E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           
Advertisement

Karthika Deepam 2 serial today Episode:   మార్చురీ దగ్గర కూర్చుని ఎమోషనల్‌ అవుతున్న సూరజ్‌, జ్యోత్స్నను చూసినట్టు కలగంటాడు. దగ్గరకు వెళ్లి చూస్తే.. అక్కడ జ్యోత్స్న ఉండదు. దీంతో సూరజ్‌ పిచ్చిపట్టనట్టు ఏడుస్తూ.. నేను జ్యోత్స్నను చూశానా..? జ్యోత్స్న ఎక్కడ ఉంది. లక్కీగా ఆ డెడ్‌బాడీ జ్యోత్స్నది కాదు అనుకుంటూ ఈ విషయం వెంటనే కార్తీక్‌కు చెప్పాలి అనుకుంటూ మేసేజ్‌ చేస్తాడు. అప్పుడే ఇంటి దగ్గర ఉన్న దీప ఏడుస్తుంది. ఆ డెడ్‌బాడీ జ్యోత్స్నది కాదని కార్తీక్‌ ఓదారుస్తుంటాడు. అప్పడే సూరజ్‌ పెట్టిన మెసేజ్‌ వస్తుంది. అది చూసిన కార్తీక్‌ హ్యాపీగా అది జ్యోత్స్నది కాదంట అని చెప్తాడు. దీప ఏడుస్తూ.. అవును ఆ డెడ్‌బాడీ జ్యోత్స్నది కాదు నేను చెప్పాను కదా అంటుంది. అప్పుడే సుమిత్ర వచ్చి డోర్‌ దగ్గర నిలబడి చూస్తుంది. లోపలికి వెళ్లి నా కూతురుకు ఏమైంది చెప్పండి అంటూ ఏడుస్తుంది. కార్తీక్ విషయం మొత్తం చెప్తాడు. సుమిత్ర ఏడుస్తుంది. కార్తీక్‌ ఓదారుస్తుంటాడు.

మరుసటి రోజు ఉదయం కార్తీక్‌, దీప నిద్రలేచి చూస్తే దక్షిణమూర్తి గేటు దగ్గరే కూర్చుని నిద్రపోతుంటాడు. సూరజ్‌ కారులో పడుకుని ఉంటాడు. అప్పుడే సూరజ్‌కు ఫోన్ వస్తుంది. సూరజ్‌ షాకింగ్‌గా ఫోన్‌ మాట్లాడి ఎప్పుడు నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ వెళ్లిపోతాడు. చూస్తున్న దీప కార్తీక్‌తో ఏమై ఉంటుంది బావ. రాత్రి కూడా ఇలాగే వెళ్లాడు..  ఎందుకు వెళ్లాడో ఫోన్‌ చేసి అడుగు అని చెప్తే కార్తీక్‌ వద్దని కాసేపు ఆగి చూద్దామని చెప్తాడు.

Advertisement

సూరజ్‌ కోపంగా ఆఫీసులోకి వెళ్తుంటే మేనేజర్‌ ఎదురుగా వస్తాడు. సూరజ్‌ ఎక్కడుందని అడిగితే అదిగో సార్‌ అని చెప్తాడు. జ్యోత్సన తన చైర్‌లో కూర్చుని వర్క్‌ చేస్తుంది. సూరజ్‌ కోపంగా వెళ్లి జ్యోత్స్న అంటూ గట్టిగా అరుస్తాడు. అందుకు జ్యోత్స్న ఏమైంది సార్‌ అని అడిగితే.. నీతో మట్లాడాలి లోపలికి రా అంటాడు. జ్యోత్స్న వెళ్లి ఫైల్‌ చూపిస్తుంటే.. సూరజ్‌ కోపంగా మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. అది నా ఇష్టం సార్ ఇప్పుడు వచ్చేశాను కదా అంటుంది. అందుకు సూరజ్‌ కోపంగా అరుస్తూ.. నీ వల్ల మేమ నీ ఇంటి ముందు కాపలా కాయాల్సి వచ్చింది అంటూ చెప్పగానే.. ఎందుకురా అరుస్తావు అంటుంది. అందుకు సూరజ్‌ కోపంగా మీ అమ్మ మీద కేసు పెట్టి మీ అమ్మ మా ఇంటికి పోలీసులను తీసుకొచ్చింది. అందుకే అరుస్తున్నాను అంటే అయితే నన్ను ఏం చేశావని మీ అమ్మను అడగాల్సింది.. అంటే

అడిగాను కానీ తనకు తెలియదు అంది మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మా తాత నేన మీ ఇంటి వాకిట్లో కూర్చున్నాము అంటూ మొత్తం చెప్తాడు సూరజ్‌. ఈ మూడు రోజులు ఎక్కడికి వెళ్లావు.. ఏమైపోయావు… నిన్ను ఎవరు మాయం చేశారు అంటూ సూరజ్‌ అడిగితే.. జ్యోత్స్న నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటే సూరజ్‌ కోపంగా జ్యోత్స్నను కొట్టబోతుంటే మాలిని వస్తుంది. దించరా  చేయి పనివాళ్ల మీద యజమానులు చెయ్యి ఎత్తకూడదు.. వాళ్లకు ఎలా బుద్ది చెప్పాలో అలాగే చెప్పాలి అంటుంది. మాలిని మాట్లాడుతుంటే. సూరజ్‌ మాత్రం జ్యోత్స్న వచ్చిందని ఆ ఇంట్లో తెలియాలి అంటూ జ్యోత్స్న ఫోన్ నుంచి వీడియో కాల్‌ చేస్తాడు.. ఆ కాల్‌ చూసి కార్తీక్‌ అందరినీ పిలుస్తాడు. జ్యోత్స్న వీడియో కాల్‌ చేసిందని చెప్తాడు. ఆ మాట విన్న దక్షిణమూర్తి ఇంట్లోకి వెళ్లబోతూ ఆగిపోతాడు. అందరూ జ్యోత్స్నతో మాట్లాడిన తర్వాత దక్షిణమూర్తితో మాట్లాడి ఇంటికి వెళ్లిపోమ్మని చెప్తుంది. కాల్‌ కట్‌ చేసి ఇది చాలా సార్‌ అంటూ సూరజ్‌ను వెటకారంగా అడుగుతుంది జ్యోత్స్న. సూరజ్‌ కోపంగా చూస్తుంటాడు.

Advertisement

ఇంటి దగ్గర ఉన్న దక్షిణమూర్తి, శివనారాయణకు గొడవ జరుగుతుంది. తన మనవరాలు ఈ ఇంట్లో అడుగుపెట్టే వరకు నేను వెళ్లను అన్నాను.. జ్యోత్స్న వచ్చిన తర్వాత వెళ్తాను. జ్యోత్స్నను సుమిత్రకు అప్పగించిన తర్వాతే వెళ్తాను అంటూ సూరజ్‌కు ఫోన్‌ చేసి ఏదో చెప్తుంటాడు. కట్‌ చేస్తే.. ఆఫీసులో ఉన్న మాలిని దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న ఒంటి మీద ఒక్క గీత కూడా పెట్టకుండా ఎలా ఇంత సేఫ్‌గా వదిలేశావు అత్త అంటుంది. ఆ మాటలకు మాలిని షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

Big Stories

Advertisement
×