E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే
Advertisement

Pak Razaullah Khan Mashwani:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య మూడవ టెస్ట్ నిన్న ప్రారంభమైంది. ఎడ్జ్ బాస్ట‌న్ (Edgebaston) వేదికగా నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ మ్యాచ్ షురూ కాగా.. ఇందులోనూ పాకిస్తాన్ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్, 133 పరుగులకు కుప్పకూలింది. ఎప్పటిలాగే టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ అత్యంత దారుణంగా విఫలమైంది. సౌదీ షకీల్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి పక్కకు పెడితే.. ఆ జట్టులోకి కొత్తగా వచ్చిన రజావుల్లా మష్వానీ ( Pak Razaullah Khan Mashwani) ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పదునైన బౌలింగ్ చేస్తున్న రజావుల్లా మష్వానీను చోటా షోయబ్ అక్తర్ తో పోల్చుతున్నారు. ఈ మ్యాచ్ లో ఇప్పటికే అతడు రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో రజావుల్లా మష్వానీ పేరు మారుమోగుతోంది.

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య మూడవ టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సందర్భంగా రజావుల్లా మష్వానీ ( Pak Razaullah Khan Mashwani) అరంగేట్రం చేశాడు. అయితే ఇతని అరంగేట్రం వెనుక పెద్ద స్టోరీ ఉంది. వరుసగా రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్…. మూడో టెస్ట్ కోసం కొంతమంది కొత్త క్రికెటర్లను బరిలోకి దించింది. అయితే రెండో టెస్ట్ పూర్తికాగానే ఖైబర్ పఖ్తుంఖ్వా అనే కొండ ప్రాంతంలో ఉన్న రజావుల్లా మష్వానీకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ఫోన్ కాల్ చేశారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అయితే ఆ సమయంలో రజావుల్లా మష్వానీ మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది. దీంతో ఎలాగైనా అతడిని పట్టుకోవాలని… పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన కోచ్, ఆ కొండ ప్రాంతానికి బయలుదేరాడు. దాదాపు రెండు రోజుల పాటు రజావుల్లా మష్వానీ జాడ కోసం వెతికి మరి పట్టుకున్నాడు. పాకిస్తాన్ జట్టు తరఫున మూడో టెస్టులో ఆడాలని అతడికి ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రజావుల్లా మష్వానీ పాస్ పోర్టు కూడా మొన్నటి వరకు లేదు.

రెండు రోజుల్లోనే రజావుల్లా మష్వానీకు పాస్ పోర్ట్

Advertisement

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న కోసం సెల‌క్ట్ అయిన రజావుల్లా మష్వానీకి పాస్ పోర్ట్ లేదు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆ ప‌నిపైన ప‌డింది. కేవ‌లం రెండు రోజుల్లోనే రజావుల్లా మష్వానీకి పాస్ పోర్ట్ సిద్ధం చేసింది. ఇంగ్లండ్ కు వెళ్లేలా వీసా కూడా చ‌క‌చకా సంపాదించింది. ఇక ఇప్పుడు మూడో టెస్టు ఆడుతోన్న రజావుల్లా అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. చోటా షోయ‌బ్ అక్త‌ర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. కాగా ఇత‌ని వ‌య‌స్సు 21 ఏళ్లు మాత్రమే. గంట‌కు 144 కిలో మీట‌ర్ల వేగంతో బంతులు సంధిస్తాడు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

Tags

Related News

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

Big Stories

Advertisement
×