E-Paper
Advertisement

Jabardasth Sujatha: సుజాత – రాకేష్ యూట్యూబ్ సంపాదన అన్ని కోట్లా.. మరి ఆ తిప్పలు ఎందుకు భయ్యా!

Jabardasth Sujatha: సుజాత – రాకేష్ యూట్యూబ్ సంపాదన అన్ని కోట్లా.. మరి ఆ తిప్పలు ఎందుకు భయ్యా!
Advertisement

Jabardasth Sujatha: జోర్దార్ సుజాత (Jordar Sujatha).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జోర్దార్ వార్తలు చదువుతూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి అక్కడ ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టిన ఈమె అక్కడే టీం లీడర్ గా కొనసాగుతున్న రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) టీంలో వచ్చి మరి కొన్ని స్కిట్లు చేసిన తర్వాత అతడితో ప్రేమలో పడిపోయింది. ఆ ప్రేమ విషయాన్ని జబర్దస్త్ వేదికగా బయటపెట్టిన ఈమె.. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దలను ఒప్పించి తిరుపతిలో ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా దంపతుల సమక్షంలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. ఇక ఈ జంటకు ఒక కూతురు కూడా జన్మించిన విషయం తెలిసిందే.

జబర్దస్త్ ద్వారా భారీ సంపాదన..

ఇకపోతే టీవీ షో లతోనే కాదు ఆమధ్య ‘సేవ్ ద టైగర్స్’ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా మరింత పాపులారిటీ అందుకుంది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా తన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటున్న సుజాత మంచి పేరు తెచ్చుకుంది. అటు రాకేష్ కూడా హీరోగా మారి కేసీఆర్ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఒకవైపు నటీనటులుగా కొనసాగుతున్న ఈ జంట ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇకపోతే వీరిద్దరూ అటు సినిమాలు, సీరీస్ లు , షోలతోనే కాదు తమ లగ్జరీ వస్తువులతో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. పైగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది ఈ జంట. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ద్వారా వీళ్ళు కోట్లు గడిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మరికొంతమంది మరి అంత డబ్బు వస్తున్నప్పుడు చక్కగా యూట్యూబ్ లోనే బ్లాగ్ చేసుకుంటూ కెరీర్ కొనసాగించొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:MSG OTT Release: ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఒక్క మాటతో గట్టి క్లారిటీ..

ముఖ్యంగా రాకేష్ కి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్ తో పాటు స్మార్ట్ ఫోన్ ను సుజాత బహుమతిగా ఇచ్చింది.వీటి ఖరీదు సుమారుగా లక్ష 30 వేల రూపాయల పై మాటే దీంతోనే వీరిద్దరి సంపాదన గురించి ఆరా తీయగా కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి . ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజాతకి ఈ విషయంపై ప్రశ్న ఎదురవగా ఆమె తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది. సుజాత మాట్లాడుతూ.. “మీరు అనుకుంటున్నట్లు కోట్ల రూపాయలు మాకు యూట్యూబ్ ద్వారా సంపాదన వస్తోందనుకుంటున్నారు. ఒకవేళ మాకే ఆ సంపాదన వస్తుంటే మేమెందుకు ఇన్ని తిప్పలు పడతాము. ఇక నా భర్త తీసిన కేసిఆర్ సినిమా కోసం ఆస్తులు కూడా తాకట్టు పెట్టాము. కాస్త మాట్లాడేటప్పుడు ఆలోచించి కామెంట్లు చేయండి” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే సుజాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం , అటు తన భర్తకు కాస్ట్లీ వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం వల్లే ఇలాంటి వార్తలు తెరపైకి వచ్చాయి. ఏది ఏమైనా తమ పై వచ్చిన రూమర్స్ కి స్పందిస్తూ చెక్ పెట్టింది సుజాత.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×