E-Paper
Advertisement

పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు!

పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు!
Advertisement

Avinash Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఆయన కదలికలపై ఆంక్షలు విధించారు. పులివెందులలో ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. పులివెందుల పట్టణంలో బీఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉందని.. అలాగే పోలీస్ యాక్ట్ 30 కూడా విధించినట్లు ఎంపీకి తెలియజేశారు. కాబట్టి నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు గుమ్మిగూడినా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించారు.

అయితే ఇటీవల అక్టోబర్ 17న ఈ తరహా ఆంక్షలను ఉల్లఘించిన విషయాన్ని ఎంపీ అవినాష్ కు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు ప్రస్తావించారు. మరోమారు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంపీని హెచ్చరించారు. ఈ మేరకు పులివెందుల అర్బన్ సీఐ పేరిట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Also Read: జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!

అంతకుముందు గురువారమే అవినాష్ రెడ్డిని కడపలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డప వైకాపా కార్యాలయంలో ఆయనతో పాటు మాజీ మంత్రి అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేశ్‌తో పాటు మరికొందరు నేతలను కడపలో అదుపులోకి తీసుకుని పులివెందులకు తీసుకొచ్చారు. అంతేకాకుండా అవినాష్‌ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఓ వైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటం, ఇటీవల చోటుచేసుకున్న రాళ్ల దాడి దృష్ట్యా పోలీసులు వైకాపా నేతలపై ఆంక్షలు విధిస్తున్నారు.

Advertisement

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

సీఈసీ నియామక మార్పులపై జగన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

విజయవాడ పడమట డొంక సెంటర్‌లో యువకుడు హత్య.. నిందితులు అరెస్ట్!

విజయనగరంలో కోలాహలంగా పైడితల్లి అమ్మవారి జాతర!

ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

Big Stories

Advertisement
×