E-Paper
Advertisement

మృణాల్ ఠాకూర్ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది..అడవి శేష్ సంచలన వ్యాఖ్యలు!

మృణాల్ ఠాకూర్ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది..అడవి శేష్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Dacoit Movie: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘డెకాయిట్’ (Dacoit). ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అడవి శేష్ సినిమా గురించి, ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Read also-Nindu Noorella Saavasam Serial Today Episode April 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్

మృణాల్ క్యారెక్టర్ హైలైట్

Advertisement

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో చాలా కీలకంగా ఉండబోతోందని శేష్ స్పష్టం చేశారు. “ఈ సినిమాలో ఇంటర్వెల్ సమయంలో మృణాల్ క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ లేదా ఆ సీన్ ప్రేక్షకులకు పిచ్చెక్కించబోతోంది. ఇది కేవలం వైరాలిటీ కోసం చెబుతున్న మాట కాదు, నేను మనస్ఫూర్తిగా నమ్మి చెబుతున్నాను. మృణాల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాకే అతిపెద్ద హైలైట్” అని శేష్ ధీమా వ్యక్తం చేశారు.

సుజిత్ సహకారం

ఆ ఇంటర్వెల్ సీన్ అంత అద్భుతంగా రావడానికి దర్శకుడు సుజిత్ (సాహో ఫేమ్) ఇచ్చిన సలహాలు, సహకారం ఎంతో ఉందని శేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మృణాల్ ఠాకూర్ వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని మెచ్చుకుంటూ, షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత కూడా ఎంతో ఓపికగా కష్టపడి నటించిందని కొనియాడారు.

Advertisement

Read also-పదేళ్ల క్రితమే ఆ కథలు రాసేశారా? బాక్సాఫీస్ హిట్స్ వెనుక డైరెక్టర్ జయశంకర్ ‘మాస్టర్ మైండ్’!

రెండేళ్ల కష్టం..

‘డెకాయిట్’ కోసం తమ టీమ్ గత రెండున్నర ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడుతోందని శేష్ భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు శనీల్ మరియు టెక్నీషియన్స్ నిద్ర లేకుండా పని చేస్తున్నారని, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ‘డెకాయిట్’ సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర మరియు ఆ ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండబోతుందో అని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏప్రిల్ 10న ఈ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×