SRH VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉప్పల్ స్టేడియంలో పవర్ కట్ అయింది. ఈ సంఘటన జరగగానే స్టేడియంలో ఉన్న అభిమానులందరూ మొబైల్ లైట్స్ ఆన్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, ది అండర్ టేకర్ ( The Undertaker ) వచ్చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్, భారీ స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, క్లాసెన్ అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరు బ్యాటింగ్ చేస్తుండగా 13వ ఓవర్ రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ చేశాడు. అతడు బౌలింగ్ చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఉప్పల్ స్టేడియంలో పవర్ కట్ అయింది. దీంతో స్టేడియం మొత్తం చీకటిమయమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తమకు నచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు.
ఉప్పల్ స్టేడియానికి ది అండర్ టేకర్ వచ్చేసాడని, క్లాసెన్ రూపంలో దర్శనం ఇచ్చాడని అతన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లాంటి మెగా టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఇలా పవర్ కట్ అయితే ఎలా ? అంటూ నిలదీస్తున్నారు. ఇది పాకిస్తాన్ వాళ్లు చూస్తే దారుణంగా ట్రోలింగ్ చేస్తారని హెచ్చరిస్తున్నారు. చాలాసార్లు ఉప్పల్ స్టేడియంలో ఇలాగే పవర్ కట్ అయినట్లు సంఘటనలు గుర్తుచేస్తున్నారు. దీనిపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఇండియా పరువు అంతర్జాతీయంగా పోకుండా ఉండాలంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా సోమవారం కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో హైదరాబాద్ 216 సాధించగా.. ఈ లక్ష్యాన్ని చేదించడంలో రాజస్థాన్ చేతులెత్తేసింది. 159 పరుగుల వద్ద రాజస్థాన్ కుప్పకూలింది. దీంతో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
?igsh=azlyaGlkaWltanFj