E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         
Advertisement

Karthika Deepam 2 serial today Episode: పగ తీర్చుకోవడం కోసమే మా ఇంటికి వచ్చావా నువ్వు అంటూ జ్యోత్స్న అడిగితే.. అవునని చెప్తాడు సూరజ్‌. మరి పగ తీర్చుకోవడానికే వచ్చిన నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు.. ఎందుకు వెంటపడ్డావు.. ఎందుకు ఐలవ్యూ చెప్పావు.. నీ పగలో నన్ను ప్రేమించడం కూడా ఒక భాగమా..? నువ్వు మనఃస్పూర్తిగా నన్ను ప్రేమించలేదా… అంటూ జ్యోత్స్న సూటిగా ప్రశ్నిస్తే.. సూరజ్‌ తాను ఏం చేసినా అమ్మ కోసమే చేశానని పక్కకు తిరిగి చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న ఆ మాట నా కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పు.. నన్ను నువ్వు ప్రేమించలేదని.. నేనంటే నీకు ఇష్ట లేదని నన్ను చూస్తూ చెప్పు అంటూ ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.

అందుకు సూరజ్‌ ఎటు చూసినా నిజం చెప్తున్నాను అనగానే.. మా అమ్మ మీద పగతో ఇదంతా చేశానన్నావు సరే కానీ నా మీద ప్రేమ లేదంటే నేను నమ్మను అంటుంది. నన్ను మార్చింది నువ్వు.. ఎంతలా మార్చేశావు అంటే నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అన్నంతగా మార్చేశావు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినోచ్చేమో కానీ నా మనసు వినదు అంటూ జ్యోత్స్న ఏడుస్తుంటే.. సూరజ్‌ మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు కానీ నన్ను మర్చిపో.. అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

దక్షిణమూర్తి ఇంట్లో టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతుంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు ఏం చేయాలి.? ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే దీప, కార్తీక్‌ వెళ్తారు. వాళ్లను చూసిన మాలిని మీ తాత మిమ్మ్లని రాయబారానికి పంపాడా..? సూరజ్‌ను తీసుకురమ్మన్నాడా..? అంటూ ప్రశ్నిస్తుంది. అయితే తాము వచ్చింది సూరజ్‌ కోసం కాదని తాత దక్షిణమూర్తి కోసమని చెప్తాడు కార్తీక్‌. దక్షిణమూర్తి దగ్గరకు వెళ్లి అసలు సుమిత్ర అత్త మీ సొంత కూతురేనా తాత అని ప్రశ్నిస్తాడు కార్తీక్‌. ఆ మాటలకు దక్షిణమూర్తి షాక్‌ అవుతాడు. నీ సొంత కూతురైతే ఎందుకు అంతలా అత్తను సాధిస్తున్నావు.. మీ వల్ల తాను ఇప్పుడు చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఇదేనా కన్నతండ్రిగా నువ్వు కోరుకునేది అంటూ ప్రశ్నిస్తాడు.

అందుకు దక్షిణమూర్తి కంగారుపడుతూ సుమిత్రకు ఏమైందని అడుగుతాడు. కూతురు పెళ్లి ఆగిపోవడంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుకు ఫోటోకు దండ ఉన్నట్టే అక్కడ మీ కూతురు ఫోటోకు దండ ఉండేదని చెప్తుంటే.. మాలిని కల్పించుకుని మీ తాత భలే ట్రైనింగ్‌ ఇచ్చి పంపించాడురా చాలా సెంటిమెంట్‌ డైలాగులు చెప్తున్నావు. మీరు డైలాగులు చెప్పినంత మాత్రాన మా మామయ్య తన కొడుకు చావును మర్చిపోతాడా..? అంటుంది. కార్తీక్‌, దీప ఎంత చెప్పినా మాలిని, దక్షిణమూర్తి కన్వీన్స్‌ కాకపోయే సరికి చివరికి మీ ఇంట్లో మేమిద్దరం ఊడిగం అయినా చేస్తాం కానీ సూరజ్‌, జ్యోత్స్నల పెళ్లి చేయండని.. సుమిత్రమ్మను ప్రశాంతంగా ఉంచండని దీప అడిగితే.. మాలిని కోపంగా ప్రతిసారి సుమిత్రను వెనకేసుకొస్తావు.. అసలు ఎవరే నువ్వు సుమిత్ర తరపున మాట్లాడటానికి.. నువ్వేమైనా సుమిత్ర కూతురివా..? మా ఇంటి పగతో కానీ ప్రేమలతో కానీ ఏ సంబంధ లేని అనాథవి నీకెందుకు ఇవన్నీ అంటూ తిట్టి వెళ్లిపోమ్మని చెప్తుంది మాలిని.

Advertisement

జ్యోత్స్న దగ్గరకు వెళ్లిన దాసు అసలు నిజం మాలినికి చెప్తానని అప్పుడైనా మీ పెళ్లికి ఒప్పుకుంటుందేమోనని అంటాడు. అప్పుడు జ్యోత్న్స తాను సుమిత్ర కూతురు కాదన్న విషయం తెలిస్తే సూరజ్‌ అసలు తనను పట్టించుకునేవాడే కాదని.. సుమిత్ర, దశరథల మీద ఉన్న పగ సాధించడం కోసం నా మనసుతో ఆడుకున్నాడు కానీ ఏనాడు హద్దులు దాటలేదని క్యారెక్టర్‌ పరంగా వాడు చాలా మంచివాడని చెప్తుంది జ్యోత్స్న.  ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×