Pakistan Attack Plan: భారత గూఢచార సంస్థలు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత్‌పై కొత్త దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గుర్తించాయి. డిసెంబర్ 31 లేదా రిపబ్లిక్ డే ముందు భారీ ఉగ్రదాడులు జరిపేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా జైషే మహ్మద్ మహిళా విభాగాన్ని ‘జమాత్-ఉల్-మెమునాత్’ పేరుతో ప్రారంభించినట్లు తెలిసింది. వింగ్‌లో ఇప్పటివరకు సుమారు 5,000 మంది మహిళలు చేరగా.. ఆ సంస్థ మసూద్ అజర్ సోదరి సాదియా ఈ మహిళా వింగ్‌కు నాయకత్వం వహిస్తుంది. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూరులో సాదియా భర్త మృతిచెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పెద్ద ఎత్తున దాడులు చేయాలనే ఉద్దేశంతో మహిళా వింగ్‌ను మరింత బలపరిచినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఆన్‌లైన్ ద్వారా ఉగ్రచర్యల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు సమాచారం.