

నిజానికి ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయంగా \దూరంగా ఉన్న సంగతి తెల్సిందే .. పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా.. గతంలో ఆయనలో ఉన్న జోష్ ఇప్పుడు లేదు .

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు సభలు పెట్టినా విస్తృతంగా పర్యటనలు మాత్రం పెద్దగా చేసింది లేదు ,ప్రజా సమస్యలపై నోరెత్తింది లేదు.ఇక ఇదే అధికార పక్షం అస్త్రంగా చేసుకుని దాడి చేస్తుంది కూడా

దీంతో వాటన్నింటికి చెక్ పెట్టేందుకు సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలని ఎజెండా గా పెట్టుకుని పాదయాత్రకు పూనుకోబోతున్నాడట కేసీఆర్ .

నీళ్లు, ప్రాజెక్టులు, రైతుల అంశాలే  ప్రధాన ఆయుధం

నిజానికి తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా నీళ్లు, ప్రాజెక్టులు, రైతుల అంశాలే కేసీఆర్ ప్రధాన ఆయుధం .ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇదే అంశాలతో పోరాటం చేయాలని ప్లాన్ వేస్తున్నారట కేసీఆర్ .

ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో దక్షిణ తెలంగాణ రైతుల సమస్యలను ముందుకు తీసుకురావాలని గులాబీ పార్టీ బలంగా ఫిక్స్ అయిందట.

ఇలా చేస్తే బీఆర్ఎస్‌కు రెండు లాభాలు ఉంటాయి. ఒకటి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. రెండోది.. పార్టీ కేడర్‌లో మళ్లీ జోష్ వస్తుంది.ఇప్పటివరకు బీఆర్ఎస్‌కు ఉన్న పెద్ద సమస్య కూడా ఇదే. అధికారంలో ఉన్న సమయంలో యాక్టివ్‌గా ఉన్న నాయకులు, కార్యకర్తలు.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే కేడర్‌లో కూడా కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం పుష్కలం.

కాంగ్రెస్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు

మరోవైపు ఈ పరిణామాలను కాంగ్రెస్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమాలకు రైతులు, ప్రజల నుంచి స్పందన వస్తే.. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏం చేస్తోంది? పనుల పరిస్థితి ఏంటి? నిధులు ఎంత ఉన్నాయి? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అనే విషయాలను ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది.

అయితే బీఆర్ఎస్‌కు కూడా ఇది అంత ఈజీ కాదు. కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చి సభ పెడితే సరిపోదు. ప్రజల్లోకి నిరంతరం వెళ్లాలి. రైతుల సమస్యలను పట్టించుకోవాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి మళ్లీ బలోపేతం చేయాలి.

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ గేర్

మొత్తానికి చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ గేర్ మార్చినట్టుగా కనిపిస్తోంది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పోరాటం పేరుతో మళ్ళీ రాజకీయ చదరంగంలో సమర్ధవంతగా పావులు కదపాలని చూస్తుంది.

Also read :నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

మరి ఇక రేపటి నుండి యుద్ధమే అని గతంలో అన్నట్టుగా పాదయాత్రని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు .అదే జరిగితే మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా అలెర్ట్ కావాల్సిందే.చూడాలి ఈ రాజకీయ చాణక్యుడి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో !

Tags

Related News

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

Big Stories

Advertisement
×