E-Paper
Advertisement

టాలీవుడ్ వర్సెస్ ‘సేథ్ జీ’.. థియేటర్ల యజమానులతో నిర్మాతల అమీతుమీ!

టాలీవుడ్ వర్సెస్ ‘సేథ్ జీ’.. థియేటర్ల యజమానులతో నిర్మాతల అమీతుమీ!
Advertisement

Tollywood Crisis: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక ఊహించని అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి పెద్ది సినిమా విడుదలకు ముందు ఏదో ఒక గొడవ తెర పైకి వస్తుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, ఎగ్జిబిషన్/ఫైనాన్స్ రంగంలో కీలక పాత్ర పోషించే ‘సేథ్ జీ’ వర్గానికి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. రాబోయే రోజుల్లో థియేటర్ల మనుగడ, సినిమా కలెక్షన్ల షేరింగ్ విధానం ఎలా ఉండాలనే అంశంపై ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

Read also-Mrunal Thakur : గార్జీయస్ లుక్ లో మృణాల్.. మెంటలెక్కిపోతుంది మావా..

వివాదానికి కారణం?

Advertisement

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వివాదానికి ప్రధాన కారణం రెవెన్యూ షేరింగ్, మారిన టెక్నాలజీ విధానాలే. ఒకప్పుడు థియేటర్ల యజమానులు, నిర్మాతలు కలిసికట్టుగా వ్యాపారం సాగించేవారు. కానీ ఓటీటీ (OTT) విప్లవం వచ్చిన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆదాయ పంపిణీలో మార్పులు: సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు (సేథ్ జీ వర్గం) టిక్కెట్ అమ్మకాలపై వచ్చే ఆదాయంలో తమకు ఇచ్చే శాతం (పర్సంటేజ్) పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. పాత పద్ధతుల వల్ల తాము నష్టపోతున్నామని వారి వాదన. సినిమా థియేటర్లలో విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారని, ఈ సమయాన్ని కనీసం 6 నుండి 8 వారాలకు పెంచాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కానీ నిర్మాతలు మాత్రం తమ ఆర్థిక సేఫ్టీ కోసం ఓటీటీ డీల్స్‌ను త్వరగా ముగించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

నిర్మాతల ఆవేదన..

ఈ డిమాండ్లపై టాలీవుడ్ నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల పారితోషికాలు, మేకింగ్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోయాయని, సినిమా ఫ్లాప్ అయితే వందల కోట్లు నష్టపోయేది కేవలం నిర్మాత మాత్రమేనని వారు గుర్తు చేస్తున్నారు. “సినిమా హిట్ అయితే అందరికీ లాభాలు వస్తాయి, కానీ ఫ్లాప్ అయితే ఆ భారం మొత్తం నిర్మాతపైనే పడుతుంది. ఇలాంటి తరుణంలో థియేటర్ల యజమానులు కూడా అదనపు పర్సంటేజ్ అడిగితే అసలు సినిమా నిర్మించడమే కష్టమవుతుంది” అని ఒక ప్రముఖ నిర్మాత వ్యాఖ్యానించారు.

Advertisement

read also-జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నకిలీ విరాళాల సేకరణ.. అభిమానులకు ‘తారక్’ టీం హెచ్చరిక!

థియేటర్ల బంద్

ఈ వివాదం ఎంతవరకు దారితీసిందంటే.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాలు తమ డిమాండ్లను అంగీకరించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేస్తామని (బంద్) హెచ్చరించాయి. ఇదే కనుక జరిగితే రాబోయే భారీ చిత్రాల విడుదలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తెలుగు సినీ పరిశ్రమ సజావుగా సాగాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు/సేథ్ జీ వర్గం ఇద్దరూ కలిసి ఒక మధ్యేమార్గం వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చలు సఫలమైతేనే ఈ వివాదానికి తెరపడి, టాలీవుడ్ బాక్సాఫీస్ బిజినెస్ మళ్లీ పుంజుకుంటుంది. లేనిచో పరిశ్రమకు భారీ నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×