Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న ఆఫీసుకు వెళ్తు్న్నానని అందరికీ చెప్పి వెళ్లిబోతుంటే.. కార్తీక్, దీప వచ్చి ఆపేస్తారు. ఇంట్లో వాళ్ల తమ మీద ఒక బాధ్యత పెట్టారని అది జ్యోత్స్నను ఆఫీసుకు వెళ్లకుండా ఆపేస్తే మా మీద పడిన నింద చెరిపేస్తామని మమ్మల్ని నమ్ముతామని చెప్పారు. కానీ తాము జ్యోత్స్నను ఆపలేమని.. మాకు జీవితం ఉన్నట్టే తనకు ఓ జీవితం ఉందని తమకు లక్ష్యం ఉన్నట్టే జ్యోత్స్నకు ఓ లక్ష్యం ఉందని చెప్తారు. మాకు ఆశయం ఉన్నట్టు తనకు ఓ ఆశయం ఉంది. ఒకరు చెప్తే మేము ఆగనప్పుడు మా స్వార్థం కోసం ఇంకొకరిని ఆపే హక్కు మాకు ఎక్కడుంది. జ్యోత్స్న, సూరజ్ దగ్గర పీఏగా చేయాలనుకుంటే చేస్తుంది. తాను మానేయాలనుకుంటే మానేస్తుంది. మేము అయితే ఆపాలనుకోవడం లేదు అంటారు.
శివనారాయణ కోపంగా శభాష్ మీరు మాలిని మనుషులు అని చెప్పకుండానే చెప్తున్నారు అంటాడు శివనారాయణ. దక్షిణమూర్తి చేత నా కూతురుకు జాబ్ ఇప్పించింది మీరేనని నాకు అనుమానం ఉంది అని సుమిత్ర అంటుంది. దీంతో కాంచన అరేయ్ కార్తీక్ నీ మీద ఇన్ని నిందలు వేస్తుంటే.. మౌనంగా ఉంటావేంటి..? అని అడిగితే.. నిందలు కాదమ్మా అవే నిజాలు అంటాడు కార్తీక్. దీంతో అందరూ షాక్ అవుతారు. శివనారాయణ కోపంగా తిడుతూ జ్యోత్స్న ఇంకా ఆఫీసుకు వెళ్లిన మనం బతికినా చచ్చినట్టే అంటాడు. అందుకు జ్యోత్స్న అందరినీ తిట్టి కార్తీక్ గురించి గొప్పగా చెప్తుంది. మీరు అపార్థం చేసుకున్నంత కాలం మీకు బావ నిందితుడే.. కానీ అర్థం చేసుకున్న రోజు బావ మీకు దేవుడు అవుతాడు అంటూ చెప్పి జ్యోత్స్న వెళ్లబోతుంటే.. సుమిత్ర చేయి పట్టుకుని ఆపేస్తుంది. నువ్వు వెళితే నేను ప్రాణాలతో ఉండనని బెదిరిస్తుంది. మాట వినని కూతురికి తల్లిలా ఉండటం కంటే చనిపోవడమే బెటర్ అంటుంది.
ఆ మాటలకు జ్యోత్స్న అయితే ఓడిపోయిన కూతురుకు తల్లిగా ఉంటావా..? నీ కూతురు చేతకానిది కాదు మమ్మీ నన్ను వెళ్లనివ్వండి.. నాకో జీవితం ఉంది. ఆ జీవితానికో లక్ష్యం ఉంది అంటూ చెప్తుంటే.. అయితే నువ్వు వెలితే నా ప్రాణం పోయినట్టే అంటుంది సుమిత్ర. అయితే నన్ను ఆపితే నేను చనిపోతాను మమ్మీ నేను ఎంత మొండిదాన్నో నాకన్నా మీకే బాగా తెలుసు.. నాకు నా మాట కన్నా ప్రాణం ఎక్కవేం కాదు అంటుంది జ్యోత్స్న. దశరథ వెంటనే సుమిత్రను జ్యోత్స్న చేయి వదిలేయమని చెప్తాడు. ఆఫీసుకు వెళ్లమని జ్యోత్స్నకు చెప్తాడు. నీ వెనకాల నీ తండ్రి ఉన్నాడు నీకు ఆఫీసులో ఏమైనా ఇబ్బంది అయితే ఒక్క ఫోన్ కాల్ చేయి నేను వచ్చి అంతా చూసుకుంటాను నువ్వు ఆఫీసుకు వెళ్లు జ్యోత్స్న అని పంపిస్తాడు. జ్యోత్స్న, దశరథతో ఎమోషనల్ అయి ఆఫీసుకు వెళ్లిపోతుంది.
ఆఫీసులో ఉన్న సూరజ్, మాలిని దగ్గరకు దక్షిణమూర్తి వెళ్తాడు. మీరెందుకు వచ్చారు మామయ్య అని మాలిని అడిగితే.. నా మనవరాలు జ్యోత్స్నను చూడాలని వచ్చాను అంటాడు. జ్యోత్స్న ఇక ఆఫీసుకు రాదని సూరజ్ చెప్తాడు. వాళ్లింట్లో వాళ్లు జ్యోత్స్నను ఆఫీసకు పంపించరు అంటూ మాలిని చెప్తుంది. అది నా మనరాలురా.. సుమిత్ర కూతురు తప్పకుండా ఆఫీసుకు వస్తుంది. ఒకవేళ అది ఆఫీసుకు రాకపోతే నా మనవరాలే కాదు.. సుమిత్ర కూతురే కాదు అని దక్షిణమూర్తి చెప్తుండగానే.. జ్యోత్స్న ఆఫీసుకు వెళ్తుంది. జ్యోత్స్నను చూసిన మాలిన, సూరజ్ షాక్ అయితే.. దక్షిణమూర్తి హ్యాపీగా ఫీలవుతాడు. రాదని చెప్పావు మళ్లీ ఎందుకు వచ్చిందని మాలిని అడిగితే ఏమో ఇంట్లో వాళ్లు ఎందుకు పంపించారో అంటాడు సూరజ్. ఇది మళ్లీ వచ్చిందంటే ఏదో ప్లాన్ తోనే వచ్చి ఉంటుంది. సూరజ్ జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఇంత జరిగినా ఆఫీసుకు వచ్చావు.. నువ్వు జింక పిల్లవి అనుకున్నాను పులి పిల్లవే అంటాడు. జ్యోత్స్న వెటకారంగా నవ్వుతూ వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.