Podarillu Today Episode October 23rd: అమ్మాయిలు కనిపిస్తే ఇలా వెళ్ళిపోతాడు ఏంట్రా అస్సలు ఊహించలేదు.. ఈ మనిషి ఇలాంటి వాడు అని మహాలక్ష్మి కన్నత చెప్తుంది అవును వదిన అన్నయ్య ఇలా ఉంటాడని నేను కూడా అసలు ఊహించలేదు అని కన్నా అంటాడు. అయితే మీ అన్నయ్య మీ ఇంటికి వెళ్లే వరకు నోరు మూసుకొని ఉండేలా నేను చేస్తాను చూడు అని కన్నా కడ్చిఫ్ తీసుకుని రూపాయి కాయిన్ కింద వేసి చక్రిని తీసుకోమని చెప్తుంది మహాలక్ష్మి.. చక్రి ప్యాంటు నిజంగానే చిరిగింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత చక్రి ఇక ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోతాడు అమ్మాయిలు దగ్గర చక్రి పరువు పోయేలా మహాలక్ష్మి చేస్తుంది. ఇకపోతే చక్రి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి అడిగిన కూడా చేతులు తీయకపోవడంతో అందరూ పళ్ళు ను నవ్వుతారు.
కేశవ షాప్ కి ఓనర్ అవ్వడానికి అడ్వాన్స్ ఇవ్వాలని అందరూ కూడా ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. షాప్ ఓనర్ రాగానే మాధవ చేతుల మీదుగా ఆ డబ్బులు ని ఇస్తారు. అయితే ఆ దగ్గరలో శైలు వచ్చి నేను షాప్ కొనేటప్పుడు లేకుండానే తను కొనేసుకున్నాడు వాళ్ల వాళ్లంటేనే తనకి ఇష్టం లేదంటే అసలు ఇష్టం లేదు కదా అని బాధ పడిపోతూ ఉంటుంది ఇక చక్రి షాప్ కి ఓనర్ అయ్యాడు కాబట్టి కచ్చితంగా మాకు పార్టీ ఇవ్వాలని అంటారు.. అందరూ కూడా రెస్టారెంట్లో చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటారు. నారాయణకు కూడా బిర్యానీ తీసుకుని వెళ్లి మహాలక్ష్మి ఇవ్వాలని అనుకుంటుంది. కన్నాకి ఇష్టం లేకపోయినా సరే కేశవాణి నారాయణ కి కూడా తీసుకోమని చెప్తుంది. అయితే కేశవా నారాయణకు కూడా పార్టీ కోసం అని బిరియాని తీసుకుంటాడు.
మహాలక్ష్మి నారాయణకు రాత్రి ఆ ద్రవపదార్థం పక్కనపెట్టి ఈ బిర్యానీ తినండి అని అంటుంది. నువ్వు తెచ్చావా అని నారాయణ అడుగుతాడు లేదు.. కేశవ షాప్ కి ఓనర్ అయ్యాడు కదా అందరికీ పార్టీ ఇచ్చాడు అందుకే నీకు కూడా తీసుకొని వచ్చాము అని చెప్తుంది మహాలక్ష్మి. నువ్వు ఆయన కోసం బిరియాని పెడుతున్నావా ఎందుకు వదిన నీకు అయిన అంటే ఇష్టం మా అమ్మ వెళ్లిపోవడానికి కారణం ఆయనే.. మా అమ్మని చంపేస్తానని బెదిరించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు అలాంటి వ్యక్తికి నువ్వు బిర్యాని పెడతావా అని బిర్యాని విసిరి కొట్టే ప్రయత్నం చేస్తాడు.. కన్నా కానీ మహాలక్ష్మి అందులో నుంచి ఒక్క మెతుకు కింద పడిన నేను అస్సలు ఊరుకోను అని అంటుంది. కన్నా మాత్రం ఆయన చేసిన పనికి అసలు అన్నం కూడా పెట్టకూడదని కోపంగా ఉంటాడు కానీ.. మహాలక్ష్మి మాత్రం కన్న సీరియస్ అవుతుంది..
ఎందుకురా మళ్లీ నాన్నతో గొడవపడి వస్తున్నావా అని లోపలికి వెళ్ళిన తర్వాత కన్నా తో మాధవ్ అడుగుతాడు. ఆయనకు భోజనం పెడుతుంది మా అమ్మని వెళ్లగొట్టిన అతనికి భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి అని కన్నా అడుగుతాడు. నాన్నని మొదటి నుంచి మహాలక్ష్మి ప్రేమగానే చూసుకుంటుంది. అయితే కన్నా మాత్రం మా అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన ఆయన మీద ఈ వీడికి ఎందుకు అంత ప్రేమ అని అడుగుతాడు. నేను ఆయనని మొదటి నుంచి అల్లాని చూసుకుంటున్నాను అయితే ఆయనే మీ అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించాడని నీకు తెలుసా అని మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. కన్నా మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మాధవ్ మాత్రం 20 ఏళ్లు నిన్ను వదిలేసి వచ్చినా మీ అమ్మ మళ్లీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఏంటో ఆశ్చర్యం లేదు కదా.. మహాలక్ష్మి ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాంటిది తనని బాధ పెడతావా అని కన్నాకి క్లాస్ పీకుతాడు..
రాత్రి కన్నా అలా మాట్లాడడంతో చక్రి మహాలక్ష్మి గదిలోకి వెళ్లి తనతో మాట్లాడాలని అనుకుంటాడు. అయితే చక్రి తాగేసి వచ్చాడేమో అని మహాలక్ష్మి భయపడుతుంది. మిమ్మల్ని కన్నా అలా అన్నాడని లోపలికి వచ్చాను అంతే తప్ప నేను తాగేసి రాలేదు అని చక్రీ అంటాడు. ఉదయం లేచిన తర్వాత మహాలక్ష్మి ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు. కన్నా మహాలక్ష్మికి సారీ చెప్పాలని అనుకుంటాడు కానీ మహాలక్ష్మి మాటకు మాటకు సమాధానం చెప్పడంతో కన్నా ఫీల్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..