E-Paper
Advertisement

టీవీల్లోకి జన నాయగన్.. యజమాని అరెస్ట్!

టీవీల్లోకి జన నాయగన్.. యజమాని అరెస్ట్!
Advertisement

Jana nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన సినిమా కెరియర్ లో చివరి సినిమాగా నటించిన చిత్రం జననాయగన్. ఈ చిత్రాన్ని తెలుగులో జననాయకుడు , హిందీలో జననేత అంటూ విడుదల చేయబోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు.. అనుకున్నట్టుగానే జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా సెన్సార్ పనుల వల్ల వాయిదా పడింది ..ఇక ఆరోజు మొదలుకొని ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం.. సెన్సార్ ఇష్యూ వల్ల కోర్ట్ మెట్లెక్కిన నిర్మాతలు.. ఆ తర్వాత దిగివచ్చి సెన్సార్ చెప్పినట్లు సినిమాలోని కొన్ని అంశాలను మార్చడానికి కూడా అంగీకరించారు..

విడుదలకు ముందే సినిమా మొత్తం లీక్..

ఇక త్వరలోనే సినిమాను విడుదల చేద్దామని అనుకునే లోపే సినిమా మొత్తం పైరసీ అయిపోయి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇంకేముంది విజయ్ దళపతి చివరి సినిమా అనుకున్న ఈ సినిమా అనూహ్యంగా సోషల్ మీడియాలో కనిపించేసరికి నిర్మాతలు ఆశ్చర్యపోయారు అసలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో హీరోని ఆశ్రయించగా.. నిర్మాతల కష్టం తనకు తెలుసునని అందుకే తన రెమ్యూనరేషన్ లో సగం వెనక్కి ఇస్తున్నట్లు విజయ్ చెప్పినట్లు వార్తలు వినిపించాయి.

Advertisement

also read:హాట్‌గా పుట్టడం ఇంత తప్పా? ఇది దేవుడిచ్చిన బాడీ.. ఇన్‌స్టా పోస్టులపై విష్ణు ప్రియ కామెంట్స్

లోకల్ ఛానల్స్ లో ప్రసారం.. ఓనర్ అరెస్ట్..

అయితే సినిమాను సోషల్ మీడియాలో పైరసీ చేసిన వారిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా కొన్ని బృందాలుగా ఏర్పడిన పోలీసులు వెంటనే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా జననాయగన్ సినిమా ఏకంగా టీవీల్లోకి రావడంతో ఆ ఛానల్ ఓనర్ ను అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జననాయగన్ సినిమా విడుదల కూడా కాలేదు. కానీ ఈ చిత్రాన్ని కోయంబత్తూర్ లోని ఒక లోకల్ ఛానల్లో ప్రసారం చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది . ఏప్రిల్ 10వ తేదీన జననాయగన్ సినిమా లీకైందని చిత్ర బృందం గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఏప్రిల్ 11న కోయంబత్తూర్ లోని కొన్ని ప్రాంతాలలో పైగా లోకల్ చానల్స్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ దళపతి తమిళగ వెట్రి కలగం పార్టీ నాయకులు చిత్రప్రసారాన్ని వెంటనే నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఛానల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పటికే పూర్తి సినిమా ఛానల్ లో ప్రసారం అయినట్లు టీవీకే నేతలు తెలిపారు.

క్లారిటీ ఇచ్చిన ఎడిటర్స్ యూనియన్..

Advertisement

మరొకవైపు ఈ సినిమా ఎడిటింగ్ విభాగం నుంచి లీక్ అయినట్లు వార్తలు రాగా ఎడిటర్స్ యూనియన్ ఖండించింది.. ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్ కు జన నాయగన్ లీక్ తో ఎటువంటి సంబంధం లేదు అంటూ స్పష్టత ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా లీక్ పై దర్యాప్తు వేగవంతం చేయగా సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. ఇక ఈ ఘటనలో మిగతా బాధ్యులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని అటు సినీ ప్రముఖులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

Related News

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     

Karthika Deepam 2 Serial Today Episode September 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పార్కులో  జ్యోత్స్నను కలిసిన సూరజ్            

Illu Illalu Pillalu Today Episodes: లేచిపోయిన తిరుపతి.. ధీరజ్ ప్లాన్ వర్కౌట్.. నర్మద ప్లాన్ సూపర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

Big Stories

Advertisement
×