E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను చంపేందుకు పారిజాతం ప్లాన్   

Karthika Deepam 2 Serial Today Episode May 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను చంపేందుకు పారిజాతం ప్లాన్   
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఇంటికి వెళ్లిన కార్తీక్‌, దీప దక్షిణమూర్తి గురించి కాంచనతో చెబితే కాంచన కోపంగా తిడుతుంది. దీంతో శివనారాయణ ఇంట్లో జరిగిన విషయాలు మొత్తం చెప్పగానే.. ఈ విషయంలో మీరు అసలు కలగజేసుకోవద్దు అంటూ చెప్పి కాంచన వెళ్లిపోతుంది. దీప మాత్రం తాత పేరు ఎత్తితేనే అందరూ ఇంతలా రియాక్ట్‌ అవుతున్నారేంటి బావ అని అడుగుతుంది. దీంతో కార్తీక్‌ దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది. అని అడగ్గానే.. గతంలో ఏదో జరగకూడనిదే జరిగింది అనిపిస్తుంది. అనగానే..

కార్తీక్‌ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. మనం ఇక తాత గురించి మర్చిపోతేనే మంచిది అనిపిస్తుంది అనగానే.. నాకు ఒక తాత ఉన్నారని తెలిశాక వాళ్ల వివరాలు తెలుసుకోకుండా ఎలా వదిలేస్తాం బావ అంటుంది దీప. తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో చూశాం కదా వద్దు దీప ఇప్పటికే మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటి గురించి ఆలోచిద్దాం.. ముందు ఆ జ్యోత్స్న సంగతి చూడాలి. ఇక్కడి సమస్యలు పరిష్కరించాలి. ఆ తర్వాత నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరకు కూతురుగా చేర్చాలి ఆ తర్వాత మిగతా బంధాల గురించ ఆలోచిద్దాం అంటూ లోపలికి వెళ్లిపోతాడు. కానీ దీప మాత్రం దక్షిణమూర్తి గురించి ఆలోచిస్తుంది.

Advertisement

హాల్లో కూర్చుని దక్షిణమూర్తి గురించి ఆలోచిస్తుంది సుమిత్ర. అప్పుడే టిఫిన్‌ తీసుకుని వచ్చిన జ్యోత్స్న, పారిజాతాన్ని నువ్వు వెళ్లి తాతను తీసుకురా అని చెప్తుంది. పారిజాతం ఈ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా..? అని అడగ్గానే.. అవ్వాలి అంటూ టిఫిన్‌ తీసుకుని వెళ్లి సుమిత్రకు మాటలు చెప్పి టిఫిన్‌ తినిపిస్తుంది. పారిజాతం లోపలికి వెళ్తుంది. జ్యోత్స్న టిఫిన్‌ చేస్తూ.. కంపెనీ సీఈవో గురించి మాట్లాడుతుంది. ఎవరు సీఈవో అవుతారో నాకు తెలియడం లేదు అనగానే.. శివనారాయణ వచ్చి అది నీకెందుకు తెలియాలి అంటాడు. మనసులో మాట చెప్పుకునే హక్కు కూడా లేదా అంటుంది జ్యోత్స్న. చెప్పుకోమని పారిజాతం, సుమిత్ర చెప్పగానే.. తనకు కాబోయే భర్తే కంపెనీ సీఈవో అయితే బాగుంటుంది అని జ్యోత్స్న చెప్పగానే.. శివనారాయణ షాక్‌ అవుతాడు. కార్తీక్‌ చెప్పినట్టే చెప్తుందేంటి..? మా మాటలు విందా ఏంటి అనుకుంటాడు. ఇంతలో జ్యోత్స్న తనకు పెళ్లి అయి తన భర్త సీఈవో అయ్యే వరకు తాను సీఈవోగా ఉంటానని చెప్తుంది.  దీంతో శివనారాయణ తాను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్తాడు. దీంతో జ్యోత్స్న మైండ్‌ గేమ్‌ ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు బావ అని మనసులో అనుకుంటుంది.

తర్వాత ఆఫీసుకు వెళ్తుంటే.. జ్యోత్స్న, కార్తీక్‌ ను పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతుంది. దీంతో ఒక మంచి కుర్రాణ్ని చూసి పెళ్లి చేస్తానని చెప్తాడు. దీంతో జ్యోత్స్న డ్రీమ్‌లోకి వెళ్తుంది. అవే మాటలు చెప్తుంది. తన మెడలో కార్తీక్‌ తాళి కడుతుంటే.. దీప తన జడ ఎత్తి పట్టుకుంటే అసలు ఊహించుకోవడానికే అద్బుతంగా ఉంది అని చెప్తుంటే..  కార్తీక్‌ పగటి కలలు కనకండి పెద్దమేడం గారు అంటూ వెటకారంగా పంచులు వేస్తాడు. తర్వాత ఆఫీసుకు వెళ్లాక బోర్డు మీటింగ్‌ లో కార్తీక్‌ ఉండకుండా చేసేందుకు జ్యోత్స్న తన మొబైల్‌ కారులో మర్చిపోయానని తీసుకురమ్మని పంపిస్తుంది. కార్తీక్‌ బయటకు వెళ్లగానే.. లోపల శివనారాయణ జ్యోత్స్నను కొత్త సీఈవోగా ప్రకటిస్తాడు. అలాగే కొత్త సీఈవో ఎంపికలో జ్యోత్స్న కూడా పాల్గొంటుందని చెప్తాడు.  విషయం తెలుసుకున్న కార్తీక్‌ షాక్‌ అవుతాడు.

Advertisement

మీటింగ్‌ అయిపోయాక జ్యోత్స్న కార్తీక్‌ దగ్గరకు వెళ్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తనకు కంగ్రాట్స్‌ చెప్పమని అడుగుతుంది. తర్వాత సుమిత్రకు ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. అంతా వింటున్న పారిజాతం హ్యాపీగా ఫీలవుతుంది. దీప మాత్రం షాక్‌ అవుతుంది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లిన దీప వెనకే వెళ్లిన పారిజాతం ఏమీ తెలియనట్టు ఈ జ్యోత్స్న ఏం ఇంత షాక్‌ ఇచ్చింది. అంటూ అడగ్గానే.. దీప కూడా తనకేమీ తెలియదని చెప్పగానే.. పారిజాతం కోపంగా మనసులో అప్పుడంటే నీ తలరాతని కుబేర మార్చాడు. కానీ ఇప్పుడెవడు మారుస్తాడు. ఎవ్వడూ రాడు.. ఎవ్వడు కాపాడలేడు అనుకుంటుంది.

మరోవైపు శివనారాయణను కలిసిన కార్తీక్‌, శ్రీధర్‌, సీఈవో విషయంలో తొందరపడ్డారని చెప్పగానే.. జ్యోత్స్న ఇంట్లో సుమిత్రతో రికమండేషన్‌ చేయించిందని సీఈవో పదవి తనకు ఇవ్వాలని పట్టుపట్టిందని జరిగింది చెప్తాడు శివనారాయణ.  ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×