E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ లైన్లోకి మరో అమ్మాయి.. పల్లవి దెబ్బకు చక్రధర్ షాక్.. తండ్రి, కూతుర్ల సెంటిమెంట్ హైలెట్..

Intinti Ramayanam Today Episode: కమల్ లైన్లోకి మరో అమ్మాయి.. పల్లవి దెబ్బకు చక్రధర్ షాక్.. తండ్రి, కూతుర్ల సెంటిమెంట్ హైలెట్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 8th: భరత్ ఇంటిదగ్గర చక్రధర్ ఉండడం చూసి మీనాక్షి ఏమైందండీ బ్యాగు తీసుకుని ఇలా వచ్చేసారు అని అడుగుతుంది. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను మీనాక్షి మీ దగ్గర ఉండాలని అనుకుంటున్నాను అని అంటాడు. చక్రధర్ ని బ్యాగ్ తో సహా రావడం చూసిన భరత్ రెచ్చిపోతాడు.. నా ఇంట్లో ఉండనేమో వద్దు అనేసి ఎంత చెప్తున్నా సరే మీనాక్షి మాత్రం ఆయన ఇక్కడే ఉంటాడు ఇది నా నిర్ణయం అని చక్కగా తీసుకొని వెళ్తుంది. అయితే ఈ విషయాన్ని అవని కి ఫోన్ చేసి భరత్ చెప్తాడు. నువ్వొచ్చి ఆ చక్రధర్ ఎందుకు వచ్చాడు కనుక్కో అక్క అని భరత్ ఫోన్ చేసి చెప్తాడు. నాన్న అక్కడికి వచ్చాడు ఎందుకు? సరే నేను వచ్చి కనుక్కుంటాను అని అవని అంటుంది..

పల్లవి కాపురంలో చిచ్చు.. 

కమల్ ఏదో వస్తువులు కొనాలని పెయింట్ షాప్ కి వెళ్తాడు.. అక్కడ కమల్ని చూసినా ఒక అమ్మాయి ఏం అందంగా ఉన్నాడు రా బాబు అనేసి ఫినా అయిపోతుంది.. కమల్ని చూస్తూనే ఉండడంతో కమల్ కి మొదట అర్థం కాదు. ఈ లిస్టులో ఉన్న మందులనే నాకు కావాలి నీకు కమల్ ఇవ్వగానే ఇస్తాను అని అతనికి లైన్ వేస్తూ కనిపిస్తుంది. నేను ప్రతిదీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాను అని కమల్ అనగానే బాగా చెక్ చేసుకోండి అని మాట్లాడుతుంది.. అన్ని మందులు ఇచ్చిన తర్వాత మీరు సినిమాకి వస్తారా అని చెప్పడంతో కమల్ కి బల్బు వెలుగుతుంది.. నువ్వు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదమ్మా.. నువ్వు లైన్ వేయాలంటే ముందుగా అతనికి పెళ్లయిందో లేదో తెలుసుకోవాలి అని వెటకారంగా మాట్లాడుతాడు. నువ్వు అనుకున్నట్లు నేను ఖాళీగా లేను నాకు ఆల్రెడీ పెళ్లయింది అని అనగానే షాక్ అయిపోతుంది.

మీనాక్షికి ఘోర అవమానం.. 

Advertisement

చక్రధర్ రాతిరి నుంచి ఏమి తినలేదు అని మీనాక్షి అతనికి టిఫిన్ తీసుకొని వచ్చి వెళ్లి ఇస్తుంది.. భరత్ అలా ఉండడం కారణంగా చక్రధర్ టిఫిన్ తినను అని అంటాడు.. కానీ చక్రధర్ తింటూ ఉండగా అప్పుడే పల్లవి వచ్చి మీకు తిండి ఎలా సహిస్తుంది? ఇక్కడ ఎందుకు తింటున్నారు అని అడుగుతుంది. నేను ఇక్కడ ఏమి తినడానికి రాలేదు అని చక్రధర్ అనగానే ఇంకాస్త రెచ్చిపోయి టిఫిన్ ని విసిరి కొట్టేస్తుంది.. మీ నాన్న రాత్రి నుంచి ఏం తినలేదమ్మా తినని ఇవ్వు అని మీనాక్షి ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే.. పల్లవి మాత్రం నువ్వు మాట్లాడకు ఇదంతా చేసిన నువ్వు నీ కూతురే అని రెచ్చిపోతుంది.. కానీ మీనాక్షిని దారుణంగా మాట్లాడటంతో అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి కొంచమైన బుద్ధుందా అని చెంప పగలగొడుతుంది..

ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్న అవని..

మీరు పిన్నిని వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఉండడంతో పల్లవి అన్న మాటలే అందరూ అంటారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపొండి నాన్న అని అవని అనగానే చక్రధర్ మీకు ఎవరికీ భారంగా ఉండకూడదు అని నేనే వెళ్ళిపోతున్నాం అని అంటాడు. ఇక్కడ మీరు ఉంటే కచ్చితంగా పల్లవి లాగే పదిమంది కూడా అనుకుంటారు.. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న అని అవని అడుగుతుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చాను అమ్మ మీ పిన్ని నన్ను అర్థం చేసుకోలేదు కనీసం మనిషి లాగా కూడా చూడడం లేదు అని అంటాడు.. తర్వాత చక్రధర్ వెళ్ళిపోతూ ఉంటే అవని ఆపుతుంది.. ఈ ఎపిసోడ్కి ఇదే తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ సీన్..

అవని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. 

Advertisement

చక్రధరి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంటే అవని మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నాన్న ఇక్కడే ఉండండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈయన ఉంటే నాకు ఇక్కడ నచ్చదు అని భరత్ ఎంత చెప్తున్నా సరే.. అవని మాత్రం అమ్మకి ఈ వయసులో తన భర్తతో ఉండాలన్న ఆలోచన ఉంటుంది కదా ఆమె సంతోషాన్ని మనం కోరుకోవాలి అని అవని అంటుంది.. ఆ మాట వినగానే పల్లవి వెల్లి పొమ్మన్నట్లుగా నాటకం ఆడి మళ్లీ ఉండమని చెప్తున్నావా మీ నాటకాలు అన్నీ నాకు తెలీదా అని పల్లవి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రాజేశ్వరి పల్లవి అవని వాళ్ళ ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘పొదరిల్లు’ మాధవ్ జీవితంలో అన్ని కష్టాలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×