Emmanuel : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి.. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నారు. మరి కొంతమంది బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు… అలాంటి వారిలో కమెడీయన్ ఇమ్మానుయేల్ ఒకరు.. జబర్దస్త్ ద్వారా తన పాపులారిటీని పెంచుకున్న ఇమ్మానియేల్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో చేస్తున్నాడు.. ప్రస్తుతం స్టార్ మా లో బిగ్ బాస్ లేని లోటుని ఈ షో ద్వారా తీరుస్తున్నారు. ఈ షోలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య టఫ్ పోటీ ఉంటుంది. హగ్గులు, కిస్సులు అమ్మో దేనికి ఈ షో తీసిపోవడం లేదు.. ఈ షో కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.
కోరికను తీర్చుకున్న ఇమ్మానుయేల్..
కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.. అందులో అమ్మాయిలకు అబ్బాయిలకు శ్రీముఖి ఒక ఫన్నీ గేమ్ ని పెట్టింది. ఒక డబ్బాలో బాల్ వేసి బాయ్స్-గర్ల్స్ టీముల నుంచి చెరొకరిని పిలిచి ఎవరు బంతిని బయటికి తీస్తారో వాళ్లు విన్ అవుతారంటూ చెప్పింది. అయితే ముందుగా గర్ల్స్ నుంచి శ్రీసత్య.. బాయ్స్ నుంచి అమర్‌దీప్ వచ్చారు.. డబ్బాలో చెయ్యి పెట్టగానే వెంటనే సత్య చేయి తీసేస్తుంది. శ్రీముఖి అడగ్గా వీడు నా చెయ్యిని లోపల నొక్కుతున్నాడు అని చెప్తుంది. ఆ తరువాత సత్యభామ సీరియల్ హీరోయిన్ దేబ్జాని, జబర్దస్త్ ఇమ్మానుయేల్ గేమ్ ఆడటానికి వచ్చారు. చేయి బాక్స్‌లో పెట్టగానే అయ్యో వదలండి.. వదలమని చెప్పండి అంటూ దేబ్జానీ ఆటపట్టించింది. ఇది వినగానే ఛీ కక్కుర్తి వెథవ అంటూ ఇమ్మానుయేల్‌ని తిడుతుంది అనసూయ. ఇమ్ము గేమ్ గెలుస్తాడు. అయితే నీకేం కావాలి అని అడుగుతుంది శ్రీముఖి. దానికి ఇమ్ము నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టాలని అడుగుతాడు. ఇక దెబ్జాని వెంటనే ముద్దుపెట్టేస్తుంది.. కత్తిలాంటి ఫిగర్ ముద్దు పెట్టడంతో ఇమ్మానుయేల్ గాల్లో తేలిపోతూ ఉంటాడు. అది చూసి నా బాయ్స్ ఇమ్మానుయేల్ పంట పండిందిరో అంటూ అరుస్తారు..
Also Read :అక్కినేని ఇంట పెళ్లి సందడి.. హాజరైన సినీ ప్రముఖులు..
షాక్ లో అనసూయ, శేఖర్ మాస్టర్..!
అయితే అనసూయ శేఖర్ మాస్టర్ ఇమ్ముకు ముద్దు పెట్టేసిందా మేం చూడలేదే ఇంకొకసారి ఇంకొకసారి అని అంటారు.. గేమ్ ఛేంజర్స్ చూడకపోతే ఎలా దాదా మళ్లీ పెట్టెయ్ అంటూ ఇమ్మూ ఓవరాక్షన్ చేశాడు. ఇలా గేమ్ మాట ఏమో కానీ ఇమ్మూకి అయితే బాగా వర్కవుట్ అయింది.. మొత్తానికైతే ఇమ్మానుయేల్ పంట పండిందని ప్రోమో ను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ప్రోమో ఎలా ఉందో మీరు ఇటు లుక్కేసుకోండి..