E-Paper
Advertisement

పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!

పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!
Advertisement

Jagadhatri serial Jhansi: ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెర నటినటులతో పాటు వెండి తెర సెలబ్రిటీలు సైతం పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బుల్లితెర నటి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బుల్లితెరపై ప్రసారమైన నిండు మనసులు, లక్ష్మీ నివాసం, సూర్యకాంతం, లక్ష్మీ నివాసం వంటి పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న జగధాత్రి సీరియల్లో నటిస్తూ ఉన్నారు.

పెళ్లి పీటలెక్కిన నటి ఝాన్సీ..

ఇలా కెరియర్ పరంగా ఝాన్సీ ఎంతో బిజీగా గడుపుతున్నారు కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా సినిమాలలోను నటిస్తూ సందడి చేశారు అదేవిధంగా పలు సిరీస్లలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అభిమానులకు మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. ఇటీవల సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న నటి ఝాన్సీ..

Advertisement

ఝాన్సీ ఇషాన్ అనే రచయితతో కలిసి ఏడడుగులు నడిచారు. వీరి వివాహం ఆగస్టు 30వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈమె పెళ్లి ఫోటోలను కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా వీరు పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఝాన్సీ ఇషాన్ ప్రేమ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఝాన్సీకి ఇషాన్ పరిచయం అయ్యారని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

Advertisement

ఇలా ఈమె పెళ్లి ఫోటోలు చూసిన ఇతర బుల్లితెర సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇక ఇషాన్ విషయానికి వస్తే ప్రస్తుతం రచయితగా కొనసాగుతున్న ఈయన డైరెక్టర్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఝాన్సీ విషయానికి వస్తే బుల్లితెర నటిగా ఒకవైపు వరుస సీరియల్స్ చేస్తుంటే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈమె నేనే రాజు నేనే మంత్రి , సిటీ మార్, నీది నాది ఒకే కథ, రంగులరాట్నం, లక్కీ లక్ష్మణ్ వంటి పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.

Also Read: ఆనంద్ దేవరకొండతో పెళ్లి.. ఓపెన్ గా చెప్పేసిన వైష్ణవి చైతన్య!

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×