Karthika Deepam 2 serial today Episode: ఆఫీసు నుంచి జ్యోత్స్న తనకు తానే వెళ్లిపోయేలా చేయాలని సూరజ్ అనుకుంటాడు. అందుకోసం జ్యోత్స్న ఫైల్స్ తీసుకుని వెళ్లితే అవి చూసిన సూరజ్ నీకు అసలు పని చేయడం రాదు. అంటూ పేపర్స్ తీసి జ్యోత్స్న ముఖం మీదకు విసురుతాడు. దీంతో జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది. సూరజ్ తిడుతుంటాడు. రికమండేషన్ మీద జాబ్ తెచ్చుకుంటే ఇలాగే ఉంటారు. అందుకే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. పని చేయడం రాదు అలాగని పని చేయడం చేతకాదని ఒప్పుకోవడం కూడా రాదు అంటూ తిడుతుంటే.. జ్యోత్స్స ఒక్కసారిగా భద్రకాళిలా మారిపోతుంది.
సూరజ్ దగ్గరకు వెళ్లి గల్లా పట్టుకుని చెంపలు వాయించి సూరజ్ ను తిడుతుంది. ఈ కంపెనీకి నేను సీఈవోను అసలు ఈ కంపెనీలో నువ్వు ఫ్యూన్ గా కూడా పనికిరావు.. కుట్రలు కుతంత్రాలు చేసి కంపెనీ చేజిక్కించుకుని ఇప్పుడు నాకే చెప్తున్నావా..? అంటూ తిడుతుంది. ఉద్యోగులందరూ షాకింగ్ చూస్తుంటారు. సూరజ్ గట్టిగా జ్యోత్స్న అని అరిస్తే.. జ్యోత్స్న ఉలిక్కి పడి తేరుకుంటుంది. తాను సూరజ్ కొట్టిందంతా కలా అనుకుంటుంది. మౌనంగా కింద పడిపోయిన పేపర్స్ తీసుకుని మీకు నచ్చే విధంగా వర్క్ చేసి తీసుకు వస్తాను సార్ అంటూ వెళ్లిపోతుంది. మాలిని మాత్రం కోపంగా చూస్తూ.. ఎన్ని రోజులు భరిస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది.
తర్వాత దీప, కార్తీక్, జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఇంత జరిగాక ఇక్కడి నుంచి వెళ్లిపోతావు అనుకున్నాము అంటారు. అందుకు జ్యోత్స్న ఫిలాసఫీ చెప్తుంది. వెళ్లిపోవాలి అనుకున్నాను కానీ ఓడిపోయా బావ. గొప్పింటికి బిడ్డగా రావడం గెలుపు అనుకున్నా.. కన్న తల్లికి దూరం అవ్వడం ఓటమి అని లేటుగా అర్థం అయింది.. అమ్మానాన్నలను ప్రేమించడం గెలుపు అనుకున్నా.. వాళ్ల కోసం ఏం చేయలేకపోవడం ఓటమి అని లేటుగా అర్థం అయింది.. ఇష్టమైన వాడిని ప్రేమించడం గెలుపు అనుకున్నా కానీ వాడు నన్ను కాదు అనుకొని వెళ్లిపోవడం ఓటమి అని లేటుగా అర్థం అయింది బావ అంటూ జ్యోత్స్న ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే..
కార్తీక్, దీప ఆశ్చర్యంగా చూస్తుంటారు. జ్యోత్స్న తాను అన్ని రకాలుగా ఓడిపోయానని బాధపడుతుంటే.. నువ్వు ఓడిపోలేదు జ్యోత్స్న నిన్ను నువ్వు గెలవడానికి నేర్చుకుంటున్నావు ఎందుకంటే ఈ సిచ్యుయేషన్‌లో పాత జ్యోత్స్న అయితే సూరజ్ చెంప వాయించేది. కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నావు చూడు అక్కడే నీ గెలుపు మొదలైంది అంటూ దీప, కార్తీక్ చెప్తారు. అసలు ఆఫీసులోంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన నువ్వు మళ్లీ ఎందుకు ఆగిపోయావు అని దీప, కార్తీక్ అడిగితే.. దశరథ తన మీద పెట్టుకున్న నమ్మకం గుర్తుకు వచ్చి ఆగిపోయానని చెప్తుంది జ్యోత్స్న. అయితే ఇలాంటి సంఘటనలు నీకు మళ్లీ మళ్లీ ఎదురువుతాయి. సూరజ్‌తో జాగ్రత్తగా ఉండాలి నువ్వు అంటూ దీప చెప్తుంది.
తర్వాత ఫైల్స్ మళ్లీ తీసుకుని జ్యోత్స్న సూరజ్ చాంబర్‌లోకి వెళ్తుంది. అక్కడ మాలిని, సూరజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీసులు వచ్చి జ్యోత్స్నను ప్రశ్నిస్తారు. మీరు కనిపిచని ఈ నాలుగు రోజులు ఏమయ్యారు..? ఎక్కడికి వెళ్లారు..? అని అడిగితే ఎవరో తనను కిడ్నాప్ చేశారని.. డబ్బులు డిమాండ్ చేశారని చెప్తుంది జ్యోత్స్న. వాళ్లను చూస్తే గుర్తు పడతారా అని పోలీసులు అడిగితే.. లేదు తన కళ్లకు గంతలు కట్టారని జ్యోత్స్న చెప్పగానే.. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా..? అంటూ పోలీసులు అడిగితే ఉందని జ్యోత్స్న చేయి ఎత్తి చూపిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.