Akkineni Akhil wedding : అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక నేడు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనాబ్ రవ్ డ్జీని వివాహం చేసుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఈ ఇద్దరు శుక్రవారం ఉదయం ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్ 26న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 3 గంటలకు వివాహం జరిగింది.. వీరి పెళ్లికి చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు హాజరైయి కొత్త జంటను ఆశీర్వదించారు. జూన్ 8 ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా రిసెప్షన్ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. రిసెప్షన్ కు టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్లు, రాజకీయవేత్తలు తదితరులు హాజరుకానున్నారని సమాచారం.
గ్రాండ్ గా అఖిల్, జైనాబ్ ల వివాహం..
అక్కినేని నాగార్జున, అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని , జైనాబ్ ల వివాహ మహోత్సవం నేడు నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున హాజరైయారు. గత ఏడాది నవంబర్ 26న అక్కినేని అఖిల్, జైనాబ్ లు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జనవరిలో లేదా మార్చిలో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి జూన్ 6న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటుగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి కొత్తజంటను ఆశీర్వదించారు. ఇది పెళ్లి వేడుకొక సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read :అల్లు ఫ్యామిలీలో గొడవలు.. అదే కారణమా..?
రిసెప్షన్ ఎప్పుడు, ఎక్కడంటే..?
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నేడు ఓ ఇంటివాడయ్యాడు. ఒక పారిశ్రామికవేత్త కుమార్తె జైనాబ్ తో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. అయితే జూన్ 8 ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్షన్ ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఆ రిసెప్షన్ కోసం నాగార్జున భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆ వేడుకకు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, అలాగే పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని సమాచారం.. గత ఏడాది నాగచైతన్య, శోభిత వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక అఖిల్ అక్కినేని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది..
Recent pic of Akhil Akkineni (son of Nagarjuna) with his ☪️ fiancé Zainab
One famous jeeja of andh-namazis loading in 2025 ⚡ pic.twitter.com/Q28oIJcXZb
— Raj (@Worryna_) January 7, 2025
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన @AkhilAkkineni8
Congratulations both of you..
happy marriage life 😍😍#AkhilWedding #AkhilZainab pic.twitter.com/S995RzyGce— తార-సితార (@Tsr1257) June 6, 2025