Bigg Boss 10 Telugu: డిజిటల్ మీడియా వేదికగా నిజాలను మాట్లాడుతూ ఎలాంటి బెదురు లేకుండా బోల్డు ప్రశ్నలతో లక్షలాదిమంది వీక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రముఖ యూట్యూబ్, డిజిటల్ జర్నలిస్ట్ సుధీర్ రెడ్డి (Sudheer Reddy)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా సుధీర్ రెడ్డి ‘బిగ్ బాస్ సీజన్ 10’ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. హౌస్ లోకి నాలుగవ కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈయన ఎంట్రీ ఇవ్వడంతో ఈయనకు సంబంధించిన ఒక స్పెషల్ ఏవి ప్లే చేశారు.
ఇందులో భాగంగా సుధీర్ రెడ్డి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించానని తాను రాయలసీమ నంద్యాలకు చెందిన వ్యక్తిని తెలిపారు. ఇక చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న తనకు చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఉన్నాయని తెలిపారు. ఇక చదువులో తాను ఇంటిలిజెంట్ కాదని, అందరిలాగే బీటెక్ చేసి మంచి జాబ్ చేయాలనుకున్నాను కానీ తన వల్ల కాలేదని తెలిపారు. ఇక డిగ్రీలో చేరి ఆరు సంవత్సరాల పాటు డిగ్రీ కోసం కష్టపడ్డానని, ఇప్పటికి డిగ్రీలో ఐదు సబ్జెక్టులు పూర్తి చేయలేకపోయానని సుధీర్ రెడ్డి చాలా నిజాయితీగా తాను చదువులో ఫెయిల్ అనే విషయాన్ని తెలియజేశారు.
ఈ విధంగా చదువు తనకి ఎక్కకపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ కోసం సింగపూర్ వెళ్లానని అక్కడ తెలిసిన వాళ్ళే తనని మోసం చేయడంతో తిరిగి రావడానికి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపారు. చివరికి సింగపూర్లో హౌస్ కీపింగ్ చేసి డబ్బులు సంపాదించుకున్నానని సుధీర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో నాకు ఒక వ్యక్తి పరిచయం కావడం మన ఇండియాలో ఉన్న డిజిటల్ స్కిల్స్ గురించి ఇక్కడ అవకాశాల గురించి చెప్పడంతో తాను ఇండియా వచ్చేసానని తెలిపారు.
ఇలా ఇండియా వచ్చిన సుధీర్ రెడ్డి ఆదాన్ డిజిటల్ ఛానల్ లో హోస్ట్ గా బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా సుదీర్ టాక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాడ్ కాస్ట్ నిర్వహిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తన మాట తీరుతో ఎంతో ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకానొక సమయంలో దేశం కానీ దేశంలో ఎన్నో ఇబ్బందులు పడిన సుధీర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకంగా 1.8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు తన మాటతీరుతో తన నిజాయితీని నిరూపించుకున్న సుధీర్ బిగ్ బాస్ ద్వారా ఎలాంటి ఆదరణను పొందుతారు అనేది తెలియాల్సి ఉంది. హౌస్ లోకి వెళ్లడానికి ముందు నాగార్జున గారితో మాట్లాడుతూ తన ఇన్స్పిరేషన్ అని తెలిపారు అలాగే తనకు అనుష్క శెట్టి అంటే క్రష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!