E-Paper
Advertisement

షాకిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ మార్కెట్లో రేట్ల మాటేంటి?

షాకిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ మార్కెట్లో రేట్ల మాటేంటి?
Advertisement

Gold-Silver Price Today: అంతర్జాతీయ పరిణామాలు సానుకూలం నేపథ్యంలో మదుపరులు విలువైన లోహాలపై దృష్టి పెట్టారు. గడిచిన రెండు రోజులుగా బంగారం-వెండి ధరలకు రెక్కలొచ్చాయి. మరి శుక్రవారం మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా పెరిగే సంకేతాలు ఉన్నాయా? అంతర్జాతీయ-దేశీయ మార్కెట్ల ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

 

షాకిచ్చిన బంగారం ధరలు

Advertisement

ఇరాన్‌-అమెరికా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడిన నేపథ్యంలో బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు తగ్గడంతో సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా పెట్టుబడుదారులు బంగారం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బంగారం ధరలు ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

ఇదిలాఉండగా అంతర్జాతీయ మార్కెట్లో గురువారం రోజు భారీగా పెరిగిన ధరలు ఆ తర్వాత స్వల్పంగా దిగొచ్చాయి. అటు సిల్వర్ రేటు 62 డాలర్లపైన కొనసాగుతోంది. దీంతో ఆగస్టు 7 ఉదయం 10 గంటల మధ్య మళ్లీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో రూ. 2650 పెరిగి తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 1,37,250 వద్ద కొనసాగుతోంది. గురువారం రోజు రూ. 2600 పెరిగింది.

Advertisement

 

ఇవాళ మార్కెట్లో రేట్ల మాటేంటి?

ఇక 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,49,730 వద్ద కొనసాగుతోంది. వెండి ధర రూ. 10 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీకి రూ. 2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. ముందటి రోజుతో పోల్చితే రూ. 5 వేల మేరా పెరిగింది.  జాతీయ స్థాయిలో 24K బంగారం 10 గ్రాములకు రూ. 1,49,100గా కొనసాగుతోంది.

22K బంగారం 10 గ్రాములకు రూ. 1,36,675గా ఉంది. చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా నమోదు అయ్యింది. దాని తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, బెంగళూరు నిలిచాయి. వెండి విషయంలో ఇదే ధోరణి కనిపించింది, చెన్నై అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్, బెంగళూరు దాని వెనుకే ఉన్నాయి.

 

టాప్ ప్లేస్‌లో చెన్నై.. ఆ తర్వాత హైదరాబాద్-బెంగుళూరు

తాజా డేటా ఆధారంగా ప్రధాన నగరాల్లో 24K బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబై-10 గ్రాములకు రూ. 1,48,830 కాగా, ఢిల్లీలో 10 గ్రాములకు రూ. 1,48,570 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో 10 గ్రాములకు రూ. 1,49,260 పలికింది. ఆ తర్వాత హైదరాబాద్- 10 గ్రాములకు రూ. 1,49,060 కాగా, బెంగళూరు-10 గ్రాములకు రూ. 1,48,940, కోల్‌కతా-10 గ్రాములకు రూ. 1,48,630 కొనసాగుతోంది.

మార్కెట్ ఓపెన్ తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ముంబైలో రూ. 136,428 కొనసాగుతోంది. ఢిల్లీలో రూ. 136,189 కాగా, చెన్నైలో రూ. 136,822 వద్ద ఉంది. కోల్‌కతాలో రూ. 136,244, బెంగళూరులో రూ. 136,528 ఉంది.

ALSO READ: నెలకు కేవలం రూ.610తో రూ.1 లక్ష సంపాదన.. ఎస్‌బిఐ కొత్త స్కీమ్ గురూ

Related News

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే

ఆన్‌లైన్ షాపింగ్‌‌కు కొత్త రూల్స్, జనవరి ఒకటి నుంచి అమల్లోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

పిపిఎఫ్ vs సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి భవిష్యత్తు కోసం ఏ పథకం ఎక్కువ లాభదాయకం

Big Stories

Advertisement
×