E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన పారు

Karthika Deepam 2 Serial Today Episode April 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన పారు
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కొత్త డ్రెస్‌ వేసుకుని వచ్చిన కార్తీక్‌ను పారిజాతం ఏంటి విషయం కొత్త డ్రెస్‌ వేసుకున్నావని అడుగుతుంది. ఏదో ఉంటుంది కానీ ముందు టిఫిన్ చేద్దాం పద అత్తయ్య కార్తీక్‌ నువ్వు రారా టిఫిన్ చేద్దువు అనగానే.. ఇంటి దగ్గర చేసి వచ్చాను చిన్న మేడం గారు అని చెప్తుండగానే.. దీప లోపలికి వస్తూ జ్యోత్సన పోసిన నూనె మీద కాలు పెట్టి జారబోతుంటే.. జ్యోత్స్ననే వెళ్లి చేయి పట్టుకుంటుంది. అందరూ కంగారు పడుతూ దీప అంటూ దగ్గరకు వెళ్తారు. దీప అయోమయంగా  చూస్తుంటుంది. జ్యోత్స్న కోపంగా ఫ్లోర్‌ తడిగా ఉన్నప్నుడు చూసుకుని నడవాలి కదా అంటుంది.

పారిజాతం కూడా అసలు నిన్ను లోపలకి రమ్మన్నారు అంటూ బాధపడుతుంది. శివనారాయణ కూడా లేవగానే ఎవరి ముఖం చూసిందో కానీ ఇవాళ ఒక గండం గడిచింది అంటాడు. దశరథ దీప ఏమీ కాలేదు కదమ్మా.. అని అడగ్గానే.. కాలు బెణికినట్టు ఉంది అని చెప్పగానే.. పారిజాతం కంగారు పడుతుంది. జ్యోత్స్న మాత్రం ప్రతిసారి నేను పట్టుకోలేను కదా కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంటుంది. దీపను కార్తీక్‌ లోపలికి తీసుకెళ్తాడు. నా స్ట్రాటజీ వేరేలా ఉంది బావ అని మనసులో అనుకుంటుంది. దశరథ కూడా దీప అంటే కోప్పడే జ్యోత్స్న దీపను కాపాడటం ఏంటి…? అని అనుమానంగా మనసులో అనుకుంటాడు.

Advertisement

తర్వాత జ్యోత్స్న ఒక్కతే ఉండి దీప కిందపడిపోవడం గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటే కార్తీక్‌ వెళ్తాడు. జ్యోత్స్న ఎలాగైనా దీపను అడ్డుతొలగించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే.. కార్తీక్‌ కోపంగా జ్యోత్స్న ఇంకా దిగజారొద్దు అంటాడు. జ్యోత్స్న కూడా తాను చాలా దిగారిపోయానని ఇంకా దిగజారడానికి ఏమీ లేదని తన లక్ష్యం కార్తీక్‌ను పెళ్లి చేసుకోవడమేనని చెప్తుంది. అప్పుడే పారిజాతం కోపంగా చెప్పు తెగుద్ది.. బరి తెగించి మీద పడతానంటే ముక్కు తాడేసి వాయించి వదలాలి అంటూ తిడుతుంది. కార్తీక్‌ను లోపలికి వెళ్లమని జ్యోత్స్న సంగతి నేను చూసుకుంటానని చెప్పగానే.. ఏం తెలుసని మాట్లాడుతున్నావని జ్యోత్స్న అడగ్గానే.. నువ్వు నూనె పోసింది నేను చూశాను అంటూ పారిజాతం చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. కార్తీక్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పారిజతం, జోత్స్నకు వార్నింగ్‌ ఇస్తుంది. ఈ ప్లాన్లు మానేసి బుద్దిగా ఉండు.. ఈసారి వార్నింగ్‌ చేతల్లో ఉంటుంది అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది పారిజాతం.

కిచెన్‌లో ఉన్న దీప దగ్గరకు వెళ్లిన కార్తీక్‌ ఈ రోజు నువ్వు ఏ పని చేసేది లేదని చెప్తాడు. పారిజాతం వచ్చి ఎందుకు అని అడగ్గానే.. ఈరోజు తమ పెళ్లి రోజు అని చెప్పగానే.. కార్తీక్‌, దీపలను తీసుకుని హాల్లోకి వెళ్లి అందరికి విషయం చెప్తుంది పారిజాతం. అందరూ కలిసి సెలబ్రేషన్స్‌ చేస్తామంటే కార్తీక్‌ వద్దని మీ దీవెనలు కావాలని అడుగుతాడు. శివనారాయణ, దశరథ, సుమిత్రలతో ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత వెళ్లిపోతుంటే..

Advertisement

శివనారాయణ కారు ఇస్తానని ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఇస్తాను అంటే కారు వద్దు, డబ్బులు వద్దు అని కార్తీక్‌ చెప్తాడు. పారిజాతం కోపంగా ఇస్తుంటే ఎందుకు వద్దంటావు..? కడుపుతో ఉన్న పెళ్లాల్ని బైక్‌ మీద తీసుకెళ్తావా అని చెప్పగానే.. సరే పారు నువ్వు చెబితే వెళ్తాను అంటూ వెళ్లిపోతుంటే.. జ్యోత్స్న వచ్చి ఎక్కడికి అంటుంది. చీరలో వచ్చిన జ్యోత్స్న ను చూసి అందరూ షాక్‌ అవుతారు. పారిజాతం మాత్రం కోపంగా ఇదేంటి ఇలా తయారైంది అనుకుంటుంది. గుడికి వెళ్దాం పద అంటూ కార్తీక్‌ను దీపను వంట చేయమని చెప్తుంది. వాళ్ల పెళ్లి రోజని జ్యోత్స్నను గుడికి శివనారాయణ తీసుకెళ్తానంటే వద్దని చెప్తుంది జ్యోత్స్న. కార్తీకే రావాలని పట్టుపడుతుది జ్యోత్స్న. ఎవరు చెప్పినా వినదు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×