E-Paper
Advertisement

జనగామ జిల్లాలో విషాదం.. వాగులో పడి ఇద్దరు బాలురు మృతి!

జనగామ జిల్లాలో విషాదం.. వాగులో పడి ఇద్దరు బాలురు మృతి!
Advertisement

Jangaon District: జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో గురువారం సాయంత్రం తీరని విషాదం చోటుచేసుకుంది. సరదాగా జాతర చూడటానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె మనోజ్ (12), గూటం అకిరా నందన్ (13) అనే ఇద్దరు స్నేహితులు నష్కల్ గ్రామంలోని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న జాతరను చూసేందుకు సైకిల్‌పై వెళ్లారు. జాతర చూసిన అనంతరం తిరిగి వస్తూ.. నష్కల్ రామాలయం సమీపంలోని ఆకేరు వాగు వద్దకు చేరుకున్నారు. తమ సైకిల్‌ను కడగాలనే ఉద్దేశంతో వారు వాగులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే.. నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయారు.

Advertisement

సాయంత్రం సమయానికి వాగు ఒడ్డున వారి సైకిల్, చెప్పులు ఒంటరిగా కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, ఇద్దరు బాలురు నీటిలో మునిగి మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ పిల్లల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను వరంగల్‌లోని MGM ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హఠాత్పరిణామంతో వంగాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే ఇద్దరు బాలురు మృత్యువాత పడటంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: సామాన్యులకు షాక్.. ఏయే వస్తువులపై ధరలు పెరిగాయంటే?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×