E-Paper
Advertisement

అసిస్టెంట్ పై కొమురక్క లైంగిక వేధింపులు.. దాడి ఘటనతో బయటపడ్డ నిజాలు!

అసిస్టెంట్ పై కొమురక్క లైంగిక వేధింపులు.. దాడి ఘటనతో బయటపడ్డ నిజాలు!
Advertisement

Jabardasth Komurakka:లేడీ గెటప్పులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ ఫేమ్ టీవీ ఆర్టిస్ట్ కొమురక్క గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. లేడీ గెటప్ లో అదరగొట్టేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కొమురక్క పై గత రెండు రోజుల క్రితం 8 మంది దాడి చేసిన ఘటన ఒక్కసారిగా అభిమానులను ఉలిక్కిపాటుకు గురిచేసింది.. మెహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనాల మేరకు.. కొమురక్క ఇంట్లో గతంలో బంగారం చోరీకి గురైంది.

కొమురక్కపై దాడి.. 8 మంది అరెస్ట్..

ఈ విషయంలో కొమురక్క తన అసిస్టెంట్ శ్రీనాథ్ ను నిలదీయగా ..నేరం అంగీకరించి, తిరిగి ఇస్తానని చెప్పాడట. ఎంతకూ ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రిందట కొమురక్క మరోసారి శ్రీనాథ్ ను మందలించింది. అయితే శ్రీనాథ్ తన స్వగ్రామంలోని స్నేహితులకు విషయం చెప్పి రాత్రి 11 గంటలకు కొమురక్కను బయటకు పిలిపించి.. తాము అభిమానులమని, ఫోటో దిగడానికి వచ్చామని నమ్మించి కొమురక్కను తీవ్రంగా గాయపరిచారు. దీంతో కొమురక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

కొమురక్క నన్ను లైంగికంగా వేధించాడు – శ్రీనాథ్

Advertisement

అయితే ఇలాంటి సమయంలో కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్ విస్తుపోయే నిజాలు బయటపెట్టాడు. ముఖ్యంగా తనను కొమురక్క లైంగికంగా వేధిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఫరూక్ నగర్ మండలం కాశిరెడ్డికూడా గ్రామానికి చెందిన కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్ మాట్లాడుతూ..” గత నాలుగేళ్లుగా కొమురక్క వద్ద నేను అసిస్టెంట్ గా, సైడ్ యాక్టర్ గా పనిచేస్తున్నాను. రెండు సంవత్సరాలు నాతో బాగానే ఉన్న కొమురక్క.. గడిచిన రెండు సంవత్సరాల నుండి నా పట్ల అసభ్యకరంగా వాట్స్అప్ పోస్టులు పెడుతున్నాడు. వాట్స్అప్లో రెగ్యులర్ గా చాట్ చేస్తూ నన్ను ఏకాంతంగా కలవమని వేధిస్తున్నాడు* అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనాథ్.

ఎక్కడెక్కడో చేతులు వేసేవాడు – శ్రీనాథ్..

అంతేకాదు శ్రీనాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఒంటరిగా కలవమని అడిగేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తెలుసుకొని వచ్చి. నాపై ఎక్కడెక్కడో చేతులు వేసేవాడు. వాట్సాప్ లో నన్ను ప్రేమిస్తున్నావా ? లేదా? దేవుడిపై ఒట్టేసి చెప్పు అంటూ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు . ఇక అప్పటినుండి తన మాటలకు నేను అడ్డు చెప్పాను. దాంతో నాపై వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ విషయాలను కొమురక్క డ్రైవర్ కి నేను చెప్పడంతో.. నాపై మరింత కోపం పెంచుకున్నాడు. ఇక నాలుగు రోజుల క్రితం నన్ను ఒంటరిగా రైకల్ టోల్గేట్ వద్దకు పిలిపించుకొని.. తాను కాలకృత్యాలు తీర్చుకోవడానికని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి.. తనతో పాటు ముగ్గురు వ్యక్తులతో కలిసి నన్ను తీవ్రంగా కొట్టాడు. దీంతో నా చెవుల నుండి రక్తం వచ్చింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని, బంగారం చోరీ కేసు పెడతానని బెదిరించాడు” అంటూ శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

also read:సైలెంట్ గా కూతురు ఎంగేజ్మెంట్ చేసిన బండ్ల గణేష్.. వరుడు ఎవరంటే?

సాక్షాలతో సహా బట్టబయలు!

ఇక రెండు రోజుల తర్వాత నా ఇంట్లో ఈ విషయం తెలియడంతో నా తమ్ముడితో పాటు కొంతమంది నా గ్రామ యువకులు, కొమురక్కపై దాడి చేశారు అంటూ తెలిపారు. ఇక చేసేది ఏమి లేక తన బంగారం నేను దొంగిలించినట్లు నాపై తప్పుడు కేసు పెట్టాడు.. నాపై దాడి, లైంగిక వేధింపుల విషయంలో కొమురక్క అసభ్యకర చాటింగ్, స్క్రీన్ షాట్స్ ని సాక్షాలతో సహా ఫిర్యాదు చేశాను” అంటూ శ్రీనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు కొమురక్క అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఇంత నీచంగా చాటింగ్ చేయడం ఏంటి ? అసలు కొమురక్క వ్యక్తిత్వం ఇదేనా అంటూ ఆశ్చర్యపోతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీదరించుకుంటున్నారు. మరి దీనిపై కొమురక్క ఏదైనా స్పందిస్తాడేమో చూడాలి

Related News

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Big Stories

Advertisement
×