E-Paper
Advertisement

సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ఐకాన్ స్టార్ షాకింగ్ నిర్ణయం..?

సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ఐకాన్ స్టార్ షాకింగ్ నిర్ణయం..?
Advertisement

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పుడు ఆయన చేతిలో రెండు భారీ ప్రాజెక్టులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. సంధ్య థియేటర్ తొక్కిసలాటతో అల్లు అర్జున్ జనాల్లోకి వెళ్లాలంటే కాస్త భయపడుతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. నిజంగానే అల్లు అర్జున్ జనాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నాడా? ఈమధ్య ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీని పెంచుకుంటున్నాడని కొందరు అంటున్న మాట వాస్తవం.. ఇప్పుడు మరోసారి ఆయన సెక్యూరిటీ గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అసలేందుకు అల్లు అర్జున్ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నాడు? సంధ్య థియేటర్ ఘటన రిపీట్ అవ్వకూడదు అని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నాడట.. అసలు ఆయన ఏం చెయ్యబోతున్నాడు.? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది ఒకసారి తెలుసుకుందాం..

ఐకాన్ స్టార్ కు భారీ సెక్యూరిటీ..

అల్లు అర్జున్ ఇటీవల సినిమాలతో పాటుగా పలు వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. ఈమధ్య AAA సినిమాస్ని ప్రారంభించారు.. ప్రముఖ సంస్థ ఏషియన్ తో కలిసి ఆయన తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఇప్పటికే హైదరాబాదులో ఉన్న థియేటర్ మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో ఆంధ్రాలో కూడా ఈ కొత్త సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ కాంబినేషన్‌ లో వైజాగ్ ఇన్ఓర్బిట్ మాల్‌లో నిర్మించిన AAA సినిమాస్ ను ఈనెల 9 న ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసమే అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఆంధ్రాకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.. ఈ కార్యక్రమం అయ్యాక మళ్లీ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం.. రాకా షూటింగ్ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

సంధ్య థియేటర్ ఎఫెక్ట్..?

Advertisement

గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనల దృష్ట్యా, భారీ సెక్యూరిటీతో కేవలం ఆహ్వానితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది.. ప్రారంభ వేడుకలో సామాన్య జనాలకు ఎంట్రీ ఇవ్వకూడదని.. అల్లు అర్జున్ పర్యటన ముగిశాకే ఇతరులకు ఎంట్రీ ఉండేలా ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారట.. ఎనిమిది స్క్రీన్ల మల్టీప్లెక్స్‌లో అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఆగస్టు 10 నుండి ఈ థియేటర్లు ప్రారంభం కానున్నాయట.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ మూవీ తర్వాత మరో యాక్షన్ చిత్రంలో నటించనున్నాడని సమాచారం.. లోకేష్ కనకరాజు తర్వాతే పుష్ప 3 ఉంటుందని టాక్…

Also Read :శుక్రవారం ఓటీటీ వినోదం .. ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్..!

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×