E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: అందరికీ నిజం చెప్పిన శివనారాయణ  

Karthika Deepam 2 Serial Today Episode June 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: అందరికీ నిజం చెప్పిన శివనారాయణ  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: పారిజాతం.. సూరజ్‌ను గుర్తు చేసుకుని కంగారు పడుతుంది. ఇదంతా ఆ దీప వేసిన స్కెచ్‌ నువ్వు ఎలా గెలుస్తావోనని భయంగా ఉంది అంటూ జ్యోత్స్నతో చెప్పగానే.. ఆ సూరజ్‌ను చూసి నన్ను భయపడమంటావా..? గ్రాణి ఇందంతా ఈదురుగాలికి పోగయిన చెత్త లాంటిది. ఒక్క అగ్గిపుల్ల గీశానో కాలి బూడిదైపోతుంది అని చెప్పగానే.. పారిజాతం కోపంగా ఇప్పుడు చెత్తంతా ఎక్కడో పోగవ్వలేదే.. అది నీ చుట్టూనే పోగయింది. ఆవేశంతో అగ్గిపుల్ల గీసావో అది కాలి బూదిడ చేసేది నిన్నే.. అనగానే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ వచ్చి చేసేది ఏమీ లేదు గ్రాణి అనగానే.. వాడు చీకట్లో కురిసే వర్షం లాంటోడు. కంటికి కనిపించడం లేదు కదా అని తక్కువగా అంచనా వేయకు. ఒక సమయం తర్వాత వరదై నీ సరదా తీరుస్తాడు అంటూ హెచ్చరించగానే..

అంత దూరం నేను రానిస్తానా..? అసలు వాడిని ఆఫీసులో ఉండనిస్తే కదా అంటుంది జ్యోత్స్న. దీప సాయంగా తెచ్చిపెట్టుకుందే నువ్వేలా పంపిస్తావు అని అడగ్గానే.. పంపించడం కాదు పారిపోయేలా చేస్తాను.. ఈ జ్యోత్స్నను తలుచుకుంటేనే పారిపోయేలా చేస్తాను. అంటూ చెప్తుండగానే.. అప్పుడే సూరజ్‌ ఫోన్‌ చేస్తాడు. ఏంటి మేడం ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటున్నట్టు ఉన్నావు.. అనగానే.. జ్యోత్స్న కోపంగా రేయ్‌ ముందు నాకు ఎందుకు ఫోన్‌ చేశావు చెప్పరా అంటుంది. దీంతో నన్ను అస్తమానం తలుచుకోకు నాకు ఇక్కడ పొలమారుతుంది అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో సూరజ్‌ థాంక్స్‌ చెప్తాడు. నేను తిడితే థాంక్స్‌ చెప్తావేంటి..? అసలు ఫోన్‌ ఎందుకు చేశావో చెప్పరా అంటూ జ్యోత్స్న కోపంగా తిడుతుంటే..

Advertisement

సూరజ్‌ పాజిటివ్‌గా కూల్‌గా మాట్లాడుతుంటాడు. దీంతో జ్యోత్స్న మరింత కోపంగా నేను ఇంత తిడుతున్నా నీకు కోపం రావడం లేదా..? అని అడుగుతుంది. దీంతో సూరజ్‌ కూల్‌గా తలతిక్క సమాధానాలు చెప్తుంటే.. జ్యోత్స్న ఇరిటేట్‌గా ఫీలవుతుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఈరోజు ఒక్కరోజు ప్రశాంతంగా నిద్రపోండి.. రేపటి నుంచి మీకు నిద్ర కూడా పట్టదు అంటూ కాల్ కట్‌ చేస్తాడు. అంతా విన్న పారిజాతం వీడేంటే ఇంత విచిత్రంగా ఉన్నాడు. మన జీవితంలో ఆడుకునేటోడే ఎవడో ఒక్కడు ఉంటాడంటారు.. వాడు వీడేనేమో నీ జీవితానికి.. ఏ లోకం నుంచి వచ్చాడో వాడు.. అంటుంది. దీంతో జ్యోత్స్న కోపంగా వాడు ఏ లోకం నుంచి వచ్చినా వాడిని వదిలిపెట్టను.. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను అంటూ పారిజాతంతో చెప్తుంది.

శౌర్య ఆడుకుంటూ శివనారాయణ రూంలోకి వెళ్తుంది. అక్కడ బుక్స్‌ కిందపడటంతో శివనారాయణ, దక్షిణమూర్తి కలిసి దిగిన పోటో రెండు ముక్కలు అయిపోయి ఉంటుంది. అది చూసిన శౌర్య ఆ రెండు ముక్కలు పట్టుకుని హాల్లోకి వస్తుంది. జ్యోత్స్నకు ఫోటో చూపించి ఈ తాత ఎవరు అని అడుగుతుంది. అప్పుడే హాల్లోకి సుమిత్ర వస్తుంది. సుమిత్ర అడగమని జ్యోత్స్న, శౌర్యకు చెప్తుంది. శౌర్య సుమిత్రను అడగ్గానే.. ఫోటో చూసిన సుమిత్ర షాక్‌ అవుతుంది. అప్పుడే దశరథ, దీప, కార్తీక్‌, కాంచన వస్తారు. వాళ్లు కూడా ఆ ఫోటో చూసి షాక్‌ అవుతారు. శౌర్య మాత్రం ఏ ఫోటో ఎవరు చూసినా ఏం చెప్పడం లేదేంటి..? ఇది నేను చింపలేదు.. ఇది ఇలాగే ఉంది అంటుంది..? దీప ఆ ఫోటో ఇలా ఇవ్వు శౌర్య అనగానే.. ఈ ఇంటికి వచ్చిన తాత ఈ ఫోటో లో ఎందుకు ఉన్నాడో నేను ముద్దుల తాతనే అడుగుతాను అనగానే..

Advertisement

అప్పుడే శివనారాయణ వచ్చి ఏంటి అడిగేది అంటాడు. జ్యోత్స్న మాత్రం ఇప్పుడు మొదలవుద్ది అసలు డ్రామా అని పారిజాతానికి చెప్తుంది. శౌర్య చిరిగిన ఫోటో ముక్కలు చూపిస్తూ.. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు..? మీరిద్దరూ ఫ్రెండ్సా..? ఈ ఫోటో ఎవరు చింపారు..? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దీంతో కార్తీక్‌, శౌర్యను లోపలికి వెళ్లమని చెప్పినా వినకుండా అలాగే ప్రశ్నలు అడుగుతుంది. ఇంతలో కాంచన శౌర్యను దగ్గరకు తీసుకుని ఫోటో తీసుకుని శౌర్యను బయటకు పంపిస్తుంది. శివనారాయణకు కాంచన సారీ చెప్తుంది. జ్యోత్స్న నువ్వెందుకు అత్త అడ్డు పడతావు.. నీ కొడుకు, కోడలు అనుకున్నదే జరుగుతుంది అంటూ దీప, కార్తీక్‌ల మీద నెంప మోపాలని శివనారాయణతో తిట్టించాలని చూస్తుంది. దీంతో కార్తీక్‌, దీప ఇద్దరూ కోపంగా జ్యోత్స్నను తిడతారు. ముగ్గురు గొడవ పడుతుంటే.. శివనారాయణ ఇక ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే దీప భయంగా శివనారాయణకు సారీ చెప్తుంది.

దీంతో అసలు ఏం జరిగిందో అందరికీ తెలియాలి అంటూ ప్లాష్‌బ్యాక్‌ చెప్తాడు శివనారాయణ. అసలు నిజం తెలిసుకున్న అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ ఎమోషనల్‌గా వాడు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడంటే మళ్లీ ఏదో చేస్తాడనే భయంగా ఉంది అంటూ అన్ని విషయాలు చెప్తాడు. ఇక ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసుకు వెళ్దాం పదండి అంటూ శివనారాయణ వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోతారు. పారిజాతం, జ్యోత్స్న అలాగే నిరాశగా నిలబడిపోతారు. మనం అనుకున్నది ఏనాడు జరగదే.. ఇక నువ్వు ఆఫీసుకు వెళ్లు అని చెప్పగానే.. జ్యోత్స్న వెళ్లిపోతుంది.

దీప, కార్తీక్‌, జ్యోత్స్న ఆఫీసుకు వెళ్లగానే.. అప్పటికే సూరజ్‌ వచ్చి వర్క్‌ చేస్తుంటాడు. సూరజ్‌ను చూసి జ్యోత్స్న ఇరిటేటింగ్‌ గా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Big Stories

Advertisement
×