E-Paper
Advertisement

సైలెంట్ గా కూతురు ఎంగేజ్మెంట్ చేసిన బండ్ల గణేష్.. వరుడు ఎవరంటే?

సైలెంట్ గా కూతురు ఎంగేజ్మెంట్ చేసిన బండ్ల గణేష్.. వరుడు ఎవరంటే?
Advertisement

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వరుస శుభకార్యాలు అభిమానులను ఆనందానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరికొంతమంది నిశ్చితార్థం చేసుకొని వివాహ వేడుక దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులవుతున్నారు. అలా ఈ ఏడాది విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న , అల్లు శిరీష్ – నయనిక రెడ్డి, బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం ఇలా కొంతమంది ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీ కిడ్ నిశ్చితార్థం చేసుకుంది . అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో.. ఆమె కాబోయే భర్త ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూతురు నిశ్చితార్థం..

అసలు విషయంలోకి వెళ్తే.. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ భక్తుడిగా తనను తాను పరిచయం చేసుకున్న బండ్ల గణేష్.. ఒకవైపు నటుడిగా, మరొకవైపు నిర్మాతగా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన తన కూతురికి ఈరోజు సింపుల్ గా నిశ్చితార్థం నిర్వహించారు. ఈ మేరకు పోస్ట్ కూడా పంచుకున్నారు బండ్ల గణేష్.. “శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు..దేవుడి ఆశీస్సులతో.. మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం.. చిరంజీవి సూర్యతేజ చిలుకూరి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జనని బండ్లల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ” అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు. దీంతో ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బండ్ల గణేష్ తన కూతురు జనని బండ్ల నిశ్చితార్థాన్ని చాలా సింపుల్ గా జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.

బండ్ల గణేష్ కాబోయే అల్లుడి బ్యాక్ గ్రౌండ్?

Advertisement

ఇకపోతే జనని బండ్ల కాబోయే భర్త పేరు సూర్య తేజ చిలుకూరి. ఈయన బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. సూర్య తేజ తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నట్టు సమాచారం. ఇకపోతే సూర్యతేజ ఏం చేస్తున్నారు? ఆయన నివాస స్థలం ఎక్కడ ? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే బండ్ల గణేష్ తన కూతురి నిశ్చితార్థాన్ని జరిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అవి చూసిన అభిమానులు జనని బండ్ల కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బండ్ల గణేష్ కూతురు, కాబోయే అల్లుడు జంట చాలా అందంగా, చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

బండ్ల గణేష్ విషయానికి వస్తే..

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బండ్ల గణేష్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది . చిన్నతనంలోనే షాద్ నగర్లో స్థిరపడిన ఆయన.. పౌల్ట్రీ వ్యాపార నేపథ్యం నుండి సినీ రంగానికి అడుగుపెట్టారు ..నటుడిగా కెరియర్ ప్రారంభించి, సహాయ నటుడిగా మెప్పించి.. నిర్మాతగా మారి తన దశను మార్చుకున్నారు. “పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్” బ్యానర్ పై పవన్ కళ్యాణ్ తో నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల మరో ప్రొడక్షన్ హౌస్ “BG బ్లాక్ బస్టర్” అనే బ్యానర్ ని కూడా స్థాపించిన విషయం తెలిసిందే.

Advertisement

also read:గుడ్ న్యూస్.. రష్మిక ప్రెగ్నెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×