ఏపీ రాజకీయాలు రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అవసరం. అక్కడే పాలనా పరమైన వ్యవస్థ, అనుమతుల విభాగం, ప్రభుత్వ ఆఫీసులు, ప్రయివేటు సంస్థలు, హైకోర్టు భవనం, కంపెనీలు, పరిశ్రమలు కొలువుదీరగా.. ఉద్యోగావకాశాలు సృష్టి జరుగుతుంది. అయితే, ఇంతకాలం ఏపీకి సరైన రాజధాని లేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధానిగా అమరావతిని ప్రతిపాదించారు. రాజధాని నిర్మాణాలు సైతం చేపట్టారు. మధ్యలోనే ప్రభుత్వ కాలం ముగిసిపోవడంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ.. అసలు ఏపీకి రాజధాని అనేది లేకుండా చేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిని రాజధానిగా నాటి సీఎం జగన్ అంగీకరించలేదు కదా.. ఏకంగా మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.
జగన్ సర్కార్ అమరావతిని రాజధానిగా ఎందుకు అంగీకరించడం లేదంటే దానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల రాబోతున్నదని తెలిసి అక్కడి రైతులకు తక్కువ డబ్బులు ఆశజూపి వేల ఎకరాలను టీడీపీ నేతలే కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు ప్రస్తావించారు. దీనికి తోడు ఒకే దగ్గర రూ.లక్షల కోట్లు కుమ్మరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి జరగదని.. గతంలో హైదరాబాద్‌ను రాజధానిగా చేసి రూ.లక్షల కోట్లు కుమ్మరిస్తే చివరకు రాష్ట్రం విడిపోయాక అది తెలంగాణ ప్రాంతానికి వెళ్లిందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడురాజధానుల అంశాన్ని సీఎంగా ఉన్నప్పుడు జగన్ తెరమీదకు తెచ్చారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని పలానా చోటే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అవుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే పరిపాలన సీఎం, మంత్రుల చేతుల్లో ఉంటుంది. వారు ఎక్కడ ఉంటే అధికారులు అక్కడకే వెళ్లి పాలన కొనసాగిస్తారు.ఎప్పటినుంచో ఇదే నడుస్తోంది.ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో జగన్ అమరావతి నుంచి కాకుండా వైజాగ్ నుంచి తన పాలనను కొనసాగించారు.అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో ఉంది.లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు.. త్వరలోనే రాజ్యసభలో ఆమోదం పొందనుంది. అనంతరం ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత రానుంది. ఒక్కసారి చట్టబద్ధత వచ్చాక రాజధానిని మార్చడానికి వీలు లేదని కూటమి సర్కార్ చెబుతున్నది.మాజీ సీఎం జగన్ మాత్రం అలాంటిది ఏమీ లేదని ఖరాఖండీగా చెబుతున్నారు.
వన్ ప్లస్, షావోమీ, రియల్‌మీ.. భారీగా పెరిగిన మెుబైల్స్ ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?
రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయాల్సింది కేంద్రం కాదని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయడం కంటే.. ‘మావిగన్’ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో రాజధానిని డెవలప్ చేస్తే బాగుంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని, ఇదే తనకున్న ప్లాన్ బీ అని జగన్ పేర్కొన్నారు. కాగా, జగన్ వ్యాఖ్యలు విన్న జనం మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి కేంద్రంగా రాజధాని కొనసాగుతుందని నమ్మకం లేదని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. జగన్ ఇప్పుడే సంకేతాలు ఇస్తున్నారని కూటమి నేతలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, కూటమి హయాంలో ఏపీ దగా పడిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా.. ఏపీ ఎవరి వల్ల దగా పడిందో, ఏపీ ద్రోహులు ఎవరో జగన్‌కే బాగా తెలుసు అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.