E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ నే పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్నను బెదిరించిన పారిజాతం      

Karthika Deepam 2 Serial Today Episode August 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ నే పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్నను బెదిరించిన పారిజాతం      
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఇంట్లో అందరూ సూరజ్ తో తన పెళ్లి గురించి మాట్లాడుతుంటే జ్యో బయటకు వెల్లిపోతుంది. వెనకాలే వెల్లిన పారిజాతం కోపంగా ఎందుకు ఇలా చేస్తున్నావు.. సూరజ్‌ను పెళ్లి చేసుకుంటే ఆస్థితో పాటు ఆ సూరజ్‌ గాడు నీకు దక్కుతాడు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే అందరి మనసులు గెలుస్తావు అని చెప్పగానే.. తాను పెళ్లి చేసుకుని ఓడిపోనని ఎందుకంటే తాను ఫైటర్‌ అని లూజర్‌ కాదని చెప్తుంది. కానీ పారిజాతం కోపంగా నేను చెప్పేది నీ మంచికోసమేగా చెప్పేది అంటే అవసరం లేదు అంటుంది జ్యోత్స్న. పారిజాతం కోపంగా ఒక్కసారి కళ్లు తెరచి చూడు నువ్వు సూరజ్‌ను పెళ్లి చేసుకుంటే నువ్వు కోరుకున్న జీవితం గడపొచ్చు.. సూరజ్‌ను పెళ్లి చేసుకుంటావా లేదా..? అని కరాండిగా అడిగితే జ్యో చేసుకోనని తెగేసి చెప్తుంది. దీంతో పారిజాతం సరే నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే.. నా నిర్ణయం నేను తీసుకుంటాను అంటూ బెదిరిస్తుంది.

ఏం నిర్ణయం తీసుకుంటావు అని జ్యో అడిగితే.. నువ్వు సుమిత్ర కూతురువి కాదని.. దీపే నిజమైన కూతురని.. నేనే పుట్టినప్పుడు బిడ్డలను మార్చేశానని ఆ నిజం నీకు కూడా తెలసని చెప్తాను అనగానే.. జ్యో షాక్‌ అవుతుంది. నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా..? అని జ్యో అడిగితే నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అంటుంది పారిజాతం.. నా జీవితం కూడా పాడైపోతుంది అని జ్యో చెబితే ఇప్పుడు నువ్వు చేసుకుంటుంది అదే.. నీకు మాట్లాడే అవకాశమే కాదు.. నీకు ఆలోచించుకునే అవకాశమే లేదు జ్యోత్న్స. నీ అహంకారాన్ని పోగరును అన్నింటిని పక్కన పెట్టి సూరజ్‌ గాడిని పెళ్లి చేసుకో.. వాడు వస్తాడు. మీ అమ్మా నాన్న వాడితో మాట్లాడతారు. మీ అమ్మ అడిగినప్పుడు సరే అని తలాడించాలి. అంతేకానీ నాకు ఇష్టం లేదు అని గానీ.. నేను చేసుకోను అని గానీ సాకులు చెబితే.. అక్కడే అందరితో నువ్వు దాసు కూతురువి అని చెప్తాను. నువ్వు పుట్టక ముందున్న పారిజాతాన్ని చూడాలనుకోకు తట్టుకోలేవు అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. జ్యో బెదిరిస్తున్నావా..? అని అడగ్గానే.. లేదు వార్నింగ్‌ ఇస్తున్నాను.. వచ్చి సైలెంట్‌గా కూర్చో లేదంటే నేను వైలెంట్‌గా మారాల్సి వస్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

కిందకు వెళ్లి జ్యో వస్తుంది సుమిత్ర. గారాభంగా పెరిగిన పిల్ల కదా చెప్పగానే.. మాట వినదు అని చెప్తుండగానే.. సూరజ్‌ వస్తాడు. శివనారాయణ పిలిచి వచ్చినందుకు సంతోషం.. రావడానికి కారణం వెతుక్కోకుండా వచ్చినందుకు అని చెప్పగానే.. కారణ ఉండే వచ్చానని సూరజ్‌ తన బ్యాగులోంచి డబ్బులు తీసి టేబుల్‌ మీద పెట్టి మీరు అవసరానికి డబ్బులు ఇచ్చారు అవే ఇవ్వడానికి వచ్చాను.. ఇక వెళ్తున్నాను అంటూ వెళ్లబోతుంటే.. ఎందుకు వెళ్తున్నావు అంటూ శివనారాయణ అడిగితే తన గురించి మీరు ఎంక్వైరీ చేశారు. నా గురించి నన్ను అడగకుండా నా వెనక ఎంక్వైరీ చేయడం నాకు నచ్చలేదు సార్‌. పైగా జ్యోత్స్న గారు తన దగ్గరకు వచ్చి తనను అవమానించారు. అనాథనని తిట్టారు అంటూ జ్యో చేసిన నిర్వాకం గురించి చెప్తాడు సూరజ్‌.

దీంతో శివనారాయణ గతంలో ఇంతకన్నా ఎక్కవే జరిగింది.. ఒక సందర్భంలో నేను నిన్ను కొట్టాను కూడా అయినా అప్పుడు అవమానంగా ఫీల్‌ కానీ నువ్వు ఇప్పుడే ఫీల్‌ అవుతున్నావంటే జ్యోత్స్న అవమానమే నిన్ను ఎక్కువ బాధపెట్టిందన్న మాట. అనగానే.. అవును సార్‌ అంటాడు సూరజ్‌. దీంతో శివనారాయణ డొంక తిరుగు లేకుండా సూటిగా పాయింట్‌కు వస్తాను.. నీకు జ్యోత్స్న అంటే ఇష్టమేనా..? అని అడగ్గానే.. సూరజ్‌ మౌనంగా ఉండిపోతాడు. శివనారాయణ చెప్పు సూరజ్‌ నీకు జ్యోత్స్న అంటే ఇష్టమేనా..? అని అడిగితే సూరజ్‌ ఇష్టమే సార్‌ అని చెప్పగానే.. అయితే జ్యోత్స్నకు నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం.. వచ్చే నెలలోనే మీకు పెళ్లి చేస్తామని శివనారాయణ చెప్పగానే.. జ్యోత్స్నకు ఇష్టమేనా..? ఆ విషయం మీ ముందు చెప్పాలి అంటూ సూరజ్‌ చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. పారిజాతం, సుమిత్ర, దశరథ ఇష్టమేనని చెప్పమని జ్యోత్స్నకు చెప్తారు. అయినా జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది.

Advertisement

జ్యోత్స్న చెప్పదని తన గురించి అన్ని విషయాలు సూరజ్‌ చెప్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే ఇద్దరి మనసులు కలవాలని.. నా మనసులో జ్యోత్స్న ఉంది కానీ జ్యోత్స్న మనసులో నేను లేను.. జ్యోత్స్న మనసులో కార్తీక్‌ గారే ఉన్నారు అని సూరజ్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్నతో పెళ్లిని కూడా రిజెక్ట్‌ చేస్తున్నాను అనగానే.. అందరూ మరింత షాక్‌ అవుతారు. జ్యోత్స్న అబద్దం బంగారం అంటూ నా వెంట పడ్డావు.. ఐలవ్యూ చెప్పావు.. మనిద్దరికీ రాసి పెట్టి ఉందన్నావు.. ఇంటి ముందే పందిరి వేసి పెళ్లి చేసుకుందాం అన్నావు.. నీలాంటి అమ్మాయే నాకు కావాలి అన్నావు అదంతా అబద్దమేనా..? అని అడగ్గానే.. సూరజ్‌ అవన్నీ నిజాలే అని చెప్తాడు. అవన్ని నిజాలే అయినప్పుడు పెళ్లిని ఎందుకు రిజెక్ట్‌ చేస్తున్నావు బాబు అని పారిజాతం అడిగితే.. అవన్నీ నాకు జ్యోత్స్న గారి మీద ఉన్న ఇష్టాలు.. కానీ జ్యోత్న్స గారి ఇష్టాలు కావు అంటూ సూరజ్‌ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ హౌస్ లోకి అపూర్వ.. మరో కొత్త లవ్ ట్రాక్ షురూ!

బిగ్ బాస్ దేబ్జానీపై సీనియర్ నటులు బ్రహ్మానందం ప్రశంసలు!

Bramhamudi Raj : అయ్యో.. ఇదేం ట్విస్ట్.. రాజు కనిపించడా..?

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రభా అవుట్..

బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని పెట్టిన మంట కాంచన ఇంటిని కాల్చేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Podarillu Today Episode : కేశవ, శైలును కలిపిన చక్రీ.. మహా దెబ్బకు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Big Stories

Advertisement
×